watsup

సోష‌ల్ మీడియాపై పెద్ద‌ల‌స‌భ‌

సోష‌ల్ మీడియా ప్ర‌మాద‌క‌రంగా మారుతుంది. సోష‌ల్ మీడియాలో అడ్డూ అదుపూ లేకుండా చేస్తున్న ప్ర‌చారం దుష్ప్ర‌భావం చూపుతుంది. దీనిని నియంత్రించేందుకు రాష్ట్ర‌, జాతీయ స్థాయిల‌లో చ‌ట్టాలు తేవాలని తెలంగాణ శాస‌న‌మండ‌లి అభిప్రాయ‌ప‌డింది. మండలిలో సభ్యులు ఫారూక్‌ హుస్సేన్, నారదాసు లక్ష్మణరావు మాట్లాడుతూ సోషల్‌ మీడియా పట్ల నియంత్రణ లేకపోవడంతో విచ్చలవిడిగా సమాచారం పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు మాట్లాడిన వాటిని కూడా వక్రీకరించి ప్రజల్లోకి పంపుతున్నారని, గూగుల్, వాట్సాప్‌లాంటి సామాజిక మాధ్యమాలు విదేశీ కంపెనీలకు చెందినవని, ఆ దేశాల్లోని చట్టాలకు అనుగుణంగా వాటిని ఏర్పాటు చేశారని, మన దేశ చట్టాలకు అనుగుణంగా ఆ కంపెనీలు