telangana

క్యాబినెట్ : ప‌ల్లెకు పోదాం చలో చ‌లో

తెలంగాణ‌లో గ్రామ స్వ‌రాజ్య‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష్య‌త‌న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. నిన్న సాయంత్రం 3.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన క్యాబినెట్ స‌మావేశం ఏకంగా ఎనిమిది గంట‌ల పాటు జ‌రిగింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేయ‌డానికి కొత్త పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. గ‌డువులోగా గ్రామ పంచాయ‌తీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, ఈ సారి విధులు సక్ర‌మంగా నిర్వ‌ర్తించ‌ని పంచాయితీల‌పై ప్ర‌భుత్వమే చ‌ర్య‌లు తీసుకునేలా ఈ చ‌ట్టం ఉంటుంద‌ని ఈ శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో ఈ చ‌ట్టాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యంగా నిలుస్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. 5040

హ‌క్కుకు మించి కృష్ణా నీళ్ల కోసం ..

హ‌క్కుతో సంబంధం లేకుండా ఏకంగా 270 టీఎంసీల నీళ్లు కేటాయించాలంటూ ఆంధ్రా ప్ర‌భుత్వం కృష్ణా బోర్డుకు లేఖ రాసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇండెంట్ ఇవ్వ‌కుండా కాల‌యాప‌న చేసిన ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఇప్పుడు ఏకంగా 270 టీఎంసీలు అడ‌గ‌డం గ‌మ‌నార్హం. తెలంగాణ‌కు 122 టీఎంసీల నీళ్లు అవ‌స‌రం అంటూ తెలంగాణ అధికారులు గ‌తంలోనే లేఖ రాశారు. నాగార్జున సాగ‌ర్ పూర్తిగా నిండితే 338 టీఎంసీల నీరు ఉంటుంది. అందులో ఏకంగా 270 టీఎంసీలు ఆంధ్రా అడ‌గ‌డం వెన‌క కుట్ర క‌నిపిస్తుంద‌ని తెలంగాణ అధికారులు భావిస్తున్నారు. ఈ నెలాఖ‌రును కృష్ణా బోర్డు స‌మావేశం నేప‌థ్యంలో ఆంధ్రా విష‌యంలో ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటారో వేచిచూడాలి.

కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న గొప్ప‌త‌నం గురించి, తెలంగాణ గురించి ఆయ‌న క‌మిట్ మెంట్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ సంవ‌త్స‌రాలు) పుస్త‌కంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడు దేశ రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ లో కీల‌క‌నేత‌. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాక‌ముందు 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని స‌మైక్య రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేరింది. యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఆ స‌మ‌యంలో ప‌ద‌వుల పంప‌కంలో ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి అన్న విష‌యంలో కొంత సంధిగ్ధ‌త నెల‌కొంది.

సింగ‌రేణి వార‌సత్వ ఉద్యోగాల కోసం ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు ఇన్వాలిడేషన్‌ ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పనకు సింగరేణి యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 30న సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)తో కూడిన వైద్య నిపుణుల బృందంతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరిగా ఇతర శాఖల అధికారులు మెడికల్‌ బోర్డులో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

23న క్యాబినెట్ భేటీ

ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం తరఫున చేయాల్సిన తీర్మానాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వపరంగా సభలో ప్రస్తావించాల్సిన విషయాలపై చర్చిస్తారు. గతంలో జారీచేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లైన రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌, పీడీ, గేమింగ్‌, వ్యాట్‌, దుకాణాలు – సముదాయాలు, ఎక్సైజ్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

ముప్ప‌య్యేండ్ల క‌ల .. మూడేండ్ల‌లో

ముప్ప‌య్యేండ్ల క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల క‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మూడేండ్ల‌లో సాకారం చేసింది. క‌ల్వ‌కుర్తి నీళ్ల‌తో ఈ ప్ర‌భుత్వం మీ కాళ్లు క‌డిగింది. నియోజ‌క‌వ‌ర్గంలోని సాగుకు యోగ్య‌మ‌యిన ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇవ్వ‌డ‌మే కాదు. తెలంగాణ‌లోని ప్ర‌తి ప్రాంతానికి నీళ్లిస్తాం అని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కల్వకుర్తి మండలం ఎలికట్ట సమీపంలో ఉన్న డీ-29 కాల్వ వద్ద కృష్ణాజలాలను మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించి విడుదలచేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎంజీకేఎల్‌ఐ పథకాన్ని మూడు దశాబ్దాలకిందట మొదలుపెట్టినా, అప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు సాగునీరు

మ‌రో సారి భారీ వ‌ర్షాలు

రానున్న 24 గంట‌ల‌లో తెలంగాణ‌, ఆంధ్ర రాష్ట్రాల‌లో భారీ వ‌ర్షాలు కురుస్తాయ‌ని వాతావ‌ర‌ణ శాఖ వెల్ల‌డించింది. రెండు రోజుల క్రితం ఆగ్నేయ బంగాళాఖాతం ఏర్పడిన ఉపరితల ఆవర్తనం… ప్రస్తుతం అండమాన్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతోంది. ఈ నెల‌ 15వ తేదీ కల్లా తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తర్వాత ఇది తీవ్ర అల్పపీడనంగా బలపడుతుందని అధికారులు తెలిపారు. మరోవైపు రానున్న మూడు, నాలుగు రోజుల్లో ఉత్తర, మధ్య, వాయవ్య, తూర్పు భారతం నుంచి నైరుతి రుతుపవనాలు నిష్క్రమించనున్నాయి.

తెలంగాణలోని ప్ర‌తి ప‌ల్లె నాదే

తెలంగాణలోని ప్ర‌తి ప‌ల్లె నాదే. అన్ని ప్రాంతాల అభివృద్దే నా ల‌క్ష్యం. ఒక‌టి ఎక్కువ .. ఇంకోటి త‌క్కువ కాదు. తెలంగాణలో ఉన్న ప్రతి ఇంచు గురించీ నా హృదయం అంతే కొట్టుకుంటది. అంతే తన్లాడ్తది. నేను ఉద్యమం చేసిన్నాడు కోటి ఆశలతోని నా నాయకత్వాన్ని బలపర్చిన్రు. నన్ను నడిపించింది మీరే. అన్ని విధాలా అందిరికీ న్యాయం చేస్తా అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో జ‌రిగిన స‌భ‌కు ఆయ‌న హాజ‌ర‌య్యారు. కాంగ్రెస్ పాలకుల అసమర్థత వల్లే దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, పాలమూరు జిల్లాలు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యాయి. అందుకే న‌ల్ల‌గొండ‌, పాల‌మూరుకు న్యాయం చేసేందుకు

క‌ష్ట‌ప‌డ్డ తెలంగాణ .. ఇష్ట‌ప‌డి అభివృద్ది

ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నం. తెలంగాణ ప్ర‌జ‌లంద‌రి ఆశీస్సుల‌తో తెలంగాణ వ‌చ్చింది. మ‌న తెలంగాణ వాళ్ల‌కు పాలించ‌డం రాద‌ని హేళ‌న చేశారు. ఇప్పుడు సంక్షేమంలో దేశంలోనే ముందున్న రాష్ట్రం తెలంగాణ‌. చ‌రిత్ర‌లో ఎన్న‌డూ లేనంత‌గా పేద‌ల‌కు ప‌థ‌కాలు ప్ర‌వేశ‌పెట్టాం. 21.7 శాతం వృద్ధితో తెలంగాణ దేశంలోనే ముందంజలో ఉంది. నాకు రాజ‌కీయ జ‌న్మ‌నిచ్చిన సిద్దిపేట‌కు .. నాకు తెలంగాణ‌ను సాధించే బ‌లాన్నిచ్చిన సిద్దిపేట‌కు శిర‌స్సు వంచి న‌మ‌స్క‌రిస్తున్నా అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. సిద్దిపేట‌, సిరిసిల్ల‌లో ఆయ‌న నూత‌న క‌లెక్ట‌రేట్ ల నిర్మాణానికి శంకుస్థాప‌న కార్య‌క్ర‌మంలో పాల్గొన్న ఆయ‌న సిద్దిపేట ఏర్పాటు చేసిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌జ‌లను

కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

తెలంగాణ ఎవ‌రు తెచ్చారు ? ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? కేసీఆర్ గొప్పా ? కోదండ‌రాం గొప్పా ? సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. .. అది madeintg.com పాఠ‌కుల కోసం ముఖ్య‌మంత్రి గారి ప్రెస్ మీట్ పై ఇంకా వాదోప వాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నయి వాదోపవాదాలు పక్కన పెడితే వాస్తవాలను ఎవరైనా అంగీరించాల్సిందే ! ఆ వాస్త‌వాలు ఎలా ఉంటయ్ ? ఏమిటి తెలంగాణ , ఎక్కడినుంచి ఎక్కడికొచ్చినం !? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు