telangana movement

తెలంగాణ బ‌తుకే కొట్లాట‌

ప‌క్క‌నున్న త‌మిళ‌నాడు రాష్ట్రంల త‌మ రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కు చిన్న భంగం వాటిల్లినా అన్ని పార్టీలు ఏక‌మ‌వుతాయి. వేదిక‌లు వేర‌యినా వాటి ల‌క్ష్యం కేంద్రం మెడ‌లు వంచ‌డం త‌మ ప్ర‌యోజ‌నాల‌ను సాధించుకోవ‌డం. ప‌క్క‌న క‌ర్ణాట‌క‌దీ అదే ప‌రిస్థితి. విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో కూడా అధికార ప్ర‌తిప‌క్షాలు ఉప్పు నిప్పులా ఉన్నా త‌మ ప్రాజెక్టులు, ప్ర‌యోజ‌నాల గురించి మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు. కానీ అదేం చిత్ర‌మో తెలంగాణ‌ది నిత్యం కొట్లాట‌నే. తెలంగాణ నిల‌బ‌డాల‌ని చూసిన ప్ర‌తిసారి ప‌డ‌గొట్టాల‌ని బ‌య‌టోనిక‌న్నా ఎక్కువ‌గా ఇంటోడే ప‌నిచేస్తుంటాడు. 1947లో దేశానికి స్వాతంత్య్రం వ‌స్తే 1948 సెప్టెంబ‌రులో తెలంగాణ ఈ దేశంలో క‌లిసింది. 1948