tdp

మౌన‌మే కేసీఆర్ ఆయుధం

కేంద్రం మీద అసంతృప్తితో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్ల‌మెంటులో ఎన్డీఎ ప్ర‌భుత్వం మీద అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాడు. ప్ర‌త్యేక‌హోదాకు బ‌దులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్ర‌బాబు తీరును ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాడు. హోదాకు ప‌ట్టుబ‌ట్ట‌క‌పోవ‌డం మూలంగా ఆంధ్రా అన్ని రంగాల‌లో వెన‌క‌బ‌డుతుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మారు. చంద్ర‌బాబుకు ఆంద్రాలో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఎన్డీఎ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎంపీల‌తో నిర‌స‌న‌ల డ్రామా ఆడించాడు. తాజాగా అవిశ్వాసం పేరుతో మ‌రోసారి పిల్లిమొగ్గ‌లు వేశాడు. త‌న అనుకూల మీడియాతో దేశంలో ఏదో ఉప‌ద్ర‌వం రాబోతుంద‌న్న ప్ర‌చారం క‌ల్పించాడు.

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు

టీడీపీకి గుడ్ బై

మాజీ మంత్రి, దివంగ‌త హోంమంత్రి ఎలిమినేటి మాధ‌వ‌రెడ్డి స‌తీమ‌ణి ఉమా మాధ‌వ‌రెడ్డి టీడీపీకి రాజీనామా చేశారు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ తో ఆమె, ఆమె కుమారుడు సందీప్ రెడ్డిలు నిన్న భేటీ అయిన విష‌యం తెలిసిందే. రేపు కేసీఆర్ స‌మ‌క్షంలో వారు టీఆర్ఎస్ లో చేర‌నున్నారు. తెలంగాణ అభివృద్దిలో భాగం అయ్యేందుకు టీఆర్ఎస్ లో చేరుతున్నాన‌ని ఉమా మాధ‌వ‌రెడ్డి తెలిపారు. ఈ మేర‌కు టీడీపీకి రాజీనామా చేస్తున్న లేఖ‌ను ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుకు పంపారు. టీడీపీలో తెలంగాణలో ఉన్న నేత‌ల‌లో ముఖ్యులు అంద‌రూ పార్టీని వీడిన‌ట్లే భావించాలి.

శాడిస్టు చంద్ర‌దాసు భావప్రాప్తి

నాకు దూరం కాబ‌ట్టి నీకు దూరం కావాలి .. న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి నిన్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. నువ్వు నాకే ద‌క్కాలి. లేకుంటే యాసిడ్ పోసి చంపుతా. నాకు ద‌క్క‌నిది మ‌రెవ‌రికీ ద‌క్క‌డానికి వీలు లేదు. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ వ్య‌వ‌హారం అచ్చం ఇలాగే ఉంది. ఉంటుంది. ఆంధ్రోడు కాబ‌ట్టి ఆంధ్ర మీద ప్రేమ‌ను కాద‌న‌లేం. క‌మ్మోడు కాబ‌ట్టి చంద్ర‌బాబు మీద ప్రేమ ఆయ‌న వ్య‌క్తిగ‌తం. త‌న ప‌త్రిక‌కు లాభం జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆంధ్ర ప్ర‌భుత్వ అవినీతికి కొమ్ముకాయ‌డం ఆయ‌న వ్యాపార విష‌యం అని వ‌దిలేద్దాం. కానీ ఆయ‌న జీవిత‌కాలంలో ఒక్క‌సారి

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు

ఈ ఊరు స‌ర్పంచి .. ప‌క్క ఊళ్లె కావ‌లికారు.. అచ్చం ఈ సామెత లాగానే కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి ప‌రిస్థితి త‌యార‌యింద‌ట‌. తెలుగుదేశం పార్టీలో చేరి లిఫ్ట్ ఎక్కిపోయిన‌ట్లు స‌ర్రున ఎదిగిపోయిన రేవంత్ రెడ్డి ఓటుకునోటు కేసుతో పాతాళానికి ప‌డిపోయినా చింత చ‌చ్చినా పులుపు చావ‌లేదంటూ తెలంగాణ ప్ర‌భుత్వం మీద విషం చిమ్ముతూ మీడియాను ఆక‌ర్షించుకున్నాడు. ఓటుకునోటుతో నేత‌లంతా పార్టీని వీడ‌డంతో ఆంధ్రాలో చంద్ర‌బాబుది, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డిది అన్న‌ట్లు మారింది తెలుగుదేశం పార్టీ. తెలంగాణ తెలుగుదేశం పార్టీకి ఎల్ ర‌మ‌ణ అధ్య‌క్షుడుగా ఉన్నా మాజీ మంత్రి మోత్కుప‌ల్లి నర్సింహులు, దేవేంద‌ర్ గౌడ్, ఉమా మాధ‌వ‌రెడ్డి వంటి

ఏం చేయ‌బోతున్నాం.. గుట్టువిప్పిన రేవంత్

తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లో ఏం జ‌ర‌గ‌బోతుంది ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు విఫ‌ల‌య‌త్నాలు చేసిన ఆంధ్రా పెట్టుబ‌డిదారి వ‌ర్గాలు, కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గాలు ఇక ముందు ఏం చేయ‌బోతున్నాయి ? తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని చంద్ర‌బాబు నాయుడు ఎందుకొర‌కు భూస్థాపితం చేయ‌బోతున్నాడు ? అస‌లు ఆంధ్రా తెలంగాణ రాజ‌కీయాల‌లో 2019లో ఏం జ‌ర‌గ‌నుంది వంటి అనుమానాల‌కు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేర‌బోతున్న రేవంత్ రెడ్డి స‌మాధానాలు చెప్పాడు. కాంగ్రెస్ నాయ‌కుల ఆత్మీయ వేదిక మీద చంద్ర‌బాబునాయుడిని మెచ్చుకుంటూ, ఆంధ్రా అభివృద్దిని ఆకాశానికి ఎత్తుతూ తెలంగాణ మీద లేని ప్రేమ‌ను ప్ర‌క‌టించి తామంద‌రి వ్యూహం ఏంటి అన్న

క‌ల్లోల కాంగ్రెస్ .. క‌ల‌హాల టీడీపీ

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు 60 ఏళ్లు రాష్ట్రాన్ని ఏలిన తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల‌ భ‌విష్య‌త్ తెలంగాణ రాష్ట్రంలో అగ‌మ్య‌గోచ‌రంగా మారింది. కేవ‌లం ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త మీద ఆధార‌ప‌డి గాలివాటం గెలుపుల‌కు అల‌వాటుప‌డిన రెండు పార్టీల‌కు ఇప్పుడు ఎలాంటి ప్ర‌ణాళిక లేక, న‌డిపించే నాయ‌కులు లేక ఆందోళ‌న‌లో ఉన్నారు. అధికారం అంటే కేవ‌లం త‌మ ఆధిప‌త్యం నిరూపించుకోవ‌డానికి, ఆస్తులు కూడ‌బెట్టుకోవ‌డానికి అని ఇన్నేళ్లు రాజ‌కీయాలు చేసిన నేత‌ల‌కు ఇప్పుడు గ‌త మూడేండ్లుగా తెలంగాణ‌లో జ‌రుగుతున్న అభివృధ్ది చూసి ఎటూ తేల్చుకోలేక పోతున్నారు. స‌మైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పాల‌కుల ద‌యాదాక్షిణ్యాల మీద ఆధార‌ప‌డి రాజ‌కీయ మ‌నుగ‌డ సాగించిన ఈ నేత‌లు

టీడీపీ నుండి రేవంత్ స‌స్పెండ్ ?

తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి స‌స్పెన్ష‌న్ కు రంగం సిద్దం అవుతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు ఆయ‌న మీద వేటు వేయాల‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో తీర్మానించిన‌ట్లు చెబుతున్నారు. మోత్కుప‌ల్లి వ‌ర్గం మాత్రం రేవంత్ వ్యాఖ్య‌లు, ప‌త్రిక‌ల క‌థ‌నాల మీద ఓ తీర్మానం చేసి చంద్ర‌బాబుకు లేఖ రాసిన‌ట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి విదేశాల నుండి వ‌చ్చిన త‌రువాత అపాయింట్ మెంట్ ఇవ్వ‌కూడద‌ని, కాంగ్రెస్ లో చేరను అనే విష‌యాన్ని రేవంత్ ఒప్పుకోవ‌డం లేద‌ని, పార్టీ గౌర‌వాన్ని భంగ‌ప‌రిచాడ‌ని ఫిర్యాదులు చేసిన‌ట్లు స‌మాచారం. చంద్రాబాబు విదేశాల నుండి రాక ముందే స‌స్పెండ్ చేస్తార‌ని అంటున్నారు.

కేసీఆర్ ను మ‌ర్యాద‌గా క‌లిస్తే త‌ప్పా

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనంత‌పురం వ‌స్తే తాను మ‌ర్యాద పూర్వ‌కంగా ప‌ల‌క‌రించాను. ఈ విష‌యాన్ని అన‌వ‌స‌రంగా రాద్దాంతం చేస్తారా ? అని ఆంధ్రా ఎమ్మెల్సీ ప‌య్యావుల కేశ‌వ్ ఆవేద‌న వ్య‌క్తం చేశారు. రేవంత్ రెడ్డి అస‌త్య ఆరోప‌ణ‌లు మానుకోవాల‌ని, వ్యాపారాల‌ను రాజ‌కీయాల‌కు వాడుకోవ‌డం రేవంత్ రెడ్డికి మాత్ర‌మే తెలుస‌ని ఆరోపించారు. ప‌రిటాల కుమారుడు, నా మేన‌ల్లుడు క‌లిసి బీర్ల కంపెనీ పెట్టార‌ని రేవంత్ చేసిన వ్యాఖ్య‌ల‌ను ప‌య్యావుల ఖండిచారు. ప‌రిటాల కుటుంబంతో నాకు ఎలాంటి వ్యాపార సంబంధాలు లేవు. నా మేన‌ల్లుడు అత‌ని స్నేహితుల‌తో క‌లిసి హైద‌రాబాద్ లో బార్ పెట్టాడు. రూ.2 కోట్ల బార్ కు, రూ.500

మార్పు వెన‌క మ‌త‌ల‌బు ఇదీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో భ‌విష్య‌త్ లేద‌ని, అధినేత ఆదేశాల మేర‌కు కొత్త జెండా ఎత్తుకుంటున్న టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవ‌డం వెన‌క అత‌ని రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆలోచ‌న‌లు చాలా ఉన్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని ముందుకు న‌డ‌ప‌డం అసాధ్యం. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌న్న‌దే రేవంత్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. అస‌లు రేవంత్ రాజ‌కీయ చ‌రిత్ర‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే దీని మీద పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. అన్ని పార్టీల అండ‌తో మిడ్జిల్ మండ‌ల జ‌డ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి మెల్ల‌గా చంద్ర‌బాబుకు చేరువై