srisailam project

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

ప్ర‌తిప‌క్షం ఆశ‌ల‌పై కృష్ణా నీళ్లు

సాగునీరే తెలంగాణ‌కు జ‌వం ..జీవం. తెలంగాణ ప్ర‌భుత్వం, ముఖ్య‌మంత్రి కేసీఆర్ న‌మ్మింది ఇదే. అస‌లు తెలంగాణ ఉద్య‌మ‌మే నీళ్లు, నిధుల, నియామ‌కాల పోరాటం. తెలంగాణ ఆవిర్భావం త‌రువాత అధికారంలోకి వ‌చ్చిన టీఆర్ఎస్ సాగునీటికి ప్రాధాన్యం ఇచ్చింది. గ‌తంలో ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెడ్తుంది అంటే తెలంగాణ ప్రాజెక్టుల‌కు ఎన్ని నిధులు ఇస్తుందా అని ఎదురు చూసే ప‌రిస్థితి. బ‌డ్జెట్ మీద కొండంత ఆశ‌లు పెట్టుకుంటే క‌నీసం ప్రాజెక్టు స‌ర్వేల‌కు కూడా స‌రిపోన‌న్ని నిధులు మంజూరు చేసి చేతులు దులుపుకునేది. అప్ప‌టి ముఖ్య‌మంత్రుల‌ను నేత‌లు క‌నీసం ప్ర‌శ్నించే ప‌రిస్థితి ఎన్న‌డూ లేదు. స్థానిక ప్ర‌జ‌లు, నేత‌లు ప్ర‌శ్నిస్తే ఇక్క‌డి నేత‌లే

శ్రీ‌శైలం ఫుల్

శ్రీ‌శైలం ప్రాజెక్టు దాదాపు నిండిపోయింది. మ‌రో తొమ్మిది టీఎంసీలు అయితే పూర్తి స్థాయి నీటి మ‌ట్టానికి చేరుకుంటుంది. ఎగువ నుండి ఇన్ ఫ్లో భారీగా వ‌స్తున్న‌ నేప‌థ్యంలో ఈ రోజు గేట్లు ఎత్తే అవ‌కాశం ఉంది. నిన్న రాత్రికి ప్రాజెక్టు ఇన్ ఫ్లో 1.75 ల‌క్ష‌లుగా న‌మోద‌యింది. ఆల్మ‌ట్టి నుండి ఇన్ ఫ్లో త‌క్కువ‌గానే ఉన్నా శ్రీ‌శైలం ఎగువ‌న‌, జూరాల ఎగువ‌న కురిసిన వ‌ర్షాల‌కు నీటి ఉదృతి పెరిగింది. జూరాల, తుంగభద్ర, హంద్రీనదుల నుంచి భారీగా వరద వచ్చి శ్రీశైలానికి చేరుతోంది. మరోవైపు నాగార్జునసాగర్‌ కింద ముందస్తు రబీకి అవకాశాలు మెరుగుపడ్డాయి. ఆలమట్టి, నారాయణపూర్‌లు పూర్తి స్థాయి నీటిమట్టాలతో

గ‌బ్బిలాలు దోచేస్తున్న కృష్ణా నీళ్లు

గ‌బ్బిలాలు నీళ్లు దోచేయ‌డ‌మేంట‌ని ఆశ్చ‌ర్య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు. కృష్ణా న‌ది నీళ్ల‌ను పోతిరెడ్డిపాడు ద్వారా అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న ఆంధ్రా ప్ర‌భుత్వం గబ్బిలాల‌ను అడ్డంపెట్టింది. ఆంధ్రా, తెలంగాణ‌లు ఎక్క‌డి నుండి ఎంత నీటిని తోడుతున్నాయ‌ని కేంద్రం కృష్ణా బోర్డు ఆధ్వ‌ర్యంలో పెట్టిన టెలీమెట్రీల‌కు రాత్రి కాగానే గ‌బ్బిలాల దాడి మొద‌ల‌వుతుంది. ఆంద్రా ప్ర‌భుత్వం రాత్రి కాగానే టెలీమెట్రీలు ప‌నిచేయ‌కుండా చేస్తున్నాయి. తెల్ల‌వార‌గానే తిరిగి టెలిమెట్రీలు మొద‌ల‌వుతున్నాయి. రికార్డుల‌లో న‌మోదవుతున్న‌దానికి, ఆంధ్రా త‌ర‌లిస్తున్న నీటికి వ్య‌త్యాసం తెలుసుకున్న తెలంగాణ ఇంజ‌నీర్లు పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ వ‌ద్ద‌కు వెళ్తే అందులో గ‌బ్బిలాలు క‌నిపిస్తున్నాయి. గ‌త కొన్ని రోజులుగా ఇదే జ‌రుగుతుంది. పోతిరెడ్డిపాడు నుండి త‌ర‌లించ‌డానికి

ఆంధ్రా స‌ర్కారుకు తెలంగాణ గుణ‌పాఠం

తెలంగాణ తాగునీటి అవ‌స‌రాల‌కు రెండు టీఎంసీల నీళ్లు ఇవ్వాల‌ని తెలంగాణ ప్ర‌భుత్వం ఎంత విజ్ఞ‌ప్తి చేసినా శ్రీ‌శైలం జ‌లాశ‌యం నుండి నీళ్లు విడుద‌ల చేసేందుకు ఆంధ్రా ప్ర‌భుత్వం ఏ మాత్రం క‌నిక‌రించ‌డం లేదు. ఆంధ్రాకు నీళ్లు కావాల్సి వ‌చ్చిన‌ప్పుడు నాగార్జున సాగ‌ర్ వ‌ద్ద నానా హంగామా చేసే చంద్ర‌బాబు ప్ర‌భుత్వం, అధికారులు తెలంగాణ అవ‌స‌రాల గురించి అడిగితే మాత్రం మొహం చాటేస్తున్నారు. క‌నీస మాన‌వ‌తా దృక్ఫ‌థం విస్మ‌రించిన ఆంధ్రా స‌ర్కారుకు, బాధ్య‌త‌గా ఆ రాష్ట్రం మీద వ‌త్తిడి తెచ్చి నీళ్లు ఇప్పించాల్సిన కృష్ణా బోర్డు పెద్ద‌గా స్పందించంచ‌డం లేదు. ఇప్ప‌టి వ‌ర‌కు శ్రీ‌శైలం ప్రాజెక్టుకు నీటి ల‌భ్య‌త లేదు.