paneer selvam

రంగు మారిన రెండాకులు

త‌మిళ‌నాట రాజ‌కీయాల్లో జ‌య‌ల‌లిత మ‌ర‌ణం త‌రువాత ఆస‌క్తిక‌ర ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అనేక నాట‌కీయ ప‌రిణామాల త‌రువాత ప‌న్నీర్ సెల్వం, ప‌ళ‌నిస్వామి వ‌ర్గాలు ఒక్క‌ట‌య్యాయి. తాజాగా అన్నాడీఎంకె పార్టీ గుర్తు రెండాకులు ప‌ళ‌నిస్వామి వ‌ర్గానికి ద‌క్కింది. అయితే ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వం వ‌ర్గం పెడుతున్న పోస్ట‌ర్ల‌లో రెండాకుల గుర్తుకు కాషాయం రంగు అంటుకుంది. జ‌య‌లలిత మ‌ర‌ణం త‌రువాత మోడీ ఆశీస్సుల‌తో ప‌నీర్ సెల్వం ముందుకు వెళ్తున్నాడు. ఇక రాబోయె ఎన్నిక‌ల్లో పూర్తి స్థాయిలో ఈ వ‌ర్గం మోడీతో జ‌త‌క‌ట్టే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఆకుపచ్చ రంగులో ఉండే రొండాకుల‌కు కాషాయం రంగు రావ‌డం చ‌ర్చ‌కు తెర లేపింది.

శ‌శిక‌ళ‌, దిన‌క‌ర‌న్ ను తప్పించారు

త‌మిళ‌నాడు అన్నాడీఎంకెలో వ‌ర్గ‌పోరు తీవ్ర‌మ‌యింది. 22 మంది ఎమ్మెల్యేల‌తో శ‌శిక‌ళ మేన‌ల్లుడు టీటీవీ దిన‌క‌ర‌న్ ప్ర‌భుత్వాన్ని దించేస్తాడ‌న్న అనుమానంతో ముఖ్య‌మంత్రి ప‌ళ‌నిస్వామి, ఉప ముఖ్య‌మంత్రి ప‌న్నీర్ సెల్వంలు కొత్త ఎత్తు వేశారు. దిన‌క‌ర‌న్ ను, పార్టీ తాత్కాలిక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శ‌శిక‌ళ‌ను పార్టీ నుండి బ‌హిష్క‌రించారు. తమిళనాడులోని రొయపెట్టా వేదికగా జరిగిన సర్వసభ్య సమావేశంలో పార్టీ చీఫ్ పదవి నుంచి వీకే శశికళను బహిష్కరిస్తూ తీర్మానం చేశారు. అంతే కాకుండా పార్టీ చీఫ్ గా శశికళ జైలుకు వెళ్లకముందు చేపట్టిన పార్టీ నియామకాలన్నింటిని రద్దు చేశారు. శశికళతో పాటు ఆమె మేనల్లుడు టీటీవీ దినకరన్ ను కూడా పార్టీలోని