lic

ఇలాంటి ముఖ్య‌మంత్రిని చూడ‌లేదు

నేను కూడా రైతుబిడ్డ‌నే. దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ప‌నిచేశాను. కానీ ఎక్క‌డ కూడా రైతు జీవిత‌భీమా లాంటి ప‌థ‌కాల‌ను ఊడ‌లేదు. ఈ రోజు ఎల్ఐసీకి మంచిదినం. రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉంది. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతుబంధు. ఇలాంటి ముఖ్య‌మంత్రిని ఎక్క‌డా చూడ‌లేదు అని ఎల్ఐసీ చైర్మ‌న్ వీకె శ‌ర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడారు. రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. కేసీఆర్ విజన్ ఉన్న లీడర్.

రైతుబంధుతో కొన్ని పార్టీలు దివాళా

ఇది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నాం. రైతుబంధు ప‌థ‌కంతో కొన్ని రాజ‌కీయ పార్టీలు దివాళా తీశాయి. పేరుకే పెద్ద రైతు.. వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలి. రైతు క్షేమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర రైతాంగమంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. హెచ్‌ఐసీసీ