ktr

పాల‌పిట్ట పార్క్ ప్రారంభ‌మ‌యింది

కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్‌ గార్డెన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన పాలపిట్ట పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్క్‌ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక‌ప్పుడు పిచ్చిమొక్క‌ల‌తో ఉన్న ఈ ప్రాంతాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. హరిత‌హారంలో భాగంగా ఏడు వేల మొక్క‌లు నాటారు. సైక్లింగ్‌ కోసం వచ్చే వారికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 230 కొత్త సైకిళ్లు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం విశాలమైన సైకిల్‌ స్టాండ్‌ నిర్మించారు. రోజూ ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 4-6 గంటల

చెప్ప‌డం కాదు .. చేసి చూపిస్తాం

మాట‌లు చెప్పిన ప్ర‌భుత్వాల‌ను చూశారు. కానీ మాది అలాంటి ప్ర‌భుత్వం కాదు. చెప్ప‌డ‌మే కాదు .. చేసి చూపించే ప్ర‌భుత్వం. నేత‌న్న‌ల‌ను ప‌ట్టించుకోని ప్ర‌భుత్వాల‌ను చూశారు. కానీ ఈ ప్ర‌భుత్వం వారిని అలా వ‌దిలేయ‌లేదు. నేత‌న్న‌ల బ‌తుకుల్లో వెలుగులు నింపేందుకు ఎన్నో ప‌థ‌కాలు తీసుకువ‌స్తున్నాం. ఉద్య‌మ‌నేత‌గా ఉన్న‌ప్ప‌టి నుండి నేత‌న్న‌ల గురించి స్పందిస్తున్న కేసీఆర్ ముఖ్య‌మంత్రి అయ్యాక వారి జీవితాలు బాగుప‌డేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకున్నార‌ని మంత్రి కేటీఆర్ అన్నారు. వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ప్ర‌సంగించారు. నూలు, రంగులు, రసాయనాలపై 40% సబ్సిడీ ఇచ్చే ప్రతిష్ఠాత్మక చేనేతమిత్ర పథకాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఒక్క వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలోనే

స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ తెలంగాణ‌

దేశంలో తెలంగాణ రాష్ట్రం అత్యంత వేగంతో ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని పట్టణాభివృద్ధి, మున్సి పల్ శాఖా మంత్రి కేటీఆర్ అన్నారు. ఇండియా టుడే నిర్వహించిన స్టేట్ ఆఫ్ ది స్టేట్స్ సదస్సు2017లో తెలంగాణ రాష్ట్రం రెండు అవార్డులను దక్కించుకుంది. ఆర్థిక వ్యవస్థ పురోగతి, పర్యావరణ స్వచ్ఛతా భాగాల్లో తెలంగాణ రాష్ట్రానికి రెండు అవార్డులు లభించాయి. కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చేతుల మీదుగా కేటీఆర్, పర్యావరణ, అటవీ శాఖల మంత్రి జోగు రామన్నలు ఈ అవార్డులను అందుకున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మానస పుత్రికలైన పథకాలకు ఈ అవార్డులు దక్కాయని, తెలంగాణ రాష్ట్రం చిన్న రాష్ట్రం కాదని,

40 పల్లెటూర్లకు కేటిఆర్ శుభవార్త

  తెలంగాణలోని 40 గ్రామాలకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శుభవార్త చెప్పారు. ఆ గ్రామాలకు కొత్త శోభ అద్దనున్నట్లు ఆయన వివరించారు. ఇంతకూ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదుగదా? పురపాలక శాఖ మంత్రి కదా?  ఆయన శుభవార్త చెప్పుడేందని అనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి మరి. తెలంగాణలోని పురపాలక సంస్థల్లోని అభివృద్ధి కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా

సరిగ్గా పన్నేండేళ్ల క్రితం..

బెంగుళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ నిజామాబాద్ యువకుడు దసరాకు హైదరాబాద్ వద్దామని బస్ స్టాండుకు వెళ్లాడు. ఎన్ని ట్రావెల్స్ ఆఫీసుల దగ్గర చూసినా ఒక్క బస్సులో కూడా సీట్లు లేవు. తిరిగి తిరిగి ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చేశాడు. ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింటులో కూర్చుని ఆ రాత్రి డిన్నర్ చేస్తుంటే మెరుపులా మెరిసింది ఆ యువకుడి బుర్రలో ఆలోచన. విమానం టికెట్లూ, రైలు టికెట్లూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయికదా మరి బస్సు టికెట్లు ఎందుకు దొరకవు అనే ప్రశ్న ఆ వెంటనే మనమే ఒక వెబ్ పోర్టల్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన. వెంటనే

కారెక్కిన కంచ‌ర్ల‌

న‌ల్ల‌గొండ జిల్లాలో కీల‌క టీడీపీ నాయ‌కుడు కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు కృష్ణారెడ్డిలు మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వేల మంది మ‌ద్ద‌తుదారుల స‌మ‌క్షంలో న‌ల్ల‌గొండ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ గా కంచ‌ర్ల భూపాల్ రెడ్డిని నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టిదాకా పార్టీలో ఉన్న దుబ్బాక న‌ర్సింహారెడ్డికి త్వ‌ర‌లోనే కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని అన్నారు. ఈ సంధ‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రజలు బహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డుస్థాయి విజయాన్ని

స‌మంత‌కు కేటీఆర్ కంగ్రాట్స్

హీరో నాగ చైతన్య, నటి సమంత ఒక్కటయ్యారు. ఈ నేప‌థ్యంలో మంత్రి కేటీఆర్ ట్విట్టర్ ద్వారా సమంతకు వివాహ శుభాకాంక్షలు తెలిపారు. హిందూ సంప్రదాయ పద్ధతి ప్రకారం శుక్రవారం రాత్రి, క్రిస్టియ‌న్ సాంప్ర‌దాయం ప్ర‌కారం శ‌నివారం వీరి వివాహం గోవాలో ఘనంగా జరిగింది. హ్యాండ్ లూమ్ అంబాసిడ‌ర్ స‌మంత‌కు శుభాకాంక్ష‌లు అని కేటీఆర్ ట్విట్ట‌ర్ లో పేర్కొన్నారు. Many congratulations to our Handlooms Brand Ambassador & one of the nicest people I know @Samanthaprabhu2 on her wedding with @chay_akkineni — KTR (@KTRTRS) October 7, 2017

ఎన్టీఆర్ అభిమానికి కేటీఆర్ పంచ్

ద‌స‌రా పండుగ సంధ‌ర్భంగా మంత్రి కేటీఆర్ కు శుభాకాంక్ష‌లు తెలుపుతూ ఇద్ద‌రు నెటిజ‌న్లు ట్వీట్లు చేశారు. ఈ కామెంట్ల‌ను రాష్ట్ర ఐటీ, పుర‌పాల‌క శాఖా మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు. దానికి స్పందించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ అభిమాని చేసిన కామెంట్ కు మంత్రి కేటీఆర్ ఇచ్చిన రిప్లై అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. రావ‌ణుడిని సంహ‌రిద్దాం .. హ్యాపీ ద‌స‌రా అని ఒక‌రు .. ‘ప్రతి ఒక్కరి ప్రారంభం ఒకేలా ఉంటుంది. కానీ, ముగింపును నిర్ణయించేది వారి ‘కర్మ’’ అంటూ ‘రామ్, రావణా’ అర్థాలు వచ్చే పోస్టర్ ను మరో నెటిజన్ పోస్ట్ చేశారు. ఈ రెండూ బాగున్నాయ‌ని మంత్రి కేటీఆర్ ప్ర‌శంసించారు.

మోడీ వ‌స్తే మెట్రో రెడీ

మెట్రో రైలు ప్రారంభానికి సిద్దంగా ఉంద‌ని, ప్రధాని నరేంద్రమోదీ సమయం ఇవ్వగానే మెట్రోరైలు ప్రారంభిస్తామని ఐటీ, పట్టణాభివృద్ధిశాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. మెట్రోరైలును ప్రధానమంత్రి నరేంద్రమోదీయే ప్రారంభిస్తారని స్పష్టం చేశారు. ప్రధాని కార్యాలయం ఇచ్చే సమయాన్ని బట్టి ప్రారంభతేదీ నిర్ధారిస్తామన్నారు. మెట్రోరైలు ప్రారంభంలో ఎలాంటి జా ప్యం జరుగలేదని, ఇతర ప్రాంతాల్లో మాదిరిగా పది, పన్నెండు కిలోమీటర్ల లైన్ ప్రారంభించాలనుకుంటే రెండేండ్ల క్రితమే ఆ పని చేసేవారమన్నారు. అయితే దానివల్ల ప్రజలకు పెద్ద ప్రయోజనం ఉండదని, కనీసం 30 కిలోమీటర్ల ప్రయాణమైనా అందుబాటులోకి తీసుకురావాలని ఆగామని చె ప్పారు. గురువారం సికింద్రాబాద్‌లోని ఒలిఫెంటా వంతెనను అధికారులతో కలిసి పరిశీలించిన

చీరలు తగలెట్టించిన పాపం ఊరకే పోదు!

కల్వకుంట్ల చంద్రశేఖరరావు బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ ఆడపడుచులకు కానుక ఇవ్వదలచుకున్నారు. పైగా తెలంగాణ చేనేత రంగానికి చేయూత ఇచ్చేలాగా నేత చీరలనే అందరు ఆడపడుచులకు ఇవ్వదలచుకున్నారు. అయితే కొందరిలో విషపు ఆలోచనలను చొరబెట్టి కొందరు మహిళలో ఆ చీరలను తగులబెట్టించాయి విపక్షాలు. అయితే కామన్ సెన్స్ తో ఒక సంగతి ఆలోచిద్దాం. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా మహిళలు అవి నాణ్యత లేని చీరలు అని భావించారే అనుకుందాం. ఆ ఆరోపణ నిజమే అనుకుందాం. అయినా ఉచితంగా వచ్చిన చీరలను తగుల బెట్టాలనే ఆలోచన ఏ మహిళకు వస్తుంది. కొత్త చీర అయినప్పుడు.. దానిని తగులబెట్టడం కంటె.. ఇంట్లో మసిగుడ్డగానో,