kodandaram

కండువా క‌ప్పేందుకు కాంగ్రెస్ రెఢీ

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ వ్య‌తిరేకులంద‌రినీ కాంగ్రెస్ గూట్లోకి లాగేందుకు ఏఐసీసీ స్థాయిలో ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయ‌ని తెలుస్తుంది. కేసీఆర్ అభివృద్ది ముందు విప‌క్షాల విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు నిల‌వలేక పోతుండ‌డంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం వ‌చ్చే ఎన్నిక‌ల్లో కేసీఆర్ వ్య‌తిరేక ఓట్లు చీల‌కుండా అంద‌రినీ త‌మ నియంత్ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఏఐసీసీ అధ్య‌క్షుడుగా రాహుల్ గాంధీని కూర్చోబెట్టేందుకు ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. దాంతో పాటు రాహుల్ ఆధ్వ‌ర్యంలోని ఒక టీం తెలంగాణ‌లోని గ‌ద్ద‌ర్, కోదండ‌రాంల‌ను ఆకర్షించేందుకు ప‌నిచేస్తున్న‌ట్లు ఏఐసీసీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇప్ప‌టి వ‌ర‌కు కోదండ‌రాం వెన‌కుండా న‌డిపించిన కాంగ్రెస్ ఇక కండువా క‌ప్పేయాల‌ని భావిస్తున్న‌ట్లు తెలుస్తుంది. ఇప్ప‌టికే ఇద్ద‌రు నేత‌లు

కోదండ‌రాం గురించి నాలుగు ముక్క‌ల్లో తేల్చేశాడు

తెలంగాణ ఎవ‌రు తెచ్చారు ? ఉద్య‌మంలో ఎవ‌రి పాత్ర ఏంటి ? కేసీఆర్ గొప్పా ? కోదండ‌రాం గొప్పా ? సోష‌ల్ మీడియాలో ఓ పోస్ట్ ఇప్పుడు అంద‌రినీ ఆక‌ర్షిస్తోంది. .. అది madeintg.com పాఠ‌కుల కోసం ముఖ్య‌మంత్రి గారి ప్రెస్ మీట్ పై ఇంకా వాదోప వాదాలు చర్చలు జరుగుతూనే ఉన్నయి వాదోపవాదాలు పక్కన పెడితే వాస్తవాలను ఎవరైనా అంగీరించాల్సిందే ! ఆ వాస్త‌వాలు ఎలా ఉంటయ్ ? ఏమిటి తెలంగాణ , ఎక్కడినుంచి ఎక్కడికొచ్చినం !? 2001 మలిదశ ఉద్యమం ఎందుకుమోదలయ్యింది ! కేసీఆర్ అనే వ్యక్తి ఒక్కడుగా తెలంగాణా రాష్ట్ర సమితిని ఎందుకు స్థాపించిండు

కేసీఆర్ గొప్ప‌త‌నం ఇక్క‌డే బ‌య‌ట‌ప‌డింది

ఎంత సింగ‌రేణి ఎన్నిక‌ల్లో విజ‌యం సాధిస్తే మాత్రం విప‌క్షాల‌ను ఇలా తిడ‌తారా ? తెలంగాణ ఉద్య‌మంలో కోదండ‌రాం కూడా పాల్గొన్నారు ఆయ‌న‌ను లెక్క‌లేకుండా మాట్లాడ‌తారా ? బీజేపీ మ‌ద్ద‌తు లేందే తెలంగాణ వ‌చ్చిందా ? కాంగ్రెస్ ఇవ్వంది తెలంగాణ ఎలా వ‌చ్చింది ? కేసీఆర్ ముఖ్య‌మంత్రి ఎలా అయ్యారు ? టీడీపీ లేఖ ఇవ్వందే తెలంగాణ వ‌చ్చిందా ? తాజాగా కేసీఆర్ ప్రెస్ మీట్ త‌రువాత ఆయా పార్టీలు, కేసీఆర్ వ్య‌తిరేకుల ప్ర‌శ్న‌లు. ఈ ప్ర‌శ్న‌లు పాత‌వే అయినా తాజాగా సింగ‌రేణి ఎన్నిక‌ల నేప‌థ్యంలో మ‌రో సారి తెర మీద‌కు వ‌చ్చాయి. అస‌లు తెలంగాణ ఉద్య‌మాన్ని నిల‌బెట్టింది ..

కేసీఆర్ ప్రెస్ మీట్ .. క‌ఠిన నిజాలు

సింగ‌రేణి ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ అనుబంధ టీబీజీకెఎస్ భారీ మెజారిటీతో గెలిచి చ‌రిత్ర సృష్టించిన నేప‌థ్యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్ర‌భుత్వం మీద విశ్వాసం ఉంచి గెలిపించిన కార్మికుల‌కు ధ‌న్య‌వాదాలు తెలుపుతూ ఎన్నిక‌ల సంధ‌ర్భంగా వారికి ఇచ్చిన హామీల‌ను వంద‌కు వంద శాతం నెర‌వేర్చుతామ‌ని స్ప‌ష్టం చేశారు. సింగరేణిలో నష్టాలు వస్తున్నప్పటికీ భూగర్భగనులను కొనసాగిస్తున్నామని, మరిన్ని ఉద్యోగాల కల్పన కోసం త్వరలో ఆరు భూగర్భ గనులు ప్రారంభిస్తామని చెప్పారు. కారుణ్య నియామకాల విధానంలో ఉద్యోగాలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తామని, నీచ రాజ‌కీయాలు చేస్తున్న విప‌క్షాల‌కు కార్మికులు బుద్ది చెప్పార‌ని కేసీఆర్ అన్నారు. అయితే ఈ సంధ‌ర్భంగా కేసీఆర్ మాట్లాడిన

కోదండ‌రాం .. కోమ‌టిరెడ్లు క‌లిసి

కాంగ్రెస్ పార్టీలో ఆద‌ర‌ణ లేక .. అందులోనుండి బ‌య‌ట‌ప‌డ‌లేక ఆందోళ‌న‌లో ఉన్న కోమ‌టిరెడ్డి వెంక‌ట్ రెడ్డి సోద‌రులు ఇక ప్ర‌త్యామ్నాయం మీద దృష్టి సారించార‌ని తెలుస్తుంది. త‌మ‌కు అవ‌కాశం ఇస్తే కాంగ్రెస్ పార్టీ ఖ‌ర్చంతా భ‌రిస్తామ‌ని అంటూ అధిష్టానానికి ఎన్ని సార్లు నివేదించినా ప‌ట్టించుకోక‌పోవ‌డంతో కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ ఆగ్ర‌హంగా ఉన్నారు. అయితే కాంగ్రెస్ ను వీడ‌డం మూలంగా త‌మ‌కు ఇబ్బందులు వ‌స్తాయి .. అందులో అధికార టీఆర్ఎస్ పార్టీ త‌మ‌ను ఆద‌రించే ప‌రిస్థితి లేదు. అందుకే రెంటికి చెడ్డ రేవ‌డిలా కాకుండా తెర‌వెన‌క మంత‌నాల‌కు తెర‌లేపార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే రెండు మూడు సార్లు కోదండ‌రాంతో ఈ సోద‌రులు చ‌ర్చ‌లు

ఛాలెంజ్ : సోమయ్య సొంత ఊళ్లో

కట్టుకున్న ఇద్దరు భార్యలను వదిలి పెట్టి పిల్లలను పట్టించుకోకుండా ఆడవాళ్ళను మోసం చేస్తున్న గాయకుడు ఏపూరి సోమయ్యను ప్రశ్నించినందుకు చేస్తున్న ఆరోపణలపై నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం సతీమణి పుష్ప సవాల్ ——-‘ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న సోదరులారా రాజకీయ నాయకులారా JAC సోదరులారా లెప్టిస్ట్ భావాలతో ఉన్న సోదరులారా మిము మా జీవితాలు ప్రజల కోసం అని చెప్పుకునే సోదరులారా … వాస్తవాలను ప్రజలకు చెప్దామనే మీడియా యాజమానులరా పాత్రికేయులరా …మీరు ఎటు వైపు ఎవరి పక్షం … నీను పుష్పగా ఒక మహిళ గా వేసే ప్రశ్న లకు సమాధానం చెప్పండి చర్చ వేదికలు

కోదండ‌రాం పీకుడు భాష !

2019 ఎన్నిక‌ల్లో ఇప్పుడున్న ఎమ్మెల్యేల‌ను ఏం పీకార‌ని నిల‌దీయాల‌ని తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ ప్రొఫెసర్ కోదండ‌రాం ప్ర‌జ‌ల‌ను కోరారు. వికారాబాద్‌ జిల్లా తాండూరులో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో కోదండ‌రాం అభ్యంత‌రక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ప్రొఫెసర్ అయి ఉండి ఆయ‌న మాట‌ల‌కు భిన్నంగా పీకుడు వంటి మాట‌లు రావ‌డం చూసి ముక్కున వేలేసుకున్నారు. ఓట్ల కోసం వ‌చ్చే ఎమ్మెల్యేల‌ను ఇప్ప‌టి వ‌రకు ఏం పీకారు ? మ‌ళ్లీ గెలిచి ఏం పీకుతారు ? అని అడ‌గాల‌ని కోదండ‌రాం ప్ర‌జ‌ల‌ను కోరారు. తెలంగాణ అభివృద్ది కోసం తాము పోరాడుతున్నామ‌ని, ప్రొఫెస‌ర్ జ‌య‌శంక‌ర్ తెలంగాణ వ‌చ్చాక మ‌రో పోరాటం

కొంగుచాటు ‘కోదండ‌రాం’

పిల్లి పాలు తాగుతూ న‌న్నెవ‌రూ చూడ‌డం లేద‌నుకోవ‌డం .. ఎంత మాంసం తిన్నా బొక్క‌లు మెడ‌లో వేసుకుని తిర‌గ‌డం ఎందుకు వంటి సామెత‌లు తెలంగాణ‌లో చాలా ఉన్నాయి. అచ్చంగా జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ఈ ప‌ద్ద‌తినే ఫాలో అవుతున్న‌ట్లు అనిపిస్తుంది. వెన‌క‌టికి స‌మాచార వ్య‌వ‌స్థ లేని కార‌ణంగా ఏ నాయ‌కుడు ఎలాంటి వాడు ? ఆయ‌న వాద‌న వెన‌క మ‌ర్మం ఏంటి ? అన్న‌ది జ‌నాల‌కు తెలిసేది కాదు. తాము న‌మ్మితే గుడ్డిగా జ‌నం ఫాలో అయ్యేవారు. కానీ కాలం మారింది … నాయ‌కుడి ప్ర‌సంగం పూర్త‌య్యేలోపు ఆయ‌న ఆరోప‌ణ‌లు, ఆలోచ‌న వెన‌క పూర్వ‌ప‌రాలు ఆయ‌న ఫేస్ బుక్

కోదండ‌రాం కోప‌మంతా ఇదే

తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌పాత్ర పోషించాను అని చెప్పుకుంటున్న తెలంగాణ జేఏసీ నేత కోదండ‌రాం గ‌త కొన్ని నెల‌లుగా తెలంగాణ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా కాళ్ల‌కు బ‌ల‌పాలు క‌ట్టుకుని తిరుగుతున్నాడు. ఎక్క‌డ ప్ర‌భుత్వ వ్య‌తిరేక వేదిక క‌నిపించినా రెక్క‌లు క‌ట్టుకుని వాలుతున్నాడు. తెలంగాణ ప్ర‌భుత్వ మీద దుమ్మెత్తిపోస్తున్నా .. ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో విషం నింపేందుకు ప్ర‌య‌త్నిస్తున్నా ప్ర‌జ‌ల నుండి అనుకున్నంత మ‌ద్ద‌తు రాక‌పోవ‌డంతో ఏం చేయాలో పాలుపోని స్థితికి చేరుకున్నాడు. తెలంగాణ యువ‌త‌, విద్యార్థుల బ‌లిదానాల‌కు కార‌ణం అయిన, 60 ఏండ్ల త‌మ పాల‌న‌తో తెలంగాణ‌ను ఆగం చేసి తెలంగాణ డిమాండ్ కు కార‌ణం అయిన‌ టీడీపీ, కాంగ్రెస్ పార్టీల‌తో చెట్టా

కోదండ‌రాం కామారెడ్డితోన‌యినా ?

జేఏసీ నాయ‌కుడు కోదండ‌రాంకు కామారెడ్డి జిల్లాలో చేధు అనుభ‌వం ఎదుర‌యింది. గ‌త కొన్ని నెల‌లుగా ప్ర‌భుత్వం మీద బుర‌ద‌జ‌ల్ల‌డం, ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప్ర‌తి ప‌నిని వ్య‌తిరేకించ‌డ‌మే ధ్యేయంగా పెట్టుకుని ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్న కోదండరాం వ్య‌వ‌హారం మీద సాధార‌ణ ప్ర‌జానీకానికి ఎంత వ్య‌తిరేక‌త ఉందో కామారెడ్డి జిల్లాలో నిన్న ఎదుర‌యిన నిర‌స‌న‌ల‌తో తేలిపోయింది. ప్ర‌తి దాన్ని వ్య‌తిరేకించి దానికి ప్ర‌జామోదం ఉంద‌న్న భ్ర‌మ‌ల్లో ఉన్న కోదండ‌రాంకు తాజా ఘ‌ట‌న క‌ళ్లు తెరిపించి ఉండాలి. ఆంధ్రా ప్ర‌భుత్వం తెలంగాణ ప్రాజెక్టుల‌కు అడ్డుపుల్ల‌లు వేస్తుంటే, కేంద్రానికి లేఖ‌లు రాస్తుంటే తెలంగాణ జేఏసీ నుండి ఒక్క నిర‌స‌న కార్య‌క్ర‌మం కానీ చేప‌ట్టింది లేదు. ప్ర‌శ్నించింది