kcr

క్యాబినెట్ : ప‌ల్లెకు పోదాం చలో చ‌లో

తెలంగాణ‌లో గ్రామ స్వ‌రాజ్య‌మే ల‌క్ష్యంగా తెలంగాణ ప్ర‌భుత్వం ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధ్య‌క్ష్య‌త‌న జ‌రిగిన క్యాబినెట్ స‌మావేశంలో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. నిన్న సాయంత్రం 3.30 గంట‌ల‌కు ప్రారంభ‌మైన క్యాబినెట్ స‌మావేశం ఏకంగా ఎనిమిది గంట‌ల పాటు జ‌రిగింది. గ్రామ‌పంచాయ‌తీల‌ను బ‌లోపేతం చేయ‌డానికి కొత్త పంచాయ‌తీ రాజ్ చ‌ట్టం రూపొందించాల‌ని నిర్ణ‌యించారు. గ‌డువులోగా గ్రామ పంచాయ‌తీలకు ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని, ఈ సారి విధులు సక్ర‌మంగా నిర్వ‌ర్తించ‌ని పంచాయితీల‌పై ప్ర‌భుత్వమే చ‌ర్య‌లు తీసుకునేలా ఈ చ‌ట్టం ఉంటుంద‌ని ఈ శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో ఈ చ‌ట్టాన్ని ప్ర‌వేశ పెట్టాల‌ని ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇదో విప్ల‌వాత్మ‌క నిర్ణ‌యంగా నిలుస్తుంద‌ని కేసీఆర్ భావిస్తున్నారు. 5040

కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న గొప్ప‌త‌నం గురించి, తెలంగాణ గురించి ఆయ‌న క‌మిట్ మెంట్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ సంవ‌త్స‌రాలు) పుస్త‌కంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడు దేశ రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ లో కీల‌క‌నేత‌. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాక‌ముందు 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని స‌మైక్య రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేరింది. యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఆ స‌మ‌యంలో ప‌ద‌వుల పంప‌కంలో ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి అన్న విష‌యంలో కొంత సంధిగ్ధ‌త నెల‌కొంది.

సింగ‌రేణి వార‌సత్వ ఉద్యోగాల కోసం ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు ఇన్వాలిడేషన్‌ ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పనకు సింగరేణి యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 30న సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)తో కూడిన వైద్య నిపుణుల బృందంతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరిగా ఇతర శాఖల అధికారులు మెడికల్‌ బోర్డులో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

శ‌త‌మానం భ‌వ‌తి

ఆజాంజాహీ మిల్లు మూత‌తో అడుగున ప‌డ్డ ఓరుగ‌ల్లు కార్మికుల శోభ‌కు వెలుగులు దిద్దే కొత్త చ‌రిత్ర‌కు నేడు శ్రీ‌కారం జర‌గ‌బోతుంది. ఉపాధిలేక ఊళ్లు దాటిన నేత‌న్న‌ల‌కు భ‌రోసా క‌ల్పించే కార్య‌క్ర‌మానికి నేడు శంకుస్థాప‌న జ‌ర‌గ‌బోతుంది. బ‌తుకుదెరువులేక భీవండి, సూర‌త్, షోలాపూర్ ల పాలైన కార్మికులు ఈ మ‌హోత్స‌వానికి త‌ర‌లివ‌చ్చి శ‌త‌మానం భ‌వతి అని దీవించ‌నున్నారు. ఆజాంజాహీ మిల్లుతో కోల్పోయిన వెలుగును మెగా టెక్స్ టైల్స్ పార్క్ తో తిరిగి ర‌ప్పించ‌డానికి తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నం మొద‌లుపెడుతుంది. దేశంలోనే అతి పెద్ద వ‌స్త్ర‌న‌గ‌రిలో దాదాపు 11 వేల కోట్ల రూపాయ‌ల పెట్టుబ‌డుల‌కు పారిశ్రామిక‌వేత్త‌లు ముందుకు వ‌స్తున్న‌ట్లు స‌మాచారం. రాబోయే కాలంలో

23న క్యాబినెట్ భేటీ

ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం తరఫున చేయాల్సిన తీర్మానాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వపరంగా సభలో ప్రస్తావించాల్సిన విషయాలపై చర్చిస్తారు. గతంలో జారీచేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లైన రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌, పీడీ, గేమింగ్‌, వ్యాట్‌, దుకాణాలు – సముదాయాలు, ఎక్సైజ్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

బీసీలకు రాయితీకి కేసీఆర్ ఓకె

రాష్ట్రంలో వెన‌క‌బ‌డిన బీసీ వ‌ర్గాల‌కు ముఖ్యమంత్రి కేసీఆర్ కానుక ప్రకటించారు. బీసీలకు రాయితీ రుణాల కోసం రూ. 102.8 కోట్లు మంజూరు చేశారు. ఈ మేర‌కు రాయితీ రుణాల దస్త్రంపై సీఎం కేసీఆర్ శుక్రవారం సంతకం చేశారు. రాయితీ రుణాల వల్ల 12,218 మంది బీసీలకు లబ్ధి చేకూరనుంది. బీసీలకు నిధుల మంజూరు పట్ల మంత్రి జోగు రామన్న హర్షం వ్యక్తం చేశారు. 12 ఫెడరేషన్స్ లబ్ధిదారులకు సత్వరమే రాయితీ రుణాలిస్తామని మంత్రి ప్రకటించారు.

ఆ ఏడ్పుకు అస‌లు కార‌ణం ఇది

నేను కాంగ్రెస్ లో చేరిపోతా అంటూ ఢిల్లీలో రొండు రోజులు తిరిగి మీడియా కంటప‌డి అబ్బే నేను పార్టీ మార‌డం లేదు టీఆర్ఎస్ మీద ఫిర్యాదు కోస‌మే ఢిల్లీకి వెళ్లా అంటూ హైద‌రాబాద్ ఫ్లైటెక్కి తెల్లారె స‌రికి మీడియా స‌మావేశం పెట్టాడు టీడీపీ తెలంగాణ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి. అస‌లు కాంగ్రెస్ లో చేర‌తాన‌ని ఎందుకు లీకులు ఇచ్చాడు ? తెలుగుదేశంలో ఏం జ‌రుగుతుంది ? అన్న విష‌యం గురించి క్లారిటీ ఇచ్చాడు రేవంత్. తెలంగాణ‌లో కేసీఆర్ మ‌మ్మ‌ల్ని జైలులో పెట్టాడు. కేసీఆర్ ఆంధ్రా టీడీపీ మంత్రులు, నేత‌లు మాత్రం పెళ్లికి పిలుస్తారా ? అస‌లు తెలంగాణలో

27 నుండి స‌మావేశాలు

ఈ నెల 27 నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై చర్చించేందుకు ఈ నెల 26న బిజినెస్ అడ్వయిజరీ కమిటీ (బీఏసీ) సమావేశం ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. కనీసం నెల రోజులు లేదా 15 నుంచి 20 రోజులపాటు సమావేశాలు నిర్వహించాలని అధికారపక్షం నుంచి కోరాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై మంగళవారం ముఖ్యమంత్రి అధ్యక్షతన ప్రగతిభవన్‌లో వ్యూహరచనా కమిటీ సమావేశం జరిగింది. అసెంబ్లీ సమావేశాలలో అన్ని అంశాలపై చర్చ జరుగాలని, ప్రతిపక్షాలు కోరితే ఎన్ని రోజులైనా సభ నిర్వహించేందుకు అభ్యంతరంలేదని కేసీఆర్ స్పష్టంచేశారు.

ఇంటి ప‌ట్టా .. స్వీటు డ‌బ్బా

ఇదేదో కొత్త ప‌థ‌కం అనుకునేరు. ద‌శాబ్ద కాలానికి పైగా న్యాయం ద‌క్క‌ని కొత్త‌గూడెం మున్సిపాలిటీ ప‌రిధిలోని ప్ర‌జ‌ల ఇండ్ల స్థలాలను క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ జ‌రిపించి వారికి స్వ‌యంగా ఇళ్ల స్థ‌లాల క్ర‌మ‌బ‌ద్దీక‌ర‌ణ ప‌ట్టాల‌తో పాటు ఓ స్వీటు బాక్స్ ను స్వ‌యంగా అంద‌జేసి సంతోష ప‌రిచారు కొత్త‌గూడెం ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు. 2005 నుంచి పెండింగ్ లో ఉన్న కొత్తగూడెం మున్సిపాలిటీ లోని ఇళ్ల స్థలాల క్రమబద్దీకరణ కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను ఒప్పించి జీవో 171 జారీ చేయించారు ఎమ్మెల్యే జ‌ల‌గం వెంక‌ట్రావు. ఈజీవో ప్రకారం 100గజాల లోపు ఇల్లు, స్థలాలు ఉన్న వారికీ ఉచితంగా పట్టాలను ఇచ్చి,ప్రభుత్వం

కేసీఆర్ కోర్కె విని అవాక్క‌య్యారు

కేసీఆర్ అంటే సాధార‌ణ రాజ‌కీయ నాయ‌కుల‌కు భిన్నం. ఆయ‌న ఆలోచ‌న .. ఆచ‌ర‌ణ .. వ్యూహాలు .. ఎత్తుగ‌డ‌లు అన్నీ అనూహ్య‌మే. అందుకే సంకీర్ణ రాజ‌కీయాల‌లో కేంద్రం మెడ‌లు వంచి త‌న 14 ఏండ్ల పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష ప్ర‌త్యేక రాష్ట్రాన్ని సాధించ‌గ‌లిగారు. ఇప్పుడు బంగారు తెలంగాణ నిర్మాణంలోనూ సంక్షేమాన్ని .. అభివృద్దిని స‌మ‌పాళ్ల‌లో రంగ‌రించి మూడేళ్ల‌లోనే తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ది వైపు మ‌ళ్లించ‌గ‌లిగారు. తాజాగా సూర్యాపేట ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేసీఆర్ బ‌హిరంగ‌స‌భ‌లో మాట్లాడుతూ గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల‌కు ముందు మాట ఇచ్చిన ప్ర‌కారం సూర్యాపేట‌ను జిల్లాను చేశాన‌ని, ఎమ్మెల్యేగా గెలిపించిన జ‌గ‌దీశ్వ‌ర్ రెడ్డిని