katta shekar reddy

మునుపటి గుణమేల మాను

మార్పును ఆహ్వానించలేనివారు మచ్చల కోసం భూతద్దం పెట్టి వెదుకుతుంటారు. జీవితకాలమంతా సాగించే ఆ మచ్చల అన్వేషణే ఒక మహా విప్లవకార్యంగా భావిస్తుంటారు. ఆ మచ్చల అన్వేషణలో పాల్గొన-లేదని ఇతరులపై దుమ్మెత్తిపోస్తుంటారు. వీరు మేధావుల పేరిట చెలామణి అవుతుంటారు. పత్రికల ముసు-గు లో చెలరేగుతుంటారు. ప్రాంతాన్ని బట్టి, అధికారంలో ఉన్న పార్టీని బట్టి వీళ్ల చూపు మారిపోతుంది. నిజానికి యథాతథవాదులకూ వీళ్ల కు పెద్దగా తేడా ఉండదు. వెనుకటికి భూస్వాములు ఊళ్లోకి బడిని రాని-చ్చేవారు కాదు. కరెంటు వచ్చినా తమ ఇళ్లకే పరిమితం. చెరువు నీళ్లు కూడా తమకే సొంతం. ఇవేవీ బక్క రైతులకు, పేదలకు దక్కేవి కాదు. దక్కకుండా

ముసుగు వీరుల అస‌లు ల‌క్ష్యం

కొట్లాడి సాధించుకున్న రాష్ట్రం. కనిపె ట్టి కాపాడుకోకపోతే ఈన గాచి నక్కలపాలు చేసినట్టవుతుంది. స్వ రాష్ట్రంలో కూడా ఈ కుట్రలేంది? ఓ చానెలో డు ఆయనెవరినో లైవ్‌లో పెట్టి రాముడిని తిట్టిస్తాడు. మరో చానెలోడు ఇంకో రాజకీయ స్వామీజీని సీనులోకి తీసుకొచ్చి హాట్ రాముడిని తిడుతారా. నేను యాత్ర చేస్తా అని బయ లుదేరుతాడు. భావోద్వేగాలు రెచ్చగొడుతారు. అసలు వీళ్లెవరు? ఒకాయనది చిత్తూరు. ఇంకొకాయనది కాకినాడ. వీళ్లకో రాష్ట్రం ఉన్నది. అక్కడా దేవుళ్లున్నారు. పంచాయితీలున్నాయి. కానీ ఇక్కడే పీఠం వేసుకొని ఎందుకు రభస చేస్తున్నారు? వీళ్లు పాత్రధారులు సరే. వీరి వెనుక సూత్రధారులెవరు? వీరి లక్ష్యం ఏమి టి?

త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీ య మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు.

ప్ర‌త్యేక ప్ర‌తిప‌క్షం

ప్రాజెక్టులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతసేపూ గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమీషన్లు. కానీ ప్రాజెక్టులంటే నీళ్లొస్తాయని, రైతుల పొలాలు పారుతాయని, కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పువస్తుందని ఎన్నడూ ఆలోచించలేదు. ప్రాజె క్టు మొదలుపెడితే అది పూర్తిచేయాలని, పెట్టిన పెట్టుబడి రావాలంటే వీలైనంత త్వరగా పొలాలకు నీరివ్వాలని ఏనాడూ తాపత్రయ పడలేదు. ఇప్పటికీ అదే మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు. అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డంపడాలని చూస్తున్నారు. కేసులు వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నవారు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏమని అర్థం చేసుకుంటారు? పట్టిసీమపై అంతగా గోలచేసిన ఆంధ్ర ప్రతిపక్షాలు ఒక్కకేసయినా వేశాయా? కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులపై వందలాది బ్రిడ్జి కమ్