kaleswaram project

జ‌ల‌దృశ్యం నుండి జ‌ల‌స్వ‌ప్నం వైపు

2001 ఏప్రిల్ 27న హుస్సేన్ సాగ‌ర్ స‌మీపాన జ‌ల‌దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర స‌మితి ఆవిర్భావానికి బాట‌లు వేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి 2014లో తెలంగాణ తొలి ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణ స్వీకారం చేశారు. అది మొద‌లు తెలంగాణ‌కు గ‌త అర‌వైఏండ్ల‌లో జ‌రిగిన అన్యాయాల‌ను స‌రిదిద్ద‌డం మొద‌లుపెట్టారు. ముఖ్యంగా తెలంగాణ‌కు సాగునీరే భ‌విష్య‌త్ అని తెలంగాణ ప్రాజెక్టుల‌ను రీ డిజైన్ చేసి నిర్మాణాలు మొద‌లు పెట్టారు. విప‌క్షాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా కోటి ఎక‌రాలకు సాగునీరు ఇచ్చి తీరుతామ‌ని ప్ర‌క‌టించి ఇటు పాల‌మూరు రంగారెడ్డి ఎత్తిపోత‌ల ప‌థ‌కం .. అటు ఉత్త‌ర తెలంగాణ‌లో

2018కి కాళేశ్వ‌రం

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నుండి అడ్డంకులు తొల‌గ‌డంతో 2018లోనే ప్రాజెక్టు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఈ మేర‌కు నిన్న రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు కీలక స‌మీక్ష నిర్వ‌హించారు. ప్యాకేజి 10 నుంచి ప్యాకేజీ 14 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ,భూసేకరణ, పునరావాసం, సబ్ స్టేషన్లు , విద్యుత్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై ఉద‌యం 10 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ల‌సౌధ‌లో చ‌ర్చించారు. గత 15 రోజుల్లోనే హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, అటవీ, భూగర్భ జల శాఖ , క‌న్ స్ట్ర‌క్ష‌న్

కాళేశ్వ‌రం రైట్ రైట్

కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనులపై స్టే విధిస్తూ ఢిల్లీలోని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) ప్రధాన బెంచ్ జారీచేసిన మధ్యంతర ఉత్తర్వులను ఉమ్మడి హైకోర్టు కొట్టివేసింది. దీంతో ప్రాజెక్టు నిర్మాణం మరింత వేగంగా ముందుకు సాగే అవకాశం ఏర్పడింది. రాష్ట్ర ప్రజల విస్తృత ప్రయోజనాల దృష్ట్యా తెలంగాణ చేపడుతున్న చర్యలకు అడ్డంకి కలిగించేలా ఉన్న ఎన్జీటీ మధ్యంతర ఉత్తర్వులను రద్దుచేస్తున్నట్లు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్ , జస్టిస్ జే ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రధానంగా ప్రజల తాగునీటి అవసరాల కోసం చేపడుతున్న భారీ ప్రాజెక్టు పనులను ఆపివేస్తూ ఎన్జీటీ

కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టుకు

కేసీఆర్ క‌ల‌ల ప్రాజెక్టు, ఉత్తర తెలంగాణ వరప్రదాయిని కాళేశ్వరం ప్రాజెక్టు తొలి దశ పనులకు పర్యావరణ అనుమతులు లభించాయి. ప్రాజెక్టు పనుల కోసం అనుమతులిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారికంగా సమాచారం అందించింది కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ. 3,168 హెక్టార్ల అటవీ భూమిని ప్రాజెక్టు కోసం బదలాయించేందుకు అనుమతి ఇచ్చింది. అటవీ డివిజన్ల పరిధిలోని అటవీ భూముల బదలాయింపునకు అనుమతులు వచ్చాయి. మహదేవ్‌పూర్, కరీంనగర్, సిరిసిల్ల, సిద్ధిపేట, యాదాద్రి, మెదక్, నిజామాబాద్, బాన్సువాడ, నిర్మల్‌లోని భూముల బదలాయింపునకు అనుమతులు లభించాయి.

కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ స్టే

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది. దీనితో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం, రాక్షసానందం పొందుతున్నారు. గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టే మీద సుప్రీం కోర్టుకు వెళ్తాం. న్యాయం సాధిస్తాం అని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కొనసాగింపుగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకునే ఉద్దేశం లేనందున తాము కోర్టుకు వెళ్లలేదని హ‌రీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, తెలంగాణకు నీటి ఆవ‌శ్య‌క‌త‌ అవసరం లేదని హ‌రీష్ రావు విమర్శించారు. ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు మిషన్

కాళేశ్వ‌రానికి ఆస‌రా

తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్న కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు రుణం ల‌భించింది. బ్యాంకుల కన్సార్టియంతో కాళేశ్వరం ఎత్తిపోతల కార్పొరేషన్ ఒప్పందం కుదుర్చుకుంది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 11,400 కోట్ల రుణం తీసుకునేందుకు ఒప్పందం జరిగింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నేతృత్వంలోని 12 బ్యాంకుల కన్సార్టియం రుణం ఇవ్వనున్నాయి. ఈ ఒప్పందం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ నేతృత్వంలో కుదిరింది.

కాళేశ్వ‌రానికి భీమా

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలకు బీమా సదుపాయం కల్పించనున్నార‌ని స‌మాచారం. ఇందుకోసం యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీని ఎంపిక చేస్తూ ప్ర‌భుత్వ‌ ప్రత్యేక ప్రధానకార్యదర్శి జోషి ఉత్తర్వులు ఇచ్చారు. వరదల సమయంలో ఏదైనా నష్టం జరిగితే… ఈ భీమా ఉపయోగపడుతుందన్న అంచనాతో ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాళేశ్వ‌రం ప్రపంచంలోనే ..

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప్ర‌పంచంలోనే మెగా ప్రాజెక్టు. డిసెంబ‌ర్ చివ‌రిక‌ల్లా ఎల్లంప‌ల్లి నుంచి మిడ్ మానేరుకు నీటిని పంపింగ్ చేసేందుకు స‌మ‌స్తం సిద్ధం చేయాలి. అతి త‌క్కువ స‌మ‌యంలో కాళేశ్వ‌రం ప్రాజెక్టును పూర్తి చేస్తే.. ఆ క్రెడిట్ ప్ర‌భుత్వంతో పాటు ఏజెన్సీల‌కు ద‌క్కుతుంది అని రాష్ట్ర భారీ నీటి పారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు అన్నారు. ఈ రోజు జ‌ల‌సౌధ‌లో బీహెచ్ఈఎల్, ఇరిగేష‌న్ అధికారుల‌తో స‌మావేశం అయ్యారు. ప్ర‌తి 15 రోజుల‌కొక‌సారి ప‌నుల పురోగ‌తిని స‌మీక్షించాల‌ని ఆయ‌న అధికారుల‌ను ఆదేశించారు. 3 నెల‌ల వ్య‌వ‌ధి అత్యంత కీల‌క‌మైనందున ప్ర‌తి పంపింగ్ స్టేష‌న్ లోనూ అనుభ‌వ‌జ్ఞులైన ఇద్ద‌రు సూప‌ర్ వైజ‌రీ

కాళేశ్వ‌రం పూర్త‌యితే ..

మిడ్మానేరు జలాశయ నిర్మాణానికి కాంగ్రెస్‌ ప్రభుత్వం తొమ్మిదేళ్లలో రూ.106 కోట్లు ఖర్చు చేస్తే, తెరాస ప్రభుత్వం మూడేళ్లలో రూ.407 కోట్లు వెచ్చించి పనులు పూర్తిచేస్తోంది. రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు పనులు పూర్తయితే ఉత్తర తెలంగాణలో ఏటా రెండు పంటలకు సాగు నీరు అందిస్తాం. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పూర్త‌యితే భూగ‌ర్భ‌జ‌లాలు పైన‌నే ఉంటాయి. బోర్లు, బావులు ఎండిపోవని రాష్ట్ర భారీ నీటి పారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి బహిరంగ సభలో ఆయ‌న‌ మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల కోసం రూ.వెయ్యి కోట్లు, కాలువల మరమ్మతు ఆధునికీకరణ

క్లియ‌ర్ : మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ కోసం త‌గ్గాల్సిందే

నాలుగైదు జిల్లాల‌కు సాగు నీరందించే మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ రిజ‌ర్వాయ‌ర్ ను నిర్మించ‌క త‌ప్ప‌దు. ఈ విష‌యంలో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండ‌వు. ఎక‌రాకు ఆరుల‌క్ష‌ల రూపాయ‌లు ఇస్తాం. డ‌బ‌ల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తాం. ఇంకా గ్రామ అభివృద్దికి ప్ర‌భుత్వం నుండి వీల‌యిన అన్ని అవ‌కాశాల‌ను ప‌రిశీలిస్తాం. భూములు కోల్పోతున్న వారు గొప్ప మ‌న‌సుతో నిర్మాణానికి స‌హ‌క‌రించాలి అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ కింద భూములు కోల్పోతున్న 14 గ్రామాల ప్ర‌జ‌ల‌కు విజ్ఞ‌ప్తి చేశారు. గ‌తంలోనే ప‌లుమార్లు చ‌ర్చ‌లు జ‌రిపారు. 14 గ్రామాల‌కు గాను 13 గ్రామాల ప్ర‌జ‌లు 123 జిఓ కింద భూములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. వేముల‌ఘాట్