india

సహనమే భూషణం

మనదేశం అభివృద్ధి పథం వైపు వేగంగా దూసుకుపోతున్న ఈ కీలక తరుణమందు మతం కేంద్రంగా పరిభ్రమిస్తున్న వరుస సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సంఘటనలు పునరావృతమవుతూ ఉంటే నల్లేరుపై నడకలా సాగుతున్న జీవన స్రవంతికి గండిపడే అవకాశం వుంది. మొదటినుంచి ఈ కర్మభూమిలో సనాతన ధర్మం కేంద్రంగా హిందూ మతం వెల్లివిరుస్తూ వుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. నిజానికి హిందూ మత స్థాపకులు ప్రత్యేకించి ఎవరూ లేరు. ఈ దేశ సంస్కృతి ఆచార వ్యవహార సంప్రదాయాలు, ధర్మము ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందించుట వలన నేటికి హిందూ ధర్మం

గురి త‌ప్ప‌ని విలుకాడు

మనం ఎక్కడినుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తు న్నాం? ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏంచేయాలి? సరిగ్గా గమనిస్తే పవిత్ర గ్రంథం భగవద్గీత సారాంశం ఇదే. ప్రజల నుంచి ఎన్నికైన ఏ నాయకుడైనా, ప్రజల కోసం పనిచేస్తున్నాననుకునే ఏ నేత అయినా ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు అత ని నుంచి ప్రజలకు, ఆ సమాజానికి మేలు జరిగినట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టమైన లక్ష్యం ఉన్నది. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నది. అందుకే ఆయన ఏ అడుగు వేసినా దానికి తగ్గ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్

అమెరికావి ఇక్క‌డ అమ‌లు చేయ‌లేం

ప్రపంచంలో అతిపెద్ద రవాణా సేవలు అందిస్తున్న సంస్థకు ఒక్క వాహనం కూడా లేదు. ఆ సంస్థ పేరు ఊబర్. ప్రపంచంలో అతిపెద్ద పుస్తకాలు అమ్మే సంస్థకు ఒక్క బుక్‌స్టోర్ కూడా లేదు. ఆ సంస్థ పేరు అమెజాన్. భారత్‌లో యువరక్తం ఉరకలెత్తుతున్నది. ఇప్పుడు ఇండియా టైం నడుస్తున్నది. సమయం వచ్చినప్పుడు ఎవరూ ఆపలేరు. అలాంటి నూతన ఆలోచనలకు భారత్ వేదికగా నిలుస్తుంది. భార‌త్ ను ఆపే స‌త్తా ఎవ‌రికీ లేదు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సు (జీఈఎస్) నేపథ్యంలో నీతిఆయోగ్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని హెచ్‌ఐసీసీలో ఆదివారం నిర్వహించిన సన్నాహక సదస్సులో

చైనా వెన‌క‌డుగు ఎందుకేసింది ?

త‌న‌ ప్ర‌భుత్వ మీడియాతో స‌వాళ్లు విసిరింది. సైనికుల‌తో క‌వాతు చేయించింది. మ‌న సైనికుల మీద దాడులు చేసి, రెచ్చ‌గొట్టి స‌హ‌నాన్ని ప‌రీక్షించింది. తాము దాడికి దిగితే భార‌త్ అల్ల‌క‌ల్లోల‌మేన‌ని .. త‌మ సైనికపాట‌వం, ఆయుధ సంప‌త్తిని ప్ర‌క‌టించింది. 70 రోజులుగా పిల్లిమొగ్గ‌లు వేసిన చైనా ఆఖ‌రుకు డోక్లాం నుండి అక‌స్మాత్తుగా వెన‌క‌డుగు వేసింది. క‌య్యానికి కాలుదువ్విన చైనా కిక్కురుమ‌న‌కుండా సైనికుల‌ను, అక్క‌డికి తీసుకొచ్చిన ర‌హ‌దారి నిర్మాణ యంత్రాల‌ను వెన‌క్కి తీసుకుని మ‌ళ్లిపోయింది. దీని వెన‌క మ‌త‌లబు ఏంటా అని అంద‌రూ ఆస‌క్తిగా ఆరా తీస్తున్నారు. వచ్చే నెల 3 నుంచి 5 వరకు చైనాలోని జియామెన్‌ లో బ్రిక్స్‌

Viral : మన భారతీయ పౌరుడు

మన భారతీయ పౌరుడు కూరగాయల మార్కెట్ లో పౌరుడు : కిలో టమాటా ఎంతకిస్తావోయ్ ? రైతు : 50/- రూపాయలు. పౌరుడు : అంత రేటా 25 కు ఇస్తవా ? రైతు: మాకు గిట్టుబాటు కాదు బాబు, పోనీ 45/- రూపాయలు ఇవ్వు. పౌరుడు : కుదరదు పక్కనే ఉన్న దుకాణంలో ఇస్తున్నారుగా నువ్వెందుకియ్య‌వు ?! ఆఖరిమాట 35/- రూపాయలు ఇస్తా , ఇష్టమయితే ఇవ్వు లేదంటే లేదు. (వాస్తవానికి ఆ దుకాణం లో ఇంకా ఎక్కువ ధరే చెప్పుంటారు రైతు: 40/- రూపాయలు అయినా ఇవ్వండి బాబు (భాధతో) పౌరుడు : అలాగ రావోయ్

క్రికెట్ కు జీఎస్టీ ఎఫెక్ట్

క్రికెట్‌ అభిమానులకు జీఎస్టీ దెబ్బ తగిలింది. వినోదపు కార్యక్రమాలపై కేంద్రం 28 శాతం జీఎస్టీ పన్ను విధించడంతో వన్డేమ్యాచ్‌ టికెట్‌ ధరలు భారీగా పెరిగాయి. వచ్చే నెల భారత్‌లో ఆస్ట్రేలియాతో జరిగే 5 వన్డేల సిరీస్‌పై ఈ ప్రభావం పడనుంది. జీఎస్టీ మూలంగా రూ.1300 టికెట్‌ ధర రూ.1900 పెరిగింది. వెయ్యి టికెట్‌ రూ.1500 కాగా, రూ.500 టికెట్‌ ధర రూ.650 అయింది. మ్యాచ్‌ టికెట్‌ ధరలు ఏమి పెరగలేదని, కేవలం జీఎస్టీ మాత్రమే కలిపామని బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, మాజీ కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ తెలిపాడు. ఆసీస్‌తో వన్డే సిరీస్‌లో భాగంగా ఒక మ్యాచ్‌ సెప్టెంబర్‌

రూ. 62 లక్షల పాతనోట్లు స్వాధీనం

రద్దైన పెద్ద నోట్లను తరలిస్తున్న ఐదుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ. 62 లక్షల విలువైన పాత రూ. 500, వెయ్యి నోట్లను స్వాధీనం చేసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూడూరు టోల్‌ప్లాజా వద్ద తనిఖీలు చేపడుతున్న పోలీసులు పెద్ద నోట్లు తరలిస్తున్న ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు ఈ రోజు భువనగిరి డీసీపీ క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాచకొండ జాయింట్‌ సీపీ తరుణ్‌జోషి వివరాలు వెల్లడించారు.

మోడీ పాల‌న‌లో ఇంత ఘోర‌మా

ఉగ్ర‌వాదం పీచ‌మ‌ణుచుతాం .. పాక్ మెడ‌లు వంచుతాం .. చైనా అంతు చూస్తాం అంటూ మ‌న దేశాన్ని పాలిస్తున్న నేత‌లు రోజూ మీడియా ముందు తెగ హెచ్చ‌రిక‌లు చేస్తున్నారు. దేశాన్ని కాపాడేది మేమే .. దేశ‌భ‌క్తి అంటే మాదే అంటూ నిత్యం డ‌ప్పుకొట్టుకునే బీజేపీ పాల‌న మోడీ ఆధ్వ‌ర్యంలో ఎంత దారుణంగా ఉందో చూస్తే మ‌నం నివ్వెర‌పోవాల్సిందే. ప‌రిస్థితి ఇంత దారుణ‌మా అని ఆందోళ‌న చెందాల్సిందే. ఇప్ప‌టికిప్పుడు ఏద‌యినా దేశం మ‌న మీద‌కు దాడికి వ‌స్తే ప‌ది రోజుల‌కు మించి పోరాడే ఆయుధ సంప‌త్తి మ‌న అమ్ముల పొదిలో లేదు. పార్ల‌మెంటు ముందుకు నిన్న వ‌చ్చిన ఈ కాగ్

జియో .. ఫోన్‌ ఫ్రీ, కాల్స్ ఫ్రీ

కొడితే కుంభ స్థ‌లాన్ని కొట్ట‌డం అంటే ముఖేష్ అంబానీని చూసి నేర్చుకోవాలి. పెద్ద‌మాట‌.. అది నేర్చుకునేది కూడా కాదు. చూసి ఆశ్చ‌ర్య‌ప‌డాలి. ఎందుకంటే ఇప్ప‌టికే జియోతో తీవ్ర సంచ‌ల‌నం సృష్టించిన ముఖేష్ మ‌రో అద్భుతానికి తెర‌తీశాడు. రిలయన్స్ జియో న‌డిపినంత కాలం ఫోన్ కాల్స్ ఫ్రీ అట‌. కాల్స్ కు ఒక్క పైసా కూడా ఛార్జి చేయ‌ను అని ఆయన ప్రకటించారు. త్వ‌ర‌లో ఒక ప్ర‌త్యేక ప్యాకేజీ కింద ఫ్రీగా ఫోను కూడా ఇవ్వ‌నున్నారు. వాటాదారుల స‌మావేశంలో ఈ ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న చెప్పిన హైలెట్స్ ! 1. ఇప్ప‌టివ‌ర‌కు 250 కోట్ల నిమిషాలు ఫ్రీ ఇచ్చాం. 2.