harish rao

పొంచి ఉన్న మరో ద్రోహం!

ఏపీ విభజన అశాస్త్రీయమంటూ టీడీపీ ఎంపీలు చేసిన వాదనలను కాంగ్రెస్ ఎందుకు ఖండించలేదు? తాము అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు బేషరతుగా ప్రత్యేక హోదా ఇస్తామన్న కాంగ్రెస్.. తెలంగాణకు రక్షణలు ఎందుకు ప్రతిపాదించలేదు? దీనిపై మాట్లాడటానికి తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఎందుకు జంకుతున్నారు? విభజన బిల్లులో ఉభయ రాష్ర్టాలకు 95(1) ప్రకారం పారిశ్రామిక ప్రోత్సాహకాలు, పన్నురాయితీ కల్పించాలన్న విషయాన్ని కాంగ్రెస్ ఎందుకు విస్మరిస్తున్నది? బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన హామీలను ఎందుకు అమలుచేయడం లేదు? ఏపీ, తెలంగాణలో టీడీపీతో పొత్తులకు వాతావరణాన్ని సిద్ధంచేసుకుంటున్న కాంగ్రెస్ తెలంగాణ ప్రజలకు ఇస్తున్న సంకేతమేమిటి?తన్నీరు హరీశ్‌రావు, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి అధికార దాహం,

కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించింది. కాగ్ అనేది దేశవ్యాప్త సంస్థ. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని కాగ్ ప్రశంసించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా, భగవద్గీతనా లేక ఖురానా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు అని మంత్రి హరీశ్ రావు ప్ర‌శ్నించారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌కే నష్టం అని హెచ్చ‌రించారు. కాంగ్రెస్

కేసీఆర్ వ్యూహం కేంద్రంలో క‌ద‌లిక‌

గోదావ‌రి న‌ది మీద మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ తో రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకుంటే విప‌క్షాలు ఎద్దేవా చేశాయి. ఆంధ్రా మీడియా రాద్దాంతం చేసింది. కానీ ఈ రోజు ఆ ఒప్పంద‌మే తెలంగాణ కొర‌కు క‌డుతున్న అనేక ప్రాజెక్టుల‌కు కేంద్రం నుండి అనుమ‌తి వ‌చ్చేలా చేసింది. కేంద్రం నుండి ఒక్క అనుమ‌తి తీసుకురావ‌డానికి గ‌త ప్ర‌భుత్వాల కాలంలో ఏళ్ల త‌ర‌బ‌డి .. ద‌శాబ్దాల పాటు కాల‌యాప‌న జ‌రిగిన ప్రాజెక్టులు కోకొల్ల‌లు. కానీ గ‌త మూడున్న‌రేళ్ల కాలంలో కేంద్రం నుండి తెలంగాణ ప్ర‌భుత్వం రెండు వేల‌కు మించిన అనుమ‌తులు సాధించ‌డం విశేషం. ఇది ఓ రికార్డు కూడా.

2018కి కాళేశ్వ‌రం

తెలంగాణ ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా చేప‌ట్టిన కాళేశ్వ‌రం ప్రాజెక్టుకు కేంద్రం నుండి అడ్డంకులు తొల‌గ‌డంతో 2018లోనే ప్రాజెక్టు పూర్త‌య్యే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తుంది. ఈ మేర‌కు నిన్న రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు కీలక స‌మీక్ష నిర్వ‌హించారు. ప్యాకేజి 10 నుంచి ప్యాకేజీ 14 వరకు కాళేశ్వరం ప్రాజెక్టు పనులను ,భూసేకరణ, పునరావాసం, సబ్ స్టేషన్లు , విద్యుత్ లైన్ల నిర్మాణం తదితర అంశాలపై ఉద‌యం 10 నుండి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌ల‌సౌధ‌లో చ‌ర్చించారు. గత 15 రోజుల్లోనే హైడ్రాలజీ, అంతర్రాష్ట్ర, అటవీ, భూగర్భ జల శాఖ , క‌న్ స్ట్ర‌క్ష‌న్

మిడ్ మానేరే మీకు సాక్ష్యం

కాంగ్రెస్ హయాంలో తెలంగాణ ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురయ్యాయనేందుకు మిడ్‌మానేరు ఒక ఉదాహరణ అని మంత్రి హరీష్ రావు అన్నారు. 1993-2006 మధ్య మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు ఏమాత్రం ముందుకు సాగలేదని, మిడ్‌మానేరు ప్రాజెక్టు తెలంగాణ రాష్ట్రానికి గుండెకాయలాంటిందని.. టీఆర్‌ఎస్ హయాంలో మిడ్‌మానేరు ప్రాజెక్టు పనులు వేగవంతం అయ్యాయ‌ని అన్నారు. అసెంబ్లీ ప్రశ్నోత్తరాలలో భాగంగా శాసనసభలో మిడ్‌మానేరు ప్రాజెక్ట్‌పై చర్చ జరిగింది. మిడ్ మానేరుకు నీటి తరలింపు, పునరావాసం, ఉపాధి కల్పన, పరిహారం వంటి అంశాలపై సభ్యులు జీవన్‌రెడ్డి, చెన్నమనేని రమేష్, రసమయి బాలకిషన్, శోభలు ప్రశ్నించారు. సభ్యుల ప్రశ్నలకు మంత్రి హరీష్‌రావు సమాధానం ఇచ్చారు. 25 ఏళ్లలో జరగని

కాంగ్రెస్ ను రైతులు న‌మ్మ‌రు

అసెంబ్లీలో రుణమాఫీ, పంటలకు మద్దతు ధర, రైతు సంక్షేమంపై చర్చ జరుగుతున్నది. ఈ సందర్భంగా అసెంబ్లీలో పంటలకు మద్దతు ధరపై మాట్లాడుతున్న మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డిని మాట్లాడకుండా.. చర్చ జరగనివ్వకుండా అడ్డుకుంటున్న కాంగ్రెస్ నేతలపై మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. రైతులపై కాంగ్రెస్ నేతలు మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. కాంగ్రెస్ అంటేనే కరెంట్ కోత… ఎరువుల కోరత అని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ నేతలను రైతులు నమ్మే స్థితిలో లేరన్నారు. సభను అడ్డుకోవడమంటే రైతులకు అన్యాయం చేయడమేనని మంత్రి అన్నారు. దానికి ప్రతిగా జానారెడ్డి వారెందుకు వెళ్లారో.. వీరెందుకు వచ్చారో తమకు తెలుసు అంటూ పక్షపాత

చేత‌న‌యితే చ‌ర్చ‌కు రండి

ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల మీద శాస‌న‌స‌భ‌లో చ‌ర్చించేందుకు ప్ర‌భుత్వం సిద్దంగా ఉంది. చేత‌న‌యితే వ‌చ్చి స‌భ‌లో చ‌ర్చించండి. అంతేగానీ ప్ర‌భుత్వం ర‌చ్చ‌కు సిద్దంగా లేదు. స‌భ‌లో మాట్లాడం .. రోడ్డు మీద‌నే మాట్లాడుతాం అంటే ఏం చేస్తాం. కాంగ్రెస్ నేతలు ఛ‌లో అసెంబ్లీని ఉపసంహ‌రించుకోవాలని శాస‌న‌స‌భా వ్య‌వ‌హారాల‌ మంత్రి హ‌రీష్ రావు అన్నారు. టీఆర్‌ఎస్‌ఎల్పీ కార్యాలయంలో హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం అన్ని విషయాలపై చర్చించేందుకు సిద్ధంగా ఉంది.. మీకు ఏమైనా అభ్యంతరాలు ఉంటే బీఏసీ సమావేశంలో చెప్పాలని సూచించారు. అసెంబ్లీ ముట్టడికి కాంగ్రెస్ ప్రయత్నించడం వారి అసహన రాజకీయానికి పరాకాష్ట అని, రేపు ఏం జ‌రిగినా కాంగ్రెస్ పార్టీనే

మీ ఆల‌స్యం .. మాకు అన‌ర్ధం

తెలంగాణ స‌మ‌గ్రాభివృద్దికి ప్రాజెక్టుల నిర్మాణ‌మే శ‌ర‌ణ్యం అని మా ప్ర‌భుత్వం నిర్మాణాలు చేప‌ట్టింది. కేంద్రం మాత్రం ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా జాప్యం చేయ‌డం మూలంగా మా రాష్ట్ర బ‌డ్జెట్ మీద భారం ప‌డుతుంది. వెంట‌నే అన్ని ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీని కోరారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం)పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశానికి హ‌రీష్ రావు హాజ‌ర‌య్యారు. రైతుల క‌ష్టాల‌ను తీర్చేందుకు సాగునీటి

ముప్ప‌య్యేండ్ల క‌ల .. మూడేండ్ల‌లో

ముప్ప‌య్యేండ్ల క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల క‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మూడేండ్ల‌లో సాకారం చేసింది. క‌ల్వ‌కుర్తి నీళ్ల‌తో ఈ ప్ర‌భుత్వం మీ కాళ్లు క‌డిగింది. నియోజ‌క‌వ‌ర్గంలోని సాగుకు యోగ్య‌మ‌యిన ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇవ్వ‌డ‌మే కాదు. తెలంగాణ‌లోని ప్ర‌తి ప్రాంతానికి నీళ్లిస్తాం అని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కల్వకుర్తి మండలం ఎలికట్ట సమీపంలో ఉన్న డీ-29 కాల్వ వద్ద కృష్ణాజలాలను మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించి విడుదలచేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎంజీకేఎల్‌ఐ పథకాన్ని మూడు దశాబ్దాలకిందట మొదలుపెట్టినా, అప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు సాగునీరు

కాళేశ్వ‌రంపై కాంగ్రెస్ స్టే

జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ కాళేశ్వరం ప్రాజెక్టుపై స్టే ఇచ్చింది. దీనితో కాంగ్రెస్ పార్టీ నాయకులు పైశాచిక ఆనందం, రాక్షసానందం పొందుతున్నారు. గ్రీన్ ట్రిబ్యున‌ల్ స్టే మీద సుప్రీం కోర్టుకు వెళ్తాం. న్యాయం సాధిస్తాం అని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు స్ప‌ష్టం చేశారు. ప్రాణహిత ప్రాజెక్టుకు కొనసాగింపుగానే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మిస్తున్నామని, గతంలో ప్రాజెక్టులను అడ్డుకునే ఉద్దేశం లేనందున తాము కోర్టుకు వెళ్లలేదని హ‌రీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయ ప్రయోజనాలు తప్ప ప్రజల ప్రయోజనాలు, తెలంగాణకు నీటి ఆవ‌శ్య‌క‌త‌ అవసరం లేదని హ‌రీష్ రావు విమర్శించారు. ఇంటింటికి మంచినీళ్లు అందించేందుకు మిషన్