chandra babu naidu

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

మౌన‌మే కేసీఆర్ ఆయుధం

కేంద్రం మీద అసంతృప్తితో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్ల‌మెంటులో ఎన్డీఎ ప్ర‌భుత్వం మీద అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాడు. ప్ర‌త్యేక‌హోదాకు బ‌దులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్ర‌బాబు తీరును ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాడు. హోదాకు ప‌ట్టుబ‌ట్ట‌క‌పోవ‌డం మూలంగా ఆంధ్రా అన్ని రంగాల‌లో వెన‌క‌బ‌డుతుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మారు. చంద్ర‌బాబుకు ఆంద్రాలో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఎన్డీఎ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎంపీల‌తో నిర‌స‌న‌ల డ్రామా ఆడించాడు. తాజాగా అవిశ్వాసం పేరుతో మ‌రోసారి పిల్లిమొగ్గ‌లు వేశాడు. త‌న అనుకూల మీడియాతో దేశంలో ఏదో ఉప‌ద్ర‌వం రాబోతుంద‌న్న ప్ర‌చారం క‌ల్పించాడు.

అభివృద్దిని ఓర్వ‌లేవు .. ఆనందాన్ని పంచ‌లేవు

నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష .. 60 ఏండ్ల అలుపెర‌గ‌ని ఉద్య‌మం .. వంద‌ల‌కొద్దీ బ‌లిదానాలు.. కేసీఆర్ ప్రాణాలు ప‌ణంగా .. టీఆర్ఎస్ ప‌ద‌వీ త్యాగాల ఫ‌లితంగా ఏర్ప‌డ్డ‌ది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్, బీజేపీ త‌దిత‌ర పార్టీలు తెలంగాణ ఏర్పాటు త‌మ వ‌ల్ల‌నే అని ఎంత వాదించినా ఉద్య‌మ స‌మ‌యంలో, పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన స‌మ‌యంలో వారు వేసిన పిల్లిమొగ్గ‌లు, తెలంగాణ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొంద‌కుండా వారు చేసిన విఫ‌ల‌య‌త్నాలు తెలంగాణ ప్ర‌జ‌లు అప్పుడే మ‌ర‌చిపోతార‌నుకోవ‌డం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు నిరంత‌రం శ్ర‌మించిన కేసీఆర్ వ‌చ్చిన తెలంగాణను ఎలా అభివృద్ది

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు

శాడిస్టు చంద్ర‌దాసు భావప్రాప్తి

నాకు దూరం కాబ‌ట్టి నీకు దూరం కావాలి .. న‌న్ను ప‌ట్టించుకోవ‌డం లేదు కాబ‌ట్టి నిన్ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని చెప్పాలి. నేను నిన్ను ప్రేమిస్తున్నాను .. నువ్వు నాకే ద‌క్కాలి. లేకుంటే యాసిడ్ పోసి చంపుతా. నాకు ద‌క్క‌నిది మ‌రెవ‌రికీ ద‌క్క‌డానికి వీలు లేదు. ఆంధ్ర‌జ్యోతి రాధాకృష్ణ వ్య‌వ‌హారం అచ్చం ఇలాగే ఉంది. ఉంటుంది. ఆంధ్రోడు కాబ‌ట్టి ఆంధ్ర మీద ప్రేమ‌ను కాద‌న‌లేం. క‌మ్మోడు కాబ‌ట్టి చంద్ర‌బాబు మీద ప్రేమ ఆయ‌న వ్య‌క్తిగ‌తం. త‌న ప‌త్రిక‌కు లాభం జ‌రుగుతుంది కాబ‌ట్టి ఆంధ్ర ప్ర‌భుత్వ అవినీతికి కొమ్ముకాయ‌డం ఆయ‌న వ్యాపార విష‌యం అని వ‌దిలేద్దాం. కానీ ఆయ‌న జీవిత‌కాలంలో ఒక్క‌సారి

బాబు గ‌ట్టి పైర‌వే చేశాడు

అమెరికా అధ్య‌క్షుడి కూతురు ఇవాంక ట్రంప్ అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సులో పాల్గొనేందుకు హైదరాబాద్ వచ్చారు. ఈ స‌ద‌స్సును నిర్వ‌హించేందుకు దేశంలోని ఎనిమిది రాష్ట్రాలు ముందుకు వ‌చ్చాయి. అయితే అమెరికా మాత్రం హైద‌రాబాద్ నే ఎంచుకుంది. అంత‌ర్జాతీయ స్థాయిని ఆక‌ర్షించిన ఈ స‌ద‌స్సును ఆంధ్రాలో నిర్వ‌హించేందుకు చంద్ర‌బాబు నాయుడు గ‌ట్టి పైర‌వే చేశాడ‌ట‌. ఏకంగా అమెరికా కాన్సులేట్ అధికారుల‌నే క‌లిసి ఆంధ్రాలో నిర్వ‌హించేలా ఒప్పించాల‌ని ప్ర‌య‌త్నాలు చేశార‌ట‌. ఒప్పుకుంటే అమ‌రావ‌తి లేదా విశాఖ‌లో దీనిని నిర్వ‌హిస్తామ‌ని అన్నార‌ట‌. కానీ అమెరికా మాత్రం హైద‌రాబాద్ లో నిర్వ‌హించేందుకే మొగ్గుచూపింద‌ట‌. అమ‌రావ‌తిలో జరిగితే అమెరికా కంపెనీల‌ను ఆక‌ట్టుకోవ‌చ్చ‌ని భావించార‌ట‌. కానీ బాబు ప్ర‌య‌త్నాలు

ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోండి

నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా ? చ‌ంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌లేదా ? ప‌్ర‌జ‌ల‌తో ఎలా ఉండాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకోండి అని ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. నాకు వ‌చ్చిన నంది అవార్డును తీసుకోన‌ని, వాటిని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ప్ర‌క‌టించాల‌ని అన్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి అవార్డులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, నందుల‌తో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తారా ? అని పోసాని ప్ర‌శ్నించారు. కావాలంటే లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులు ఇచ్చుకోండ‌ని అన్నారు. ఇలాంటి వివాదాలు వ‌స్తే తాను చ‌చ్చే వ‌ర‌కు నంది

డామిట్ క‌థ అడ్డం తిరిగిందా

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్చే ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు లండ‌న్ నుండి రేవంత్ వ్య‌వ‌హారంలో ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాను వ‌చ్చే వ‌ర‌కు రేవంత్ హోదాను క‌ట్ చేస్తున్నాన‌ని, ఆయ‌న ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించినా పార్టీకి సంబంధం లేదు. ఎవ‌రూ వెళ్లొద్ద‌ని, ఆయ‌న‌ను సాధార‌ణ ఎమ్మెల్యేగానే చూడాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అయితే ఇక్క‌డే రేవంత్ వ్య‌వ‌హారం మ‌లుపు తిరిగిన‌ట్లు తెలుస్తుంది. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా రేపు అసెంబ్లీలో టీడీఎల్పీ

రాజ‌గురువు ప్లేటు ఫిరాయించాడా ?

ఈనాడు అధినేత రామోజీరావు ఆంధ్రా రాజ‌కీయాలలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చ‌క్రం తిప్ప‌బోతున్నారా ? త‌న మ‌న‌వ‌డి పెళ్లిలో త‌ప్ప ఎన్న‌డూ ఈ మ‌ధ్య‌కాలంలో రామోజీరావు చంద్ర‌బాబు నాయుడుతో క‌నిపించ‌లేదు. చంద్ర‌బాబుకు రాజ‌గురువుగా పేరు గాంచిన రామోజీ రావు గ‌త మూడేళ్ల‌కాలంలో త‌న బ‌ద్ద‌శ‌త్రువు జ‌గ‌న్ తో భేటీ అయ్యారు. రామోజీరావు కోడలు, జ‌గ‌న్ స‌తీమ‌ణి భార‌తి అత్యంత స‌న్నిహితులు కావ‌డం ఇక్క‌డ గ‌మ‌నించాల్సిన విష‌యం. ఆంధ్రా చంద్ర‌బాబు నాయుడు పాల‌న అస్త‌వ్య‌స్థంగా ఉంది. అవినీతి రాజ్య‌మేలుతుంది. ఇటీవ‌ల నంధ్యాల ఎన్నిక‌ల్లో అధికార బ‌లంతో బ‌య‌ట‌ప‌డ్డా సాధార‌ణ ఎన్నిక‌ల్లో టీడీపీ ప‌రిస్థితి అగ‌మ్య‌గోచ‌ర‌మే. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగ‌యినా అధికారంలోకి

టీడీపీ నుండి రేవంత్ స‌స్పెండ్ ?

తెలుగుదేశం పార్టీ నుండి రేవంత్ రెడ్డి స‌స్పెన్ష‌న్ కు రంగం సిద్దం అవుతున్న‌ట్లు తెలుస్తుంది. ఈ మేర‌కు ఆయ‌న మీద వేటు వేయాల‌ని ఆ పార్టీ పొలిట్ బ్యూరో తీర్మానించిన‌ట్లు చెబుతున్నారు. మోత్కుప‌ల్లి వ‌ర్గం మాత్రం రేవంత్ వ్యాఖ్య‌లు, ప‌త్రిక‌ల క‌థ‌నాల మీద ఓ తీర్మానం చేసి చంద్ర‌బాబుకు లేఖ రాసిన‌ట్లు తెలుస్తుంది. రేవంత్ రెడ్డికి విదేశాల నుండి వ‌చ్చిన త‌రువాత అపాయింట్ మెంట్ ఇవ్వ‌కూడద‌ని, కాంగ్రెస్ లో చేరను అనే విష‌యాన్ని రేవంత్ ఒప్పుకోవ‌డం లేద‌ని, పార్టీ గౌర‌వాన్ని భంగ‌ప‌రిచాడ‌ని ఫిర్యాదులు చేసిన‌ట్లు స‌మాచారం. చంద్రాబాబు విదేశాల నుండి రాక ముందే స‌స్పెండ్ చేస్తార‌ని అంటున్నారు.