bjp

మౌన‌మే కేసీఆర్ ఆయుధం

కేంద్రం మీద అసంతృప్తితో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్ల‌మెంటులో ఎన్డీఎ ప్ర‌భుత్వం మీద అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాడు. ప్ర‌త్యేక‌హోదాకు బ‌దులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్ర‌బాబు తీరును ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాడు. హోదాకు ప‌ట్టుబ‌ట్ట‌క‌పోవ‌డం మూలంగా ఆంధ్రా అన్ని రంగాల‌లో వెన‌క‌బ‌డుతుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మారు. చంద్ర‌బాబుకు ఆంద్రాలో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఎన్డీఎ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎంపీల‌తో నిర‌స‌న‌ల డ్రామా ఆడించాడు. తాజాగా అవిశ్వాసం పేరుతో మ‌రోసారి పిల్లిమొగ్గ‌లు వేశాడు. త‌న అనుకూల మీడియాతో దేశంలో ఏదో ఉప‌ద్ర‌వం రాబోతుంద‌న్న ప్ర‌చారం క‌ల్పించాడు.

ధ‌ర్మ‌యాత్రా ? తెలంగాణ మీద దండ‌యాత్రా ?

కూట్ల రాయి తీయ‌లేనోడు ఏట్ల రాయి తీస్తన‌న్న‌డ‌ని ఓ సామెత‌. ఉన్న ఐదు స్థానాలు ఉంటాయో ? పోతాయో ? తెలియ‌ని బీజేపీ పార్టీ తెలంగాణలో ఏదో అల‌జ‌డి సృష్టించి ప్ర‌జ‌ల‌ను అయోమ‌యంలోకి నెట్టాల‌ని ఇంకా తాను న‌మ్ముకున్న అరిగిపోయిన రికార్డు హిందుత్వ భావ‌జాలాన్ని రెచ్చ‌గొట్టి ల‌బ్దిపొందాల‌ని ఆరాట‌ప‌డుతుంది. ఈ పార్టీకి తెలంగాణ‌లో బ‌ల‌ప‌డ‌డానికి మ‌రే అంశ‌మూ అందుబాటులో లేక‌పోవ‌డ‌మే దీనిని న‌మ్ముకోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం. పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కే తెలియ‌ని రామ్ మాధ‌వ్ వ‌రంగ‌ల్ స‌భ‌లో మాట్లాడిన భాష చూస్తే వారు ఎంత‌క‌యినా దిగ‌జార‌డానికి సిద్ద‌మ‌య్యార‌ని తేలిపోయింది. ప్ర‌జ‌ల‌తో సంబంధాలు లేని ముర‌ళీధ‌ర్ రావు 2019లో అధికారం మాదే

పంచె చాటు పౌరుషం

`డీఎస్ డిక్టేట‌ర్ కాదు .. నేను బానిస‌ను కాను. నాకు తండ్రి చాటు రాజకీయాలు నాకు రావు` టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ మీద ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు, బీజేపీ పార్టీలో కొన‌సాగుతున్న నిజామాబాద్ బీజేపీ నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్య‌లు చేశాడు అర‌వింద్. ఇక ఆ మ‌రుస‌టి రోజే నిజామాబాద్ లో మున్నూరుకాపు కుల సంఘం స‌మావేశం ఏర్పాటు చేసిన

కుక్క‌తోక .. రాధాకృష్ణ‌

ఆంద్ర‌ప్ర‌దేశ్ లో నాలుగేండ్ల అవినీతి, అస‌మ‌ర్ధ పాల‌న‌తో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు మైలేజీ పాతాళానికి అడుగంటిపోయింది. త‌న‌ను తాను పెద్ద మేధావిగా, సాంకేతిక నిపుణుడిగా ఊహించుకునే చంద్ర‌బాబు నాయుడు ఈ ప్ర‌పంచానికి సాంకేతిక‌త‌ను ప‌రిచ‌యం చేసింది తానేన‌న్న భ్ర‌మ‌ల్లో ఉంటాడు. అయితే ఆయ‌న అడుగుల‌కు మ‌డుగులొత్తే మీడియా కూడా అయ‌న అధికారంలో ఉన్న ప్ర‌తిసారి ఆయ‌న ఏది చేసినా రైట్ అన్న భ్ర‌మ‌ల్లోనే ఉంచుతుంది. జ‌నం ఈడ్చిత‌న్ని ఓడిస్తే .. కొన్నాల్లు ఆగి చంద్ర‌బాబును ఓడించి త‌ప్పు చేశామ‌ని ప్ర‌జ‌లు ప‌శ్చాత్తాప ప‌డుతున్నార‌ని ఈ మీడియా ప్ర‌చారం చేస్తుంది. అంతే కానీ ఎన్న‌డు కూడా చంద్ర‌బాబు నాయుడు

ప్ర‌జాస్వామ్యం ఖూనీ .. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతుంది

మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం కోసం ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించి ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే రాహుల్ కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ట్విట్ట‌ర్ లోనే స‌మాధానం ఇచ్చారు. కర్ణాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది…? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయింది. జేడీఎస్ కేవలం

య‌డ్యూర‌ప్ప‌కు సుప్రీం కొర్రీ

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణాధికారంతో ప్ర‌మాణ స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప‌కు సుప్రీం కోర్టు నిర్ణ‌యం ఇబ్బందిక‌రంగా మారింది. గ‌వ‌ర్న‌ర్ బ‌ల‌నిరూప‌ణ‌కు 15 రోజులు గ‌డువు ఇచ్చినా సుప్రీం కోర్టు మాత్రం బీజేపీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేలు కాకుండా, ఎవరెవరు మద్దతు పలుకుతున్నారన్న జాబితాను సంత‌కాల‌తో త‌క్ష‌ణం త‌మ ముందు ఉంచాల‌ని ఆదేశించింది. దీంతో ఈ రోజు త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న మిగ‌తా ఎమ్మెల్యేల పేర్ల జాబితాను బీజేపీ సుప్రీం కోర్టు ముందు ఉంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే జ‌రిగితే క‌ర్నాట‌క‌లో ప్ర‌కంప‌న‌లు రేగ‌నున్నాయి. సుప్రీంకు స‌మ‌ర్పించిన జాబితాలోని వ్య‌క్తులే స‌భ‌లో బీజేపీకి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సి ఉంటుంది. లేకుంటే

ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసి య‌డ్యూర‌ప్ప త‌న కోరిక‌ను మ‌రోసారి నెర‌వేర్చుకున్నారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ఈ ఉద‌యం ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా ప్ర‌మాణ స్వీకారం సాగింది. య‌డ్యూర‌ప్ప‌కు బీజేపీ శ్రేణులు భారీ స్వాగ‌తం ప‌లికాయి. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు యడ్యూరప్ప రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. క‌ర్టాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి 104 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. శాస‌న‌స‌భ‌లో ఉండాల్సిన 112 స్థానాల‌కు ఎనిమిది స్థానాలు త‌క్కువ‌గా ఉన్నాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం మేర‌కు 15 రోజుల‌లో బ‌లం నిరూపించుకుంటాన‌ని య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ

ఫెడరల్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపో యింది. అధికారం అందుకోవాలన్న పార్టీలకు జేడీఎస్ కీలకంగా మారిం ది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్‌కు భేషరతు మద్దతు తెలుపగా, అతిపెద్ద పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతున్నది. మునుముందు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఆపగలుగుతాయా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల కిందట బెంగళూరు పర్యటన సందర్భంగా వేసిన అంచనాలు, చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నారు.

ఎగ్జిట్ పోల్ : గుజ‌రాత్ ఎవ‌రిది

గుజ‌రాత్‌లో ఎన్నిక‌లు ముగిశాయి. మొత్తం 182 అసెంబ్లీ సీట్లు ఉన్న గుజ‌రాత్‌లో 92 సీట్లు గెలుచుకున్న పార్టీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ ఎన్నిక‌ల్లోనూ గుజ‌రాత్ లో బీజేపీదే విజ‌య‌మ‌ని ప‌లు ఎగ్జిట్ పోల్ ఫ‌లితాల ద్వారా తెలుస్తోంది. ఎగ్జిట్ పోల్స్ వివ‌రాలు ఇవి .. టైమ్స్ నౌ-వీఎంఆర్‌ బీజేపీ-119 స్థానాల్లో గెలుస్తుంది. కాంగ్రెస్ -70, ఇత‌రులు 3 స్థానాల్లో విజ‌యం సాధిస్తారు. ఏబీపీ-సీఎస్‌డీఎస్‌ బీజేపీ 91-99 స్థానాల్లో, కాంగ్రెస్ 78-86 స్థానాల్లో, ఇత‌రులు 3-7 స్థానాల్లో గెలుపు. రిప‌బ్లిక్ బాత్‌-జ‌న్ కీ బాత్‌ బీజేపీ-108 స్థానాల్లో, కాంగ్రెస్ 74, ఇత‌రులు 0. సహారా సమయ్ బీజేపీ 110-120

అమిత్ షా వ‌చ్చి అంద‌లం ఎక్కిస్తాడ‌నుకుంటే

నోరు తెరిస్తే 2019లో అధికారం మాదే. టీఆర్ఎస్ కు ఈ రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయం మేమే అంటూ బీజేపీ రాష్ట్ర నేత‌లు మీడియా ముందు కిందా మీదా ప‌డి చెప్పుకుంటూ వ‌చ్చారు. ఆ మ‌ధ్య బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు అమిత్ షా వ‌స్తే ఒక జ‌డ్పీటీసీని చేర్చుకుని సంబ‌రాలు చేసుకున్నారు. కేంద్రంలో బీజేపీ ప్ర‌భుత్వ అండ‌తో తెలంగాణ‌లో ఎవ్వ‌రిన‌యినా ముగ్గులోకి దింపుతాం అని భ్ర‌మ‌ప‌డ్డారు. కానీ గ‌త కొన్నాళ్లుగా జ‌రుగుతున్న రాజ‌కీయ ప‌రిణామాలు రాష్ట్ర బీజేపీకే కాదు జాతీయ బీజేపీ శాఖ‌కు కూడా మింగుడు ప‌డ‌డం లేదు. ఓటుకునోటు నిందితుడు రేవంత్ రెడ్డి భారీ అనుచ‌ర‌గ‌ణంతో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నాడు.