arjun reddy

ప‌వ‌న్ ఫ్యాన్స్ కు చ‌ల‌నం వ‌స్తుందా ?

తెలంగాణ ఉద్య‌మానికి టాలీవుడ్ చేసింది ఏమీ లేదు. ముఖ్యంగా సామాజిక తెలంగాణ‌కు సై అంటూ ప్రజారాజ్యం అధ్య‌క్షుడుగా చిరంజీవి, యువ‌రాజ్యం అధ్య‌క్షుడుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ లు తెలంగాణ అంతా తిరిగి మ‌ద్ద‌తు ఇస్తున్న‌ట్లు తెలిపారు. 2009 డిసెంబ‌రు 9న కేంద్ర ప్ర‌భుత్వం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా ప్ర‌క‌ట‌న చేయ‌గానే చిరంజీవి స‌మైక్యాంధ్ర జెండా ఎత్తుకుని ఎమ్మెల్యే ప‌దవికి దొంగ రాజీనామా చేయ‌గా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప‌త్తా లేకుండా పోయాడు. తెలంగాణ ఏర్ప‌డిన త‌రువాత జ‌న‌సేన ఆవిర్భావ స‌మ‌యంలో, ఆ త‌రువాత తెలంగాణ ఏర్పాటుతో త‌న‌కు నిద్ద‌ర ప‌ట్ట‌లేద‌ని నిస్సిగ్గుగా ప‌వ‌న్ క‌ళ్యాణ్ తెలంగాణ వ్య‌తిరేక‌త‌ను అవ‌కాశం దొరికిన‌ప్పుడ‌ల్లా

టాలీవుడ్ పెద్ద‌ల అక్క‌సు బ‌య‌ట‌ప‌డింది

తెలంగాణ ద‌ర్శ‌కుడు, తెలంగాణ హీరో, తెలంగాణ నిర్మాత ముగ్గురూ క‌లిసి తెలుగు సినిమా చరిత్ర‌లో నిలిచిపోయే విజ‌యాన్ని సాధించారు. తెలుగు సినిమా చ‌రిత్ర‌ను ఓ మ‌లుపు తిప్పారు. తెలుగు సినిమాలకు భిన్నంగా కొత్త ప్ర‌యోగంతో సినిమా తీసి తెలుగు సినిమాల భ‌విష్య‌త్ కు దిశానిర్దేశం చేశారు. ఈ సినిమాకు ప్రేక్ష‌కులే ప‌బ్లిసిటీ, సోష‌ల్ మీడియాలో వారి పోస్ట్ లే ఈ సినిమాకు ప్ర‌మోష‌న్. దేశ‌, విదేశాల‌లో “అర్జున్ రెడ్డి” సినిమా విజ‌య‌మే ఓ పెద్ద శ‌బ్ద‌మై ప్ర‌తిధ్వ‌నిస్తోంది. తెలుగు సినిమాకు చెందిన కొంత మంది హీరోలు మాత్రం ఈ సినిమాను, హీరోను, ద‌ర్శ‌కుడిని అభినందిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో అయితే

అర్జున్ రెడ్డి దెబ్బ‌కు స్టార్ హీరోల రికార్డులు

అర్జున్ రెడ్డి దెబ్బ‌కు ఓవ‌ర్సీస్ లో బాక్సాఫీసు రికార్డులు బ‌ద్ద‌ల‌వుతున్నాయి. అమెరికాలో ఈ సినిమా రికార్డు క‌లెక్ష‌న్ల‌తో చ‌రిత్ర తిరగ‌రాస్తోంది. ఎ స‌ర్టిఫికెట్ సినిమా ఇన్ని వ‌సూళ్లు సాధించ‌డం అమెరికాలో ఇదే తొలిసారి. స్టార్ హీరోల రికార్డులు అన్నీ ఈ సినిమాతో క‌లెక్ష‌న్ల‌లో క‌నుమ‌రుగు అవుతున్నాయి. ఓవర్సీస్ లో ప్రీమియర్ షోతో పాటు, మొదటి రోజు కలెక్షన్లను కలిపి 4లక్షల 60వేల డాలర్లును ‘అర్జున్ రెడ్డి’ రాబట్టింది. అల్లు అర్జున్ నటించిన ‘సరైనోడు’ సినిమా ఇవే షోలకు గాను 3లక్షల 96వేల డాలర్టను వసూలు చేసింది. నాని తాజా హిట్ మూవీ ‘నిన్ను కోరి’కి 3 లక్షల 82వేల

అర్జున్ రెడ్డి ట్రెండ్ సెట్ చేసింద‌ట‌

ప‌క్కా మాస్ ఫార్మూలా .. రియ‌లిస్టిక్ మ‌రియు బోల్డ్ గా ప్రేమ‌లో ఓడిపోయిన ఓ ప్రేమికుడి క‌థ‌ను ఈ కాలానికి త‌గ్గ‌ట్లుగా ప్రజెంట్ చేస్తూ సాగిన అర్జున్ రెడ్డి సినిమా ప్రేక్ష‌కుల‌కు వినోదాన్ని పంచుతుంద‌ని, తొలి సినిమా అయినా ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా కొత్త‌ద‌నాన్ని ప్రేక్ష‌కుల‌కు పంచాడ‌ని అంటున్నారు. ఈ సినిమాతో హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు మరో మెగా హిట్ ద‌క్కింద‌ని ఫిల్మ్ న‌గ‌ర్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ప్రేమ‌క‌థ అంటే మూస పోసిన‌ట్లు తీసే ద‌ర్శ‌కుల‌కు ఇది ఓ పాఠం అని, తెలుగు సినిమా చ‌రిత్ర‌లో ఓ శివ సినిమాలా మార్పుకు నాంది అవుతుంద‌ని చెబుతున్నారు. హీరో

వీహెచ్ కు వ‌ర్మ స‌వాల్

‘వీహెచ్ సారూ… నేను రేపు పొద్దున 10.30 గంట‌ల‌కు ప్ర‌సాద్ ఐమ్యాక్స్ లో మార్నింగ్ షోకి వ‌స్తున్నా… అక్క‌డ చూసుకుందాం.. బ‌స్తీ మే స‌వాల్’ … న‌న్ను హైద‌రాబాద్ లో అడుగు పెట్ట‌కుండా చేయ‌డం కాదు .. ద‌మ్ముంటే ఆయ‌న మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల వ‌య‌సు ఉండే అబ్బాయిలు, అమ్మాయిల‌ను ‘అర్జున్ రెడ్డి’ సినిమా ఆడుతున్న థియేట‌ర్‌లోకి అడుగు పెట్ట‌కుండా చూసుకోండి అని ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ స‌వాల్ విసిరాడు. కాంగ్రెస్ నేత వి.హ‌నుమంత‌రావు అర్జున్ రెడ్డి సినిమాకు వ్య‌తిరేకంగా నాలుగు రోజులుగా విమ‌ర్శ‌లు చేస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌కు వ్య‌తిరేకంగా రాంగోపాల్ వ‌ర్మ సోష‌ల్ మీడియాలో ప‌లు పోస్ట్

అర్జున్ రెడ్డిపై మ‌హేష్ కు సిరాశ్రీ‌

రేపు విడుద‌ల కాబోతున్న అర్జున్ రెడ్డి సినిమా పోస్ట‌ర్లు, టైటిల్ పై టాలీవుడ్ లో, బ‌య‌ట అనేక చ‌ర్చ‌లు, విమ‌ర్శ‌లు న‌డుస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో సినీ ప‌రిశ్ర‌మ‌లో కూడా విభిన్న అభిప్రాయాలు వ‌స్తున్నాయి. ఈ సినిమా గురించి కాంగ్రెస్ నేత వీహెచ్ ఓ విమ‌ర్శ చేస్తె దానిని ద‌ర్శ‌కులు త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ‌, రాంగోపాల్ వ‌ర్మ‌లు వ్య‌తిరేకించారు. ఇక ద‌ర్శ‌కుడు మ‌హేష్ క‌త్తి ఈ సినిమా టైటిల్ ను వ్య‌తిరేకించ‌గా దానికి ర‌చ‌యిత సిరాశ్రీ సోష‌ల్ మీడియాలో ఓ మంచి స‌మాధానం ఇచ్చారు. దాని వివ‌రాలు మీ కోసం .. Mahesh Kathi పెట్టిన పోస్ట్- “అర్జున్ రెడ్డి. నరసింహ