arjun reddy

అర్జున్ రెడ్డి మేకింగ్ వీడియో

తెలుగు సినిమా ప‌రిశ్ర‌మ‌కు కొత్త దారులు చూపిన అర్జున్ రెడ్డి సినిమా విడుద‌లై మూడువారాలు దాటినా ప్రేక్ష‌కుల్లో ఎలాంటి క్రేజ్ త‌గ్గ‌లేదు. కేవ‌లం నాలుగు కోట్ల ఈ సినిమా న‌ల‌భై కోట్ల వసూళ్లు సాధించింది. హీరో మిన‌హా అంద‌రూ కొత్త వారే అయినా ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ల‌భించాయి. ఈ సినిమా మేకింగ్ వీడియోను తాజాగా విడుద‌ల చేశారు. మీరూ ఓ లుక్కేయండి.  

జేజ‌మ్మ మెచ్చిన అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా అదిరిపోయింది. సూప‌ర్ గా ఉంది. అంద‌రూ ఈ సినిమాను చూసి తీరాల్సిందే అంటుంది అరుంధ‌తి ఆలియాస్ జేజ‌మ్మ ఆలియాస్ అనుష్క‌. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు అందుకున్న‌ అర్జున్ రెడ్డి సినిమా సినీ ప్ర‌ముఖుల‌ను కూడా ఆక‌ర్షిస్తోంది. తాజాగా అనుష్క ఈ సినిమాపై ప్ర‌శంస‌లు కురిపిస్తూ త‌న ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. ఈ సినిమా బృందానికి అభినంద‌న‌లు తెలియ‌జేసింది.

షాలిని పిల్ల‌కి.. సినిమా క‌ష్టాలు!

ప్ర‌స్తుతం టాలీవుడ్ లో అంద‌రూ అర్జున్ రెడ్డి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. అర్జున్ రెడ్డి పాత్ర‌లో జీవించిన విజ‌య్ దేవ‌ర‌కొండ ను ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. ఆ సినిమా విజ‌యంలో కీ రోల్ ప్లే చేసిన విజ‌య్ తో పాటు  ప్రీతి పాత్ర‌లో న‌టించిన‌ హీరోయిన్ షాలినికి కూడా ప్ర‌శంస‌లు ద‌క్కాయి. అయితే, ఈ సినిమాలో చాన్స్ రాక ముందు షాలిని నిజంగా సినిమా క‌ష్టాల‌ను ఫేస్ చేసింద‌ట‌. సినిమాల మీద ఉన్న ఆస‌క్తితో నిజ‌జీవితంలో కూడా తాను ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయింద‌ట‌. తాను ఎదుర్కొన్న ఇబ్బందుల‌ను షాలిని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. ఇపుడు ఆ పోస్ట్

అమెరికాలో అర్జున్ రెడ్డి సునామీ

వివాదాల న‌డుమ సూప‌ర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా అమెరికాలో క‌లెక్ష‌న్ల సునామీ సృష్టిస్తోంది. 1. మిలియ‌న్ల రికార్డు మార్కును దాటి 2 మిలియ‌న్ డాల‌ర్ల రికార్డు క‌లెక్ష‌న్ల దిశ‌గా అర్జున్ రెడ్డి దూసుకెళ్తున్నాడు. ఉత్త‌ర అమెరికాలో ఇప్పుడు అత్య‌ధిక వ‌సూళ్లు సాధించిన తెలుగు చిత్రాల‌లో 15వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది విడుదలై అత్యధిక వసూళ్లను సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో 11వ స్థానాన్ని ఆక్రమించింది. త్వ‌ర‌లోనే మ‌రిన్ని రికార్డులు కూడా చెరిపేస్తుంద‌ని స‌మాచారం. పైసా వ‌సూల్ విడుద‌ల‌యినా దాని ప్ర‌భావం ఎక్క‌డా అర్జున్ రెడ్డి మీద ప‌డ‌లేదు.

అర్జున్ రెడ్డి పై బాలీవుడ్ క‌న్ను

ఒక‌ప్పుడు బాలీవుడ్ చిత్రాల మీద టాలీవుడ్ క‌న్ను ఉండేది. అక్క‌డ హిట్ట‌యిన చిత్రాల‌ను ఇక్క‌డ రీమేక్ చేసేది. అయితే కొన్నాళ్లుగా ప‌రిస్థితి మారింది. తెలుగు, త‌మిళ హిట్ సినిమాల మీద బాలీవుడ్ హీరోలు క‌న్నేశారు. ఇక్క‌డ హిట్ అయితే దానిని హిందీలో రీమేక్ చేయ‌డానికి త‌హ‌త‌హ‌లాడుతున్నారు. తెలుగులో తాజాగా అర్జున్ రెడ్డి సినిమా ఊహించ‌ని హిట్ సాధించ‌డంతో బాలీవుడ్ క‌న్నుప‌డింది. అర్జున్ రెడ్డి సినిమా టీజ‌ర్, ట్రైల‌ర్ చూసిన బాలీవుడ్ హీరో ర‌ణ‌వీర్ సింగ్ ఈ సినిమాను రీమేక్ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమా పై రణవీర్ ఆసక్తిని చూపుతుండటంతో, బాలీవుడ్ డిస్ట్రిబ్యూటర్ సునీల్ నారంగ్ స్పెషల్

అర్జున్ రెడ్డిని ఆకాశానికెత్తేశాడు

టాలీవుడ్ లేటెస్ట్ సెన్సేషన్ ‘అర్జున్ రెడ్డి’ అభిమానుల్లో మరో పెద్ద సెలబ్రెటీ చేరిపోయాడు. అతనే.. సూపర్ స్టార్ మహేష్ బాబు. ‘అర్జున్ రెడ్డి’ విడుదలైన వారానికి ఈ సినిమా చూసి తన అభిప్రాయాన్ని ట్విట్టర్లో చెప్పాడు మహేష్. ఈ సినిమాపై కొంచెం పెద్ద స్థాయిలోనే ప్రశంసలు కురిపించాడు మహేష్. బోల్డ్.. రా.. ఇంటెన్స్.. ఒరిజినల్.. బ్రిలియంట్.. అంటూ ‘అర్జున్ రెడ్డి’కి చాలా ఉపమానాలే వాడాడు మహేష్. ఇదొక పాత్ బ్రేకింగ్ సినిమా అని కూడా మహేష్ కితాబిచ్చాడు. హీరో విజయ్ దేవరకొండ లైఫ్ టైం పెర్ఫామెన్స్ ఇచ్చాడని.. అతడి పెర్ఫామెన్స్ టెర్రిఫిక్ అంటే కూడా అండర్ స్టేట్మెంట్ అవుతుందని

వీహెచ్ తాత‌కు విలువిచ్చాం

అర్జున్ రెడ్డి సినిమా పోస్టర్ల ప‌ట్ల వీహెచ్ తాత చెప్పిన అభ్యంత‌రాలకు విలువిచ్చాం. ముద్దు సీన్ లో ఉన్న ఎమోష‌న్ ను పోస్ట‌ర్ ద్వారా ప్ర‌మోట్ చేయ‌డ‌మే మా ఉద్దేశం. అంతే కానీ వేరే ఉద్దేశం లేదు. వీహెచ్ తాత‌య్య మా ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూసి అభ్యంతరకర సన్నివేశాలున్నాయంటే కనుక అలాంటి సీన్లన్నీ తొలగిస్తాం అని చిత్ర ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగా అన్నారు. ‘అర్జున్ రెడ్డి’ సినిమాకు సంబంధించి బస్సులపై అంటించిన పోస్టర్లు తాతయ్యకు నచ్చకపోవడంతో, వాటన్నింటిని తొలగించామని, థియేటర్లలో కూడా ఆ పోస్టర్లు లేకుండా చేశామని సందీప్ రెడ్డి తెలిపారు. ఆంధ్రా, తెలంగాణ‌ల‌లో ఇప్పుడు

అన‌సూయ‌కు 'అర్జున్..' ఫ్యాన్స్ షాక్‌!

టాలీవుడ్ లో ప్ర‌ముఖ ద‌ర్శ‌కులు, హీరోలు, హీరోయిన్లు అర్జున్ రెడ్డి సినిమాపై ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. అయితే, అందుకు భిన్నంగా జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్ అన‌సూయ మాత్రం ఆ సినిమాలో ఓ డైలాగ్ పై తీవ్ర అభ్యంత‌రం వ్య‌క్తం చేస్తూ ట్విట్ట‌ర్ లో ఓ భారీ మెసేజ్ పెట్టిన సంగ‌తి తెలిసిందే. అమ్మను తిడుతూ చేసిన బూతు ప‌ద ప్ర‌యోగానికి లక్షల మంది ఫాలోయింగ్ లభించడం ఎంతో అదృష్టం కదా అంటూ అన‌సూయ ఘాటుగా కామెంట్ చేసింది. నీ జీవితంలో ఉన్న మహిళల‌ గురించి మరొకరు ఇలాగే మాట్లాడితే అప్పుడేం చేస్తావ్ డూడ్.. వారి లేడీస్ ను

అర్జున్ రెడ్డిపై అన‌సూయ సెటైర్లు

అర్జున్ రెడ్డి సినిమా గురించి చిన్నా, పెద్దా అంతా ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సినీ విమ‌ర్శ‌కులు సైతం హీరో విజ‌య్, ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డిని ప్ర‌శంస‌ల‌తో ముంచెత్తుతున్నారు. విజ‌య్ న‌ట‌న‌కు ప్ర‌ముఖ న‌టులు, ద‌ర్శ‌కులు ఫిదా అయిపోయారు. తెలంగాణ సూప‌ర్ స్టార్ అంటూ ఆకాశానికి ఎత్తుతున్నారు. కానీ ప్ర‌ముఖ యాంక‌ర్ అన‌సూయ‌కు మాత్రం ఈ సినిమా న‌చ్చ‌లేద‌ట‌. ఈ సినిమాలో మాదిరిగానే యువ‌త బ‌య‌ట ఉండాల‌ని విజ‌య్ యువ‌త‌కు స‌ల‌హాలు ఇస్తున్నాడ‌ని .. ఇది ప‌ద్ద‌తి కాద‌ని అన‌సూయ ఆక్షేపించింది. ఇక మాద .. చోత్ అనేది యువ‌త వాడుక ప‌దంలా మారింద‌ని, అంద‌రూ దీనిని జోక్ లా మాట్లాడుతున్నార‌ని

తాత‌య్యా చిల్ అంటున్న అర్జున్ రెడ్డి

అర్జున్ రెడ్డి సినిమా పోస్ట‌ర్ల మీద విమ‌ర్శ‌లు గుప్పించి స్వ‌యంగా చించేసిన కాంగ్రెస్ రాజ్య‌స‌భ స‌భ్యుడు వి.హ‌నుమంత‌రావు ఇప్పుడు ఆ సినిమాను నిలిపేయాల‌ని అంటున్నారు. ఈ సినిమాలో అనేక అభ్యంత‌ర‌క‌ర స‌న్నివేశాలు ఉన్నాయ‌ని, అందుకే ఈ సినిమాను ఆపాల‌ని వీహెచ్ అంటున్నారు. ఈ నేప‌థ్యంలో మ‌రో సారి ‘తాతయ్యా చిల్’ అంటూ అర్జున్ రెడ్డి హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌న ఫేస్ బుక్ ఖాతాలో స్పందించాడు. ‘‘డియర్ తాతయ్యా ..అర్జున్ రెడ్డి సినిమా బాగుందని కేటీఆర్ అనడందుకే నాకు చుట్టం అయితే .. ఈ సినిమా చూసి న‌న్ను ప్ర‌శంసించిన‌ ఎస్ఎస్ రాజమౌళి నాకు నాన్న‌, రానా దగ్గుబాటి,