agriculture

రైతుబంధుతో కొన్ని పార్టీలు దివాళా

ఇది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నాం. రైతుబంధు ప‌థ‌కంతో కొన్ని రాజ‌కీయ పార్టీలు దివాళా తీశాయి. పేరుకే పెద్ద రైతు.. వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలి. రైతు క్షేమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర రైతాంగమంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. హెచ్‌ఐసీసీ

కేసీఆర్ కు కేంద్రం కితాబు

ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం రైతులకు మేలు చేసే ఎన్నో వ్యవసాయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా తెలంగాణ రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి . కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 లో తెలంగాణాలో 1400 మంది రైతు లు ఆత్మహత్య చేసుకుంటే 2016 లో ఆ సంఖ్య 645 కు పడిపోయింది . అంటే ఇది 53 .9 % తగ్గుదల . రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది . రైతుల ఆత్మహత్యలు భారీగా

న‌వ శ‌కానికి కేసీఆర్ నాంది

రైతే రాజు… జై జ‌వాన్ … జై కిసాన్ ఇవి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వింటున్న నినాదాలే. ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు ఇది చిన్న‌ప్ప‌టి పాఠ్య‌పుస్తకాల‌లో చ‌దువుకున్న పాఠ‌మే. కానీ ఈ దేశంలోని ఏ పాల‌కులు స‌మ‌కాలీన రాజ‌కీయాల‌లో రైతుకు పెద్ద‌పీట వేసి రైతే రాజు అయ్యేందుకు రూపొందించిన ప్ర‌ణాళిక‌లు లేవు. అమ‌లు ప‌రిచిన విధానాలు లేవు. అలాంటి ఒక క‌ల ఈ రోజు తెలంగాణ రైతుల‌కు నెర‌వేరింది. రాజ్యాంగానికి లోబ‌డి తెలంగాణ ఉద్య‌మాన్ని 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ‌ను సాధించ‌డం ఒక ఎత్త‌యితే .. ఆ త‌రువాత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేస్తున్న

రైతుల కోసం ఇంకో 50 కోట్లు ఎందుకంటే...

రైతు మ‌న‌సు ఎరిగి ఉండ‌టంతో పాటుగా…ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు స్వయంగా రైతుకావడం తెలంగాణ అన్న‌దాత‌ల‌కు వ‌రంగా మారింది. రైతును ఆర్థికంగా శ‌క్తివంతం చేయ‌డం కోసం ఇప్ప‌టికే రుణ‌మాఫీ, ఎరువులు, బ‌ర్రెలు, గొర్రెలు వంటివి ప్ర‌వేశ‌పెట్టిన గులాబీ ద‌ళ‌ప‌తి మ‌రో కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. పాలీహౌస్ విధానంలో పంటల ఉత్పత్తులకు ప్రోత్సాహించేందుకు రూ. 50 కోట్లు విడుద‌ల చేశారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టక పూర్వమే ఆధునిక విధానాల్లో సేద్యం చేస్తూ వస్తున్నారు. పాలీహౌస్‌ల ద్వారా ఎకరాకు కోటి రూపాయలు సంపాదించవచ్చని నిరూపించారు. వ్యవసాయ శాస్తవ్రేత్తలను, మీడియా ప్రతినిధులను తీసుకువెళ్లి తన వ్యవసాయ క్షేత్రాన్ని చూపించారు. విదేశాలకు ఎగుమతి చేసేందుకు

ప‌త్తి రైతుకు వెన్నుద‌న్ను

దేశంలోనే ప‌త్తి సాగు, దిగుబ‌డిలో మూడో స్థానంలో ఉన్న తెలంగాణ రైతాంగానికి వెన్నుద‌న్నుగా నిలిచేందుకు తెలంగాణ ప్ర‌భుత్వం న‌డుం బిగించింది. ఈ మేర‌కు ప‌త్తి పంట‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ఇచ్చేందుకు ప్ర‌ణాళిక సిద్దం చేసింది. దేశంలో పత్తిపంట విస్తీర్ణంలో మహారాష్ట్ర 42.03 లక్షల హెక్టార్లతో ప్ర‌థ‌మ‌, 26.33 లక్షల హెక్టార్లతో గుజరాత్ ద్వితీయ‌, 18.61 లక్షల హెక్టార్లతో తెలంగాణ తృతీయ స్థానంలో ఉన్నాయి. గ‌త ఏడాది ప‌త్తి క్వింటాలుకు రూ.4160 ఉండ‌గా, ఈ ఏడాది రూ.4320 గా కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. తెలంగాణ‌లోని ప‌త్తి రైతులు ఎలాంటి ఆందోళ‌న చెందాల్సిన అవ‌స‌రం లేద‌ని, ప‌త్తికి గిట్టుబాటు ధ‌ర ల‌భించేలా

ఎందుకో ఈ అస‌హ‌నం ?

‘తెలంగాణ రాష్ట్ర అవ‌త‌ర‌ణ‌తో జేఏసీ బాధ్య‌త తీరిపోలేదు. ఇక నుండి ప్ర‌జ‌ల ప‌క్షాన నిల‌బ‌డి ప్ర‌భుత్వంతో క‌లిసి ప‌నిచేస్తాం. తెలంగాణ ఏర్పాటుతోనే జేఏసీ ప‌ని పూర్తి కాలేదు. తెలంగాణ అభివృద్దిలోనూ జేఏసీ ఉంటుంది. వ‌చ్చిన తెలంగాణ ప్ర‌జ‌ల క‌ల‌లు నెర‌వేర్చే తెలంగాణ కావాలి’ తెలంగాణ ఆవిర్భావం, టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌చ్చిన తొలినాళ్ల‌లో తెలంగాణ జేఏసీ చైర్మ‌న్ కోదండ‌రాం ప‌లుకులు ఇవి. కొన్నాళ్లు భాగానే ఉన్నారు. ప్ర‌భుత్వ ప‌నితీరును మెచ్చుకున్నారు. అమెరికా వెళ్లి వ‌చ్చారో లేదో కోదండ‌రాం వైఖ‌రి పూర్తిగా మారిపోయింది. తెలంగాణ ప్ర‌భుత్వం ఏ కార్య‌క్ర‌మం చేప‌ట్టినా దాని మీద గుడ్డి ఆరోప‌ణ‌లు చేయ‌డం మొద‌లు పెట్టారు.

కాంగ్రెస్ కు దిమ్మ‌తిరిగే కౌంట‌ర్

ముఖ్యమంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలో తెలంగాణ రైతుల‌కు ప్ర‌భుత్వం ఏం చేసింది ? గ‌తంలో రైతుల ప‌రిస్థితి ఏంటి ? ఇప్పుడు రైతుల ప‌రిస్థితి ఏంటి ? అన్న‌ది రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు వివ‌రించారు. కాంగ్రెస్ నేత‌ల‌కు కండ్లుంటే చూడండి .. చెవులుంటే వినండి అని హ‌రీష్ రావు ఎద్దేవా చేశారు. పెట్టుబడి కోసం ఏటా ఎకరానికి రూ.ఎనిమిది వేల చొప్పున ప్రభు త్వం ఇవ్వనున్న పెట్టుబడి మొత్తాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని, అందుకే రైతు స‌మ‌న్వ‌య స‌మితుల‌ను వ్య‌తిరేకిస్తున్న‌ద‌ని, అధికారం కోల్పోయి తా ముంటే రైతులు సంతోషంగా ఉండటమేమిటన్నట్టు కాంగ్రెస్ నేత లు

తెలంగాణ ప్ర‌భుత్వ బంప‌ర్ అఫ‌ర్

గ్రీన్‌హౌస్‌, పాలీహౌస్‌ వ్యవసాయం చేసే రైతుల‌కు ఉచితంగా కరెంట్‌ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని లోటెన్షన్‌(ఎల్టీ)-3 శ్లాబు నుంచి ఇప్పుడు ఎల్టీ-5లోకి మార్చా రు. ఇక గ్రీన్‌హౌస్ ల‌లో పూల పెంపకానికి కూడా ఉచితంగా కరెంట్‌ ఇవ్వనుంది. ఈ మేరకు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీఎ్‌సఈఆర్సీ) టారిఫ్‌ ఉత్తర్వులను సవరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. గ్రీన్ హౌస్, పాలీ హౌస్ ల‌లో ఇప్పుడు పెద్ద ఎత్తున కూర‌గాయ‌లు కూడా పండిస్తున్నారు. వారికి మ‌రింత ప్రోత్సాహం ఇస్తే బాగుంటుంద‌న్న ఉద్దేశంతో ఈ ప‌థ‌కానికి శ్రీ‌కారం చుట్టారు. ఇక ఎయిర్‌ పోర్టులు, బస్‌స్టేషన్‌లలోని కార్యాలయాలు, ఆఫీసులకు కూడా ఎయిర్‌పోర్ట్‌/బ్‌సస్టేషన్‌కు వర్తించే చార్జీలే

వ్య‌వ‌సాయానికి మ‌రింత ఊతం

వ్య‌వ‌సాయ శాఖ‌ను బ‌లోపేతం చేయ‌డం అంటే తాత్కాలికంగా అందులో కొంద‌రు తాత్కాలిక ఉద్యోగుల‌ను నియ‌మించ‌డం రైతుల కోసం త‌మ ప్ర‌భుత్వం ఎంతో శ్ర‌మిస్తుంద‌ని చెప్పుకోవ‌డం ప‌రిపాటిగా మారింది. చంద్ర‌బాబు నాయుడు హ‌యాంలో ఎంపీహెచ్ఈఓల పేరుతో వ్య‌వ‌సాయ పాలిటెక్నిక్ చేసిన ఉద్యోగుల‌ను కాంట్రాక్టు ప‌ద్ద‌తిన తీసుకున్నారు. ఇక వైఎస్ హ‌యాంలో ఆద‌ర్శ రైతులు అంటూ కాంగ్రెస్ కార్య‌క‌ర్త‌ల‌ను నియ‌మించారు. వ్య‌వ‌సాయం అంటే తెలియ‌ని వారు ఇందులో ఎంపిక‌య్యారు. ఆ త‌రువాత ఆ వ్య‌వ‌స్థ పోయింది. ఇక ఇన్ ఫుట్ స‌బ్సిడీ ఇచ్చి అదే రైతుల‌ను ఆదుకోవ‌డం అన్న‌ట్లు ప్ర‌చారం చేసుకున్నారు. తెలంగాణ ప్ర‌భుత్వం వ్య‌వ‌సాయంలో రైతుల‌కు ఉన్న స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి

కేసీఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు ..

రైత‌న్న‌కు అండ‌గా నిలిచేందుకు తెలంగాన ప్ర‌భుత్వం శ్రీ‌కారం చుట్టింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఆలోచ‌న‌ల మేర‌కు రైతును ఒక శ‌క్తిగా మార్చేందుకు వారిని సంఘటితం చేసే ప్ర‌య‌త్నాలు మొద‌ల‌య్యాయి. ఈ మేర‌కు ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనికి అనుగుణంగా గ్రామ, మండ ల, జిల్లా, రాష్ట్రస్థాయి రైతు సమన్వయ సమితుల ఏర్పాటు, ఇందులో సభ్యుల సంఖ్య, ఎంపిక విధానం తదితర కీలక అంశాలను ఉత్త‌ర్వులలో పేర్కొంది. గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి రైతు సమన్వయ సమితి సభ్యులు, కో-ఆర్డినేటర్ సభ్యుడిని నామినేటెడ్ పద్ధతిలో ఖరారు చేసే బాధ్యతను ఆయా జిల్లాలవారీగా ఇంచార్జీ మంత్రులకు అప్పగించారు. ఇంచార్జీ మంత్రుల పేర్లను సైతం