కేటిఆర్

40 పల్లెటూర్లకు కేటిఆర్ శుభవార్త

  తెలంగాణలోని 40 గ్రామాలకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శుభవార్త చెప్పారు. ఆ గ్రామాలకు కొత్త శోభ అద్దనున్నట్లు ఆయన వివరించారు. ఇంతకూ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదుగదా? పురపాలక శాఖ మంత్రి కదా?  ఆయన శుభవార్త చెప్పుడేందని అనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి మరి. తెలంగాణలోని పురపాలక సంస్థల్లోని అభివృద్ధి కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా