top story

మెంట‌ల్ కృష్ణ ఆంధ్రుల‌ గుండెలు గెలికాడు

నాన్ రెసిడెంట్ ఆంధ్రాస్ అని మ‌మ్మ‌ల్ని తెలుగు రోహింగ్యాల‌ను చేస్తారా ? ఏపీలో ఆధార్, ఓటరు కార్డు లేనివాళ్లు ప్రభుత్వాన్ని విమర్శించకూడదా? లోకేశ్.. నువ్వు చదువుకున్నావా? బుద్ధి, జ్ఞానం, సంస్కారం ఉండే మాట్లాడుతున్నావా? తాగి మాట్లాడావా? నీ భార్యకు, అత్తకు, బంధువులకు హైదరాబాద్‌లో ఇండ్లు, ఆస్తులు లేవా? హైదరాబాద్‌లో మీరు పన్నులు కట్టడం లేదా? ఆంధ్రప్రదేశ్‌లో మీకు ఆధార్ కార్డులు ఉన్నాయా? అధికారంలోకి వచ్చిన తర్వాత ఆస్తులను కూడబెట్టుకున్నది ఎవరు? ఇక్కడ సొంత ఇండ్లు, షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టుకొని విజయవాడలో రాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం ? పోసాని కృష్ణ‌ముర‌ళి అంటే అంద‌రూ మెంట‌ల్ కృష్ణ అని అంటుంటారు.

ఎలా ఉండాలో కేసీఆర్ ను చూసి నేర్చుకోండి

నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా ? చ‌ంద్ర‌బాబు నాయుడు ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు విమ‌ర్శ‌లు చేయ‌లేదా ? ప‌్ర‌జ‌ల‌తో ఎలా ఉండాలో తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ను చూసి నేర్చుకోండి అని ప్ర‌ముఖ న‌టుడు పోసాని కృష్ణ‌ముర‌ళి అన్నారు. నాకు వ‌చ్చిన నంది అవార్డును తీసుకోన‌ని, వాటిని ర‌ద్దు చేసి మ‌ళ్లీ ప్ర‌క‌టించాల‌ని అన్నారు. ఒకే సామాజిక వ‌ర్గానికి అవార్డులు వ‌చ్చాయ‌ని విమ‌ర్శ‌లు వ‌చ్చాయ‌ని, నందుల‌తో ప్రాంతాల మ‌ధ్య విభేదాలు సృష్టిస్తారా ? అని పోసాని ప్ర‌శ్నించారు. కావాలంటే లోకేష్ పేరిట బంగారు నంది అవార్డులు ఇచ్చుకోండ‌ని అన్నారు. ఇలాంటి వివాదాలు వ‌స్తే తాను చ‌చ్చే వ‌ర‌కు నంది

పాల‌పిట్ట పార్క్ ప్రారంభ‌మ‌యింది

కొత్తగూడలోని కోట్ల విజయభాస్కరరెడ్డి బొటానికల్‌ గార్డెన్‌లో రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 30 ఎకరాల విస్తీర్ణంలో తీర్చిదిద్దిన పాలపిట్ట పార్క్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ పార్క్‌ వద్ద కాలుష్య వాతావరణం లేకుండా జాగ్రత్త వహించాలన్నారు. ఒక‌ప్పుడు పిచ్చిమొక్క‌ల‌తో ఉన్న ఈ ప్రాంతాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దారు. హరిత‌హారంలో భాగంగా ఏడు వేల మొక్క‌లు నాటారు. సైక్లింగ్‌ కోసం వచ్చే వారికి రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో 230 కొత్త సైకిళ్లు అందుబాటులో ఉంచారు. ఇందుకోసం విశాలమైన సైకిల్‌ స్టాండ్‌ నిర్మించారు. రోజూ ఉదయం 6-9 గంటల మధ్య, సాయంత్రం 4-6 గంటల

కేంద్ర ఉద్యోగాల్లో మ‌న‌మెక్క‌డ ?

మా నీళ్లు, మా భూములు, మా కొలువులు మాకేనని మర్లబడ్డ తెలంగాణ బిడ్డలకు.. పోరాటం వెన్నతో పెట్టిన విద్య! తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం సాధించడంలో విద్యార్థులదే కీలకభూమిక! ఉద్యమమైనా, ఉద్యోగమైనా సత్తా చాటడంలో తెలంగాణ యువత ఎవరికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా పోటీపడి ఐఐటీ సీట్లు, విదేశాల్లో ఐటీ కొలువులు సాధించడంలో గుత్తాధిపత్యం తెలుగోళ్లదే. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తడబడుతున్నారు. ఇక్కడి యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటే, ఉత్తరాది యువత కేంద్ర ఉద్యోగాలను తన్నుకుపోతున్నది. ఉదాహరణకు 2015-16 ఏడాదికి ఎస్సెస్సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) 24,604

కోమ‌టిరెడ్డి వెట‌కారానికి .. కేసీఆర్

బంగారు తెలంగాణ అంటే ఏంటి అంటూ వెట‌కారం చేస్తారా .. ఏండ్ల త‌ర‌బ‌డి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని అభివృద్ది ప‌థంలో ముందుకు తీసుకెళ్తున్నాం. కాంగ్రెస్ హ‌యాంలో తాము అభివృద్ది చేయ‌లేక‌పోయామ‌ని మీరే ఒప్పుకున్నారు. మీరు రాష్ట్రాన్ని చీక‌ట్లో పెడితే మేము వెలుగులు నింపుతూ ముందుకు వెళ్తున్నాం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ అంటే ఒక్క రోజులో నిర్మాణం కాదు. రాష్ట్ర భ‌విష్య‌త్ బాగుండేందుకు బాట‌లు వేస్తూ వెళ్తున్నాం అని కేసీఆర్ అన్నారు. బంగారు తెలంగాణ అంటూ టిఆర్‌ఎస్ ఎంఎల్‌ఎలు పదే పదే చెబుతున్నారని, అదేమిటో తనకు అర్ధం కావడం లేదని, హస్టల్ విద్యార్ధులకు సన్న బియ్యం

త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీ య మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు.

సరిగ్గా పన్నేండేళ్ల క్రితం..

బెంగుళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ నిజామాబాద్ యువకుడు దసరాకు హైదరాబాద్ వద్దామని బస్ స్టాండుకు వెళ్లాడు. ఎన్ని ట్రావెల్స్ ఆఫీసుల దగ్గర చూసినా ఒక్క బస్సులో కూడా సీట్లు లేవు. తిరిగి తిరిగి ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చేశాడు. ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింటులో కూర్చుని ఆ రాత్రి డిన్నర్ చేస్తుంటే మెరుపులా మెరిసింది ఆ యువకుడి బుర్రలో ఆలోచన. విమానం టికెట్లూ, రైలు టికెట్లూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయికదా మరి బస్సు టికెట్లు ఎందుకు దొరకవు అనే ప్రశ్న ఆ వెంటనే మనమే ఒక వెబ్ పోర్టల్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన. వెంటనే

బ‌త‌కాలంటే ఢిల్లీ వ‌ద‌లండి

ఢిల్లీలో వాయు కాలుష్యం ప్ర‌మాద‌క‌ర‌స్థాయికి చేరింది. కాలుష్యాన్ని కొలిచే చార్టులో సున్నా నుంచి 500 వరకూ రీడింగ్ ఉంటుంది. ఇందులో రీడింగ్ 100 దాటితే ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరినట్టు. 400 దాటితే ఊపిరితిత్తులకు ప్రమాదక‌రం. రెండు రోజుల క్రితం 471 ఉన్న‌ ఈ రీడింగ్ ఇప్పుడు మరింతగా పెరిగి 726 స్థాయికి చేరింది. ఊపిరితిత్తులను నాశనం చేసి, శ్వాస కోశ వ్యవస్థను దెబ్బతీసే పీఎం (పర్టికులేట్ మ్యాటర్) 2.5 ఢిల్లీ వాతావరణంలో ఉన్న గణాంకాలివి. యూఎస్ ఎంబసీలోని పొల్యూషన్ మానిటర్ ఈ గణాంకాలను వెల్లడించింది. ఈ న గాలిని పీల్చడం మానవాళికి అత్యంత ప్రమాదకరమని, తక్షణం ఢిల్లీని

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ క‌ల‌క‌లం

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే ప్ర‌తిప‌క్షాల గుండెల‌మీద బండ‌రాళ్లు విసిరాడు. రాజ‌కీయ పున‌రేకిర‌ణ అంటూ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల మీద నీళ్లు చ‌ల్లాడు. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌కు ఎవ‌రు ఏం చేశారు ? అందులో స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి ఎవ‌రు ఏం ఇచ్చారు ? అంద‌రినీ స‌మానంగా ఎవ‌రు చూశారు ? ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎవ‌రు పెద్ద పీట వేశారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్డ‌రుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా స‌మాధానం ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేసీఆర్ కు చాలా చిన్న‌దని చెప్పి ప్ర‌తిప‌క్ష పార్టీలకు ఆఖ‌రిపంచ్

మీ జాతాకాలు మా వ‌ద్ద ఉన్నాయి

అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అంద‌రి చ‌రిత్రా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. భూ రికార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం సాగేది అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంతూరులో ఆయన తండ్రి 15 ఏళ్ల క్రితం విక్రయించిన భూమి వివరాలే ఇప్పటి వరకు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించలేదని, ఇది నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ‘భూమి రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ’ అంశంపై జరిగిన లఘుచర్చలో ఆయ‌న మాట్లాడారు. భూ కబ్జాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు చెందిన పత్రాలు, అందరి చరిత్రలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అసైన్ట్