telangana

భార‌మైనా భ‌రిస్తాం

వ్య‌వ‌సాయానికి 24 గంట‌ల క‌రంటు అందించేందుకు ప్ర‌భుత్వం ఎంత‌టి భారాన్ని అయినా భ‌రిస్తుంది. వ్య‌వ‌సాయానికి విద్యుత్ స‌బ్సిడీలు ఇవ్వడాన్ని ఆర్థిక‌వేత్త‌లు వ్య‌తిరేకిస్తున్నారు. కానీ నాకు ఆ ఆలోచ‌న లేదు. వ్యవసాయానికి 24గంటల విద్యుత్ అందించడంకోసం ప్రభుత్వ సబ్సిడీని రూ.4777 కోట్ల నుంచి రూ.5400 కోట్లకు పెంచుతున్నాం. అవసరమైతే అదనంగా మరో రూ.500 కోట్లు ఇవ్వడానికీ సిద్ధం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ఎత్తిపోతల పథకాలకు అవసరమయ్యే దాదాపు రూ.10 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రైతులకు ప్రభుత్వం అందించే సబ్సిడీల వల్ల ఏటా రూ.లక్ష కోట్ల విలువైన వ్యవసాయోత్పత్తులు వస్తాయి. అప్పుడు

కేంద్ర ఉద్యోగాల్లో మ‌న‌మెక్క‌డ ?

మా నీళ్లు, మా భూములు, మా కొలువులు మాకేనని మర్లబడ్డ తెలంగాణ బిడ్డలకు.. పోరాటం వెన్నతో పెట్టిన విద్య! తొలిదశ తెలంగాణ పోరాటం నుంచి మలిదశ ఉద్యమంలో ప్రత్యేకరాష్ట్రం సాధించడంలో విద్యార్థులదే కీలకభూమిక! ఉద్యమమైనా, ఉద్యోగమైనా సత్తా చాటడంలో తెలంగాణ యువత ఎవరికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా పోటీపడి ఐఐటీ సీట్లు, విదేశాల్లో ఐటీ కొలువులు సాధించడంలో గుత్తాధిపత్యం తెలుగోళ్లదే. ఇంత ప్రతిభ ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడంలో తడబడుతున్నారు. ఇక్కడి యువత కేవలం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసమే ఎదురుచూస్తుంటే, ఉత్తరాది యువత కేంద్ర ఉద్యోగాలను తన్నుకుపోతున్నది. ఉదాహరణకు 2015-16 ఏడాదికి ఎస్సెస్సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) 24,604

శ‌బ్బాష్ .. హ‌రీష్ రావ్

ఈ నామ్ ద్వారా వ్య‌వ‌సాయ ఉత్ప‌త్తుల కొనుగోలులో తెలంగాణ అగ్ర‌స్థానంలో నిలిచింది. ఈ మేర‌కు వివ‌రాలు వెల్ల‌డించిన కేంద్ర వ్య‌వ‌సాయ శాఖ తెలంగాణ ప్ర‌భుత్వం ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతంగా అమ‌లు చేస్తుంద‌ని మంత్రి హ‌రీష్ రావును అభినందించింది. ఎలక్ట్రానిక్‌ జాతీయ వ్యవసాయ మార్కెట్‌ (ఈ–నామ్‌) ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటివరకు రూ.7,454 కోట్ల విలువైన వ్యవసాయ ఉత్పత్తుల విక్రయాలు జరిగాయి. 18.71 లక్షల మెట్రిక్‌ టన్నుల వ్యవసాయ ఉత్పత్తులను రైతులు ఆన్‌లైన్‌ ద్వారా వ్యాపారులకు అమ్ముకున్నారు. ఆన్‌లైన్‌ బిడ్డింగ్‌ ద్వారా జరిగిన ఈ ప్రక్రియ ద్వారా రైతులు తమ ఉత్పత్తులకు గరిష్ట ధర పొందగలిగారు. రాష్ట్రంలోని 44 మార్కెట్ల

త్రిలింగ, తెలింగ, తెలింగాణ, తెలుంగు, తెలుగు

తెలంగాణతో ఏ అనుబంధమూ లేకపోతే ఎవరూ తమను తైలంగులని, తిలింగులని చెప్పుకోరు. కాకతీయ పతనం అనంతరం మతం మార్చుకొని ఢిల్లీ దర్బారులో తుగ్లక్ వద్ద మంత్రిగా చేరిన కాకతీ య మంత్రి మాలిక్ మక్బూల్ తిలింగాణి అని పేరు పెట్టుకున్నాడు. ఢిల్లీలోని ఆయన సమాధిపై ఇప్పటికీ ఆయన పేరు అలాగే ఉంది. తెలంగాణ గడ్డపై నుంచి బర్మా, థాయిలాండు వెళ్లినవారు కొన్ని శతాబ్దాలపాటు తమను తాము తైలంగులుగానే పిలుచుకున్నారు. తమ రాజ్యం ఛిన్నాభిన్నమైతే గోదావరి నది ద్వారా సముద్రానికి చేరుకొని సముద్రం ద్వారా బర్మా, థాయిలాండులకు చేరుకున్నామని అక్కడి వారు చెప్పుకున్నట్టు ఇటీవల ఒక జర్నలిస్టు పరిశోధించి రాశారు.

కొత్త డీజీపి మ‌హేంద‌ర్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ఇన్ చార్జి డీజీపీగా హైద‌రాబాద్ పోలీస్ క‌మీష‌న‌ర్ మహేందర్ రెడ్డి నియామకం ఖరారైంది. ఎంతో మంది పేర్లు వినిపించినా హైదరాబాద్ సీపీగా ఉన్న మహేందర్ రెడ్డి వైపే ప్రభుత్వం మొగ్గు చూపించింది. మ‌రో ఐదు సంవ‌త్స‌రాలు స‌ర్వీస్ ఉన్న మ‌హేంద‌ర్ రెడ్డి నియామ‌కం దాదాపు ఖ‌రార‌యిన‌ట్లే. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్.. స్వయంగా ఆయన్నే పిలిచి చెప్పారు. నవంబర్ 12వ తేదీ మధ్యాహ్నం ఇన్ చార్జి డీజీపీగా బాధ్యతలు స్వీకరించనున్నారు మహేందర్ రెడ్డి. ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కిష్టాపూర్ గ్రామం మహేందర్ రెడ్డిది. రైతు కుటుంబం నుంచి వచ్చారు. ఆరుగురు సంతానంతో ఆయన అందరి

సరిగ్గా పన్నేండేళ్ల క్రితం..

బెంగుళూరులోని ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న ఆ నిజామాబాద్ యువకుడు దసరాకు హైదరాబాద్ వద్దామని బస్ స్టాండుకు వెళ్లాడు. ఎన్ని ట్రావెల్స్ ఆఫీసుల దగ్గర చూసినా ఒక్క బస్సులో కూడా సీట్లు లేవు. తిరిగి తిరిగి ఉస్సూరుమంటూ వెనక్కి వచ్చేశాడు. ఒక ఫాస్ట్ ఫుడ్ జాయింటులో కూర్చుని ఆ రాత్రి డిన్నర్ చేస్తుంటే మెరుపులా మెరిసింది ఆ యువకుడి బుర్రలో ఆలోచన. విమానం టికెట్లూ, రైలు టికెట్లూ ఆన్‌లైన్‌లో దొరుకుతున్నాయికదా మరి బస్సు టికెట్లు ఎందుకు దొరకవు అనే ప్రశ్న ఆ వెంటనే మనమే ఒక వెబ్ పోర్టల్ చేస్తే ఎట్లా ఉంటుంది అన్న ఆలోచన. వెంటనే

ఒరిగిపోయిన 'ఒగ్గుచుక్క'

తెలంగాణ ప్రఖ్యాత ఒగ్గు కళాకారుడు చుక్క సత్తయ్య ఈ రోజు కన్నుమూశారు. 14 ఏండ్ల నుండే ఈ క‌ళ‌లో రాణిస్తున్న స‌త్త‌య్య దేశ‌వ్యాప్తంగా, ప్ర‌పంచ‌వ్యాప్తంగా 12 వేల‌కు పైగా ప్ర‌ద‌ర్శ‌న‌లు ఇచ్చారు. వీర‌భ‌ద్రుడి క‌థ, ప‌ర‌మ‌శివుని గొప్ప‌త‌నం గురించి చెప్పే ఆయ‌న సామాజిక అస‌మాన‌త‌ల మీద‌, విద్య‌, కుటుంబ నియంత్ర‌ణ‌, మూడ న‌మ్మ‌కాల మీద కూడా ప్ర‌ద‌ర్శ‌న‌లు చేశారు. మాజీ ప్ర‌ధాని ఇందిరాగాంధీ చేతుల మీదుగా ఆయ‌న స‌న్మానం అందుకున్నారు. ఒగ్గు అంటే శివుని చేతిలోని ఢమరుకం అని అర్ధం. ఈ పదం కేవలం తెలంగాణ ప్రాంతంలోనే వినిపిస్తుంది. శివుని చేతిలోని ప్రత్యేక వాయిద్యం ఢమరుకం. సత్తయ్య 1935,

అసెంబ్లీలో అక్బ‌రుద్దీన్ క‌ల‌క‌లం

ఎన్నిక‌ల‌కు ఏడాదిన్న‌ర ముందే ప్ర‌తిప‌క్షాల గుండెల‌మీద బండ‌రాళ్లు విసిరాడు. రాజ‌కీయ పున‌రేకిర‌ణ అంటూ కేసీఆర్ కు వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్షాలు చేస్తున్న ప్ర‌య‌త్నాల మీద నీళ్లు చ‌ల్లాడు. 60 ఏండ్ల పాల‌న‌లో తెలంగాణ‌కు ఎవ‌రు ఏం చేశారు ? అందులో స‌బ్బండ వ‌ర్గాల సంక్షేమానికి ఎవ‌రు ఏం ఇచ్చారు ? అంద‌రినీ స‌మానంగా ఎవ‌రు చూశారు ? ముస్లిం మైనార్టీల సంక్షేమానికి ఎవ‌రు పెద్ద పీట వేశారు ? అన్న ప్ర‌శ్న‌ల‌కు ఎంఐఎం ఎమ్మెల్యే అక్డ‌రుద్దీన్ ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా స‌మాధానం ఇచ్చారు. ప‌నిలో ప‌నిగా ముఖ్య‌మంత్రి ప‌ద‌వి కేసీఆర్ కు చాలా చిన్న‌దని చెప్పి ప్ర‌తిప‌క్ష పార్టీలకు ఆఖ‌రిపంచ్

న‌వ శ‌కానికి కేసీఆర్ నాంది

రైతే రాజు… జై జ‌వాన్ … జై కిసాన్ ఇవి స్వాతంత్య్రం వ‌చ్చిన‌ప్ప‌టి నుండి వింటున్న నినాదాలే. ప‌ట్టుద‌ల ఉంటే కానిది లేదు ఇది చిన్న‌ప్ప‌టి పాఠ్య‌పుస్తకాల‌లో చ‌దువుకున్న పాఠ‌మే. కానీ ఈ దేశంలోని ఏ పాల‌కులు స‌మ‌కాలీన రాజ‌కీయాల‌లో రైతుకు పెద్ద‌పీట వేసి రైతే రాజు అయ్యేందుకు రూపొందించిన ప్ర‌ణాళిక‌లు లేవు. అమ‌లు ప‌రిచిన విధానాలు లేవు. అలాంటి ఒక క‌ల ఈ రోజు తెలంగాణ రైతుల‌కు నెర‌వేరింది. రాజ్యాంగానికి లోబ‌డి తెలంగాణ ఉద్య‌మాన్ని 14 ఏండ్లు అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ‌ను సాధించ‌డం ఒక ఎత్త‌యితే .. ఆ త‌రువాత కేసీఆర్ తీసుకున్న నిర్ణ‌యాలు.. అమ‌లు చేస్తున్న

ప్ర‌త్యేక ప్ర‌తిప‌క్షం

ప్రాజెక్టులంటే కాంగ్రెస్ నాయకత్వానికి ఎంతసేపూ గుర్తొచ్చేది కాంట్రాక్టులు, కమీషన్లు. కానీ ప్రాజెక్టులంటే నీళ్లొస్తాయని, రైతుల పొలాలు పారుతాయని, కోట్లాదిమంది ప్రజల జీవితాల్లో మార్పువస్తుందని ఎన్నడూ ఆలోచించలేదు. ప్రాజె క్టు మొదలుపెడితే అది పూర్తిచేయాలని, పెట్టిన పెట్టుబడి రావాలంటే వీలైనంత త్వరగా పొలాలకు నీరివ్వాలని ఏనాడూ తాపత్రయ పడలేదు. ఇప్పటికీ అదే మైండ్‌సెట్‌తో మాట్లాడుతున్నారు. అడుగడుగునా ప్రాజెక్టులకు అడ్డంపడాలని చూస్తున్నారు. కేసులు వేస్తున్నారు. సాగునీరు, తాగునీటి కోసం వేయికళ్లతో ఎదురుచూస్తున్నవారు కాంగ్రెస్ నాయకత్వాన్ని ఏమని అర్థం చేసుకుంటారు? పట్టిసీమపై అంతగా గోలచేసిన ఆంధ్ర ప్రతిపక్షాలు ఒక్కకేసయినా వేశాయా? కర్ణాటక, మహారాష్ట్రల్లో కృష్ణా, గోదావరి నదులు, ఉపనదులపై వందలాది బ్రిడ్జి కమ్