hottopics

కానిస్టేబుల్, గురుకుల పోస్ట్ లు

485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి, బీసీ గురుకులాల్లో 628 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకులాల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. గురుకులాల ఖాళీల్లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.

కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించింది. కాగ్ అనేది దేశవ్యాప్త సంస్థ. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని కాగ్ ప్రశంసించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా, భగవద్గీతనా లేక ఖురానా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు అని మంత్రి హరీశ్ రావు ప్ర‌శ్నించారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌కే నష్టం అని హెచ్చ‌రించారు. కాంగ్రెస్

కేసీఆర్ కు కేంద్రం కితాబు

ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం రైతులకు మేలు చేసే ఎన్నో వ్యవసాయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా తెలంగాణ రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి . కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 లో తెలంగాణాలో 1400 మంది రైతు లు ఆత్మహత్య చేసుకుంటే 2016 లో ఆ సంఖ్య 645 కు పడిపోయింది . అంటే ఇది 53 .9 % తగ్గుదల . రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది . రైతుల ఆత్మహత్యలు భారీగా

పున‌ర్నిర్మాణానికి మీ అండ కావాలి

14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల కనుల పంట ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త నాలుగేండ్లుగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు, అమ‌రులు క‌ల‌గ‌న్న తెలంగాణ పున‌ర్నిర్మాణం కోసం చిత్త‌శుద్దిగా ప‌నిచేస్తున్నార‌ని, వివిధ దేశాల‌లో స్థిర‌ప‌డిన తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్, రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న‌తో ఎన్నారైలు టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో మీట్ & గ్రీట్ స‌మావేశం నిర్వ‌హించారు. సున్నీవేల్, కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పూర్ణ‌చంద‌ర్ బైరి, అభిలాష్ రంగినేనిలు స‌భాధ్య‌క్షత వ‌హించారు.

ఆస్ట్రేలియాలో కవిత జన్మదిన వేడుక‌లు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడ్నీలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ రాపోలు మాట్లాడుతూ కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ

బే ఏరియా గులాబీ మయం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్తలు, నేత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని స‌న్నివేల్ లో జ‌న్మ‌దిన వేడుక‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. పూర్ణ బైరి, అనిల్ ఎర్ర‌బెల్లి ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వేడుక‌ల‌లో టీఆర్ఎస్ యూఎస్ఎ టీం ఎన్ఆర్ఐలు న‌వీన్, భాస్క‌ర్, అభిలాష్ రంగినేని, ర‌జ‌నీకాంత్, శ్రీ‌నివాస్, హృషికేష్, శివ‌, ఉద‌య్, హ‌రి, రామ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అర‌వైఏండ్ల తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను 14 ఏండ్ల అవిశ్రాంత ఉద్య‌మంతో సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడున్న‌రేండ్ల పాల‌న‌తో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని కొనియాడారు.

తైక్వాండోలో హైద‌రాబాదీల ప్ర‌తిభ‌

అంత‌ర్జాతీయ తైక్వాండో పోటీల‌లో తెలంగాణ క్రీడాకారులు స‌త్తా చాటారు. బంగారు ప‌త‌కాలు సాధించి తెలంగాణ ఘ‌న‌త‌ను చాటారు. ఈ క్రీడాకారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చేయూత అందించింది. మంత్రి కేటీఆర్ స్వ‌యంగా క్రీడాకారుల‌కు సాయం అంద‌జేశారు. అమెరికాలో జ‌రిగిన అంత‌ర్జాతీయ పోటీల‌లో కోచ్ జ‌యంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో సింధు త‌పస్విని, కొండా స‌హ‌దేవ్, అబ్దుల్ ఖ‌లీల్ లు పోటీల‌కు హాజ‌ర‌య్యారు. పోటీల‌లో సింధు త‌ప‌స్విని బంగారు, సిల్వ‌ర్, కాంస్య ప‌త‌కాలు సాధించ‌గా, కొండా స‌హ‌దేవ్ ఒక‌ బంగారు, రొండు వెండి ప‌త‌కాలు, ఖ‌లీల్ రెండు బంగారు, ఒక కాంస్య ప‌త‌కం సాధించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ త‌రపున డాక్ట‌ర్

ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు జరిపించారు, సాయంత్రం బ్రేబ్రూక్ లో జన్మ దిన వేడుకలు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, కె

సామాజిక రుగ్మ‌త‌ల‌పై అఖిలేష్ అస్త్రం

దేశంలో నెల‌కొన్న పేద‌రికం, మ‌హిళ‌ల మీద హింస‌, నాణ్య‌మైన‌ విద్య‌, వైద్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, సుర‌క్షిత నీరు వంటి 17 సామాజిక రుగ్మ‌త‌లు, అవ‌స‌రాల మీద భావి పౌరుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ యువ‌కుడు న‌డుంక‌ట్టాడు. దేశం త‌ర‌పున ఇప్ప‌టికే రెండు సార్లు ఐక్య‌రాజ్య‌స‌మితిలో నాయ‌క‌త్వం వ‌హించిన సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి అదే స్పూర్థితో గోల్స్ ఆన్ వీల్సీ నినాదంతో 100 రోజుల్లో ల‌క్ష మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను క‌లుసుకుని అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సిద్ద‌మయ్యాడు. ఇప్ప‌టికే యాబై వేల మందికి పైగా విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ప్ర‌తిజ్క్ష చేయించాడు. దేశం ముందున్న స‌వాళ్ల‌ను, సామాజిక రుగ్మ‌త‌ల‌ను

గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ లైంగిక వేధింపులు

గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్ ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ఓ యువతి రేడియో జాకీగా పని చేస్తున్నారు. ఈ వెబ్ రేడియోకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ క్రమంలో తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆమె డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం కేసు పెట్టారు. తనను బెదిరిస్తూ పెట్టిన మెసేజ్ లను పోలీసులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసిన