NRI

జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

సామజిక సేవ దృక్పధం తో దూసుకువెళ్తున్న తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రముఖ ఇషా ఫౌండేషన్ సద్గురు పిలుపు మేరకు తెలంగాణ లో యోగ కార్యక్రమన్ని ప్రతి మారు మూలకు తీసుకువెళ్లి యోగ ప్రాముఖ్యత పాటు మనిషి జీవితం లో యోగ సాధన ద్వారా కలిగే మార్పుల గురించి అవగాహనా కల్పించడమే ద్యేయంగా ప్రత్యక్షంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ జాగృతి దానిని అంది పుచ్చుకొని యూకే లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కాకుండా ఇక్కడ ప్రజానీకానికి యోగ స్ఫూర్తి కలిగించే విదంగా వెస్ట్

కెసిఆర్ పాల‌న‌లోనే మైనారిటీల సంక్షేమం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్ద‌పీట వేయ‌డం జ‌రుగుతుంద‌ని, గంగాజ‌మునత‌హ‌జీబ్ లాంటి తెలంగాణ సంస్కృతిని కాపాడ‌డంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందున్నార‌ని యూకే ఎన్నారైలు అభిప్రాయ‌ప‌డ్డారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టి .ఆర్ .యస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు . రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను మరియు భవిష్యత్ ప్రణాళికల పట్ల పభుత్వానికున్న స్పష్టతను విపులంగా వివరించారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ ఆర్ ఐ ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మెల్బోర్న్ లో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి

పున‌ర్నిర్మాణానికి మీ అండ కావాలి

14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల కనుల పంట ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త నాలుగేండ్లుగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు, అమ‌రులు క‌ల‌గ‌న్న తెలంగాణ పున‌ర్నిర్మాణం కోసం చిత్త‌శుద్దిగా ప‌నిచేస్తున్నార‌ని, వివిధ దేశాల‌లో స్థిర‌ప‌డిన తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్, రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న‌తో ఎన్నారైలు టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో మీట్ & గ్రీట్ స‌మావేశం నిర్వ‌హించారు. సున్నీవేల్, కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పూర్ణ‌చంద‌ర్ బైరి, అభిలాష్ రంగినేనిలు స‌భాధ్య‌క్షత వ‌హించారు.

ఆస్ట్రేలియాలో కవిత జన్మదిన వేడుక‌లు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడ్నీలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ రాపోలు మాట్లాడుతూ కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ

బే ఏరియా గులాబీ మయం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్తలు, నేత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని స‌న్నివేల్ లో జ‌న్మ‌దిన వేడుక‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. పూర్ణ బైరి, అనిల్ ఎర్ర‌బెల్లి ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వేడుక‌ల‌లో టీఆర్ఎస్ యూఎస్ఎ టీం ఎన్ఆర్ఐలు న‌వీన్, భాస్క‌ర్, అభిలాష్ రంగినేని, ర‌జ‌నీకాంత్, శ్రీ‌నివాస్, హృషికేష్, శివ‌, ఉద‌య్, హ‌రి, రామ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అర‌వైఏండ్ల తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను 14 ఏండ్ల అవిశ్రాంత ఉద్య‌మంతో సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడున్న‌రేండ్ల పాల‌న‌తో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని కొనియాడారు.

తైక్వాండోలో హైద‌రాబాదీల ప్ర‌తిభ‌

అంత‌ర్జాతీయ తైక్వాండో పోటీల‌లో తెలంగాణ క్రీడాకారులు స‌త్తా చాటారు. బంగారు ప‌త‌కాలు సాధించి తెలంగాణ ఘ‌న‌త‌ను చాటారు. ఈ క్రీడాకారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చేయూత అందించింది. మంత్రి కేటీఆర్ స్వ‌యంగా క్రీడాకారుల‌కు సాయం అంద‌జేశారు. అమెరికాలో జ‌రిగిన అంత‌ర్జాతీయ పోటీల‌లో కోచ్ జ‌యంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో సింధు త‌పస్విని, కొండా స‌హ‌దేవ్, అబ్దుల్ ఖ‌లీల్ లు పోటీల‌కు హాజ‌ర‌య్యారు. పోటీల‌లో సింధు త‌ప‌స్విని బంగారు, సిల్వ‌ర్, కాంస్య ప‌త‌కాలు సాధించ‌గా, కొండా స‌హ‌దేవ్ ఒక‌ బంగారు, రొండు వెండి ప‌త‌కాలు, ఖ‌లీల్ రెండు బంగారు, ఒక కాంస్య ప‌త‌కం సాధించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ త‌రపున డాక్ట‌ర్

ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు జరిపించారు, సాయంత్రం బ్రేబ్రూక్ లో జన్మ దిన వేడుకలు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, కె

తెలుగు మ‌హాస‌భ‌ల షెడ్యూల్

శుక్రవారం నుంచి ప్రారంభమయ్యే ప్రపంచ తెలుగు మహాసభల కరదీపికను రాష్ట్ర ప్రభుత్వం విడుదలచేసింది. ఏయే తేదీలలో ఏయే వేదికల మీద ఏయే కార్యక్రమాలు నిర్వహిస్తారో ఇందులో పేర్కొన్నారు. ఆ వివరాలివే. పాల్కురికి సోమనాథ ప్రాంగణం (ఎల్బీ స్టేడియం) బమ్మెర పోతన వేదిక డిసెంబర్ 15: ప్రారంభ వేడుక సమయం: సాయంత్రం 5:00 గం. సభాధ్యక్షత: ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యఅతిథి: ఉప రాష్ట్రపతి డాక్టర్ వెంకయ్యనాయుడు, గవర్నర్ నరసింహన్, మహారాష్ట్ర గవర్నర్ విద్యాసాగర్‌రావు సాయంత్రం 6 గంటలకు సాంస్కృతిక సమావేశం: సీతాకాంత్ మహాపాత్ర, ప్రతిభారాయ్‌కు సత్కారం సా. 6:30: డాక్టర్ రాజారెడ్డి, రాధారెడ్డి కూచిపూడి కళాకారుల మన తెలంగాణ

ఇది నాకు గ‌ర్వ‌కార‌ణం : ఇవాంకా

హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన అంతర్జాతీయ వ్యాపారవేత్తల సదస్సుపై అమెరికా అధ్యక్షుడు సలహాదారు ఇవాంకా ట్రంప్ తాజాగా ఓ ట్వీట్ చేశారు. జీఈఎస్ సదస్సులో పాల్గొనడం గర్వకారణంగా భావిస్తున్నట్లు ఇవాంకా తెలిపారు. హైదరాబాద్‌లో రెండు వారాల క్రితం జరిగిన ఈవెంట్‌పై మంగళవారం ఇవాంకా ట్వీట్ చేశారు. అమెరికాకు చెందిన బృందం ఇవాంకా నేతృత్వంలో సదస్సుకు హాజరైంది. ఆ ట్వీట్‌ను సుమారు 1500 మంది భారతీయులు, ఆరువేల మంది విదేశీయులు షేర్ చేశారు. మరో 900 మంది ఆ ట్వీట్‌ను రీట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్‌లో ఇవాంకా సదస్సు నిర్వహించిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ హిందీ పదం ధన్యవాద్ అని