news and updates

కానిస్టేబుల్, గురుకుల పోస్ట్ లు

485 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి, బీసీ గురుకులాల్లో 628 ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్‌లో కానిస్టేబుల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను రాష్ట్రస్థాయి పోలీసు నియామక బోర్డు ద్వారా భర్తీ చేస్తారు. బీసీ గురుకులాల పోస్టులను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనుంది. గురుకులాల ఖాళీల్లో 543 పోస్ట్ గ్రాడుయేట్ టీచర్స్, 60 ఫిజికల్ డైరెక్టర్ పోస్టులు ఉన్నాయి.

కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించింది. కాగ్ అనేది దేశవ్యాప్త సంస్థ. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని కాగ్ ప్రశంసించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా, భగవద్గీతనా లేక ఖురానా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు అని మంత్రి హరీశ్ రావు ప్ర‌శ్నించారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌కే నష్టం అని హెచ్చ‌రించారు. కాంగ్రెస్

న‌ష్ట‌పోయిన రైతుల‌కు సాయం

రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్రంలో అకాల వర్షాలు, వడగండ్ల వానలు, వాటి ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో మాట్లాడారు. గత 15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని, రాబోయే రోజుల్లో పడే వర్షాల వల్ల కలిగే నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్‌ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి,

ఈనాడులో గ‌బ్బిలాల కంపు

ఇంటి పేరు కస్తూరివారు ఇళ్లంతా గబ్బిలాల కంపు అని సామెత‌. మీడియా మొఘ‌ల్ అని త‌న‌కు తాను జ‌బ్బ‌లు చ‌రుచుకునే ఈనాడు అధినేత రామోజీరావు ప‌త్రిక అద్యంతం తెలంగాణ మీద వ్య‌తిరేక‌త‌, తెలంగాణ మీద ద్వేశం, తెలంగాణ అంటే అసూయ నింపుకుని విష‌పు రాత‌లు రాస్తూ సామెత మాదిరిగానే గ‌బ్బిలాల కంపు కొడుతోంది. తెలంగాణ – ఆంధ్రా విడిపోయిన త‌రువాత పాల‌న విష‌యంలో ఆంధ్రాలో చంద్ర‌బాబు నాయుడు అన్నింటా విఫ‌ల‌మ‌య్యాడు. తెలంగాణ‌లో కేసీఆర్ స‌మ‌ర్ధ నాయ‌క‌త్వంలో తెలంగాణ అన్ని రంగాల‌లో ముందుకువెళ్తుంది. ఆంద్రాలో చంద్ర‌బాబు నాయుడు వైఫ‌ల్యాల‌ను క‌ప్పిపుచ్చే ఈనాడు రామోజీరావు తెలంగాణ‌లో మాత్రం ప్ర‌భుత్వ విజ‌యాల‌ను ప‌క్క‌న‌పెట్టి

క‌న‌క‌పు సింహాస‌న‌మున ..

కనకపు సింహాసనమున శునకము గూర్చుండబెట్టి శుభ లగ్నమునం దొనరగ బట్టము గట్టిన వెనుకటి గుణమేల మాను వినరా సుమతీ ఆంధ్రా మీడియాకు ఈ ప‌ద్యం అతికిన‌ట్లు స‌రిపోతుంది. 14 ఏండ్లు తెలంగాణ ఉద్య‌మం సాగితే ఉద్య‌మం బ‌ల‌ప‌డిన‌న్ని రోజులు కేసీఆర్ నాయ‌క‌త్వం మీద‌, వ్య‌క్తిగ‌త విష‌యాల మీద ప్ర‌జ‌ల‌కు అనుమానాలు రేకెత్తించే అంశాలు, కేసీఆర్ స్థ‌యిర్యాన్ని దెబ్బ‌తీసి త‌ద్వారా ఉద్య‌మం నీరుగారేలా విష‌పూరిత రాత‌లు .. అంతులేని కుట్ర‌లు. ఉద్య‌మం బ‌ల‌ప‌డిన త‌ర్వాత తెలంగాణ రాద‌ని ప్ర‌చారం చేస్తూ ఆంధ్రా పార్టీల‌ను ఉసిగొల్పి త‌ల‌తిక్క వాద‌న‌తో మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టి ప్ర‌జ‌లు ఉద్య‌మ‌కారుల స్థ‌యిర్యం దెబ్బ‌తీసి యువ‌త ఆత్మ‌హత్య‌లు

కేసీఆర్ కు కేంద్రం కితాబు

ముఖ్యమంత్రి కెసిఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రభు త్వం రైతులకు మేలు చేసే ఎన్నో వ్యవసాయానుకూల నిర్ణయాలు తీసుకుంటున్న కారణంగా తెలంగాణ రాష్ర్టంలో రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గుముఖం పడుతున్నాయి . కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి రాధామోహన్ సింగ్ పార్లమెంట్ లో వెల్లడించిన వివరాల ప్రకారం 2015 లో తెలంగాణాలో 1400 మంది రైతు లు ఆత్మహత్య చేసుకుంటే 2016 లో ఆ సంఖ్య 645 కు పడిపోయింది . అంటే ఇది 53 .9 % తగ్గుదల . రైతుల ఆత్మహత్యలు భారీగా తగ్గిన రాష్ట్రాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో ఉంది . రైతుల ఆత్మహత్యలు భారీగా

ఉద్య‌మానికి .. ఉన్మాదానికి తేడా లేదా ?

ఒక వైపు ఏండ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న ఉద్య‌మం .. మ‌రో వైపు అడుగ‌డుగునా ప్ర‌భుత్వ నిర్భంధం .. ఇంకో వైపు స‌మైక్య శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌కు అవ‌మానాలు .. ఒక్క రూపాయి ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సాక్షాత్తూ స‌భా నాయ‌కుడి వెక్కిరింపులు .. బ‌య‌ట ప్ర‌జాక్షేత్రంలో స్వ‌రాష్ట్రం కోసం యువ‌త బ‌లిదానాలు .. ఉద్య‌మ‌కారుల అరెస్టులు .. లాఠీచార్జీలు .. తెలంగాణ ఊసేలేద‌ని శాస‌న‌స‌భ సాక్షిగా బ‌య‌ట ప్రపంచానికి చాటాల‌న్న స‌మైక్య పాల‌కుల ఎత్తుగ‌డ‌లు స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల‌లో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో అప్ప‌టి ఎమ్మెల్యే, ప్ర‌స్తుత రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు

పున‌ర్నిర్మాణానికి మీ అండ కావాలి

14 ఏండ్ల సుధీర్ఘ పోరాటంతో నాలుగు కోట్ల తెలంగాణ ప్ర‌జ‌ల కనుల పంట ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌త నాలుగేండ్లుగా ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల మేర‌కు, అమ‌రులు క‌ల‌గ‌న్న తెలంగాణ పున‌ర్నిర్మాణం కోసం చిత్త‌శుద్దిగా ప‌నిచేస్తున్నార‌ని, వివిధ దేశాల‌లో స్థిర‌ప‌డిన తెలంగాణ ఎన్నారైలు తెలంగాణ‌లో కేసీఆర్ ప్ర‌భుత్వానికి అండ‌గా నిల‌వాల‌ని తెలంగాణ ఆర్టీసీ చైర్మ‌న్, రామ‌గుండం ఎమ్మెల్యే సోమార‌పు స‌త్య‌నారాయ‌ణ పిలుపునిచ్చారు. అమెరికా ప‌ర్య‌ట‌న‌కు విచ్చేసిన ఆయ‌న‌తో ఎన్నారైలు టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో మీట్ & గ్రీట్ స‌మావేశం నిర్వ‌హించారు. సున్నీవేల్, కాలిఫోర్నియాలో జ‌రిగిన ఈ స‌మావేశానికి పూర్ణ‌చంద‌ర్ బైరి, అభిలాష్ రంగినేనిలు స‌భాధ్య‌క్షత వ‌హించారు.

గురి త‌ప్ప‌ని విలుకాడు

మనం ఎక్కడినుంచి వచ్చాం? ఎక్కడికి వెళ్తున్నాం? ఏం చేస్తు న్నాం? ఏం ప్రతిఫలం అందుకుంటున్నాం? అందుకు ప్రతిగా ఏంచేయాలి? సరిగ్గా గమనిస్తే పవిత్ర గ్రంథం భగవద్గీత సారాంశం ఇదే. ప్రజల నుంచి ఎన్నికైన ఏ నాయకుడైనా, ప్రజల కోసం పనిచేస్తున్నాననుకునే ఏ నేత అయినా ఈ ప్రశ్నలు వేసుకుంటే చాలు అత ని నుంచి ప్రజలకు, ఆ సమాజానికి మేలు జరిగినట్లే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు స్పష్టమైన లక్ష్యం ఉన్నది. ప్రజల కోసం పనిచేయాలన్న సంకల్పం ఉన్నది. అందుకే ఆయన ఏ అడుగు వేసినా దానికి తగ్గ ప్రణాళిక సిద్ధంగా ఉంటుంది. 2001లో తెలంగాణ ఉద్యమం మొదలుపెట్టినప్పుడు కేసీఆర్

ఆస్ట్రేలియాలో కవిత జన్మదిన వేడుక‌లు

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, నిజామాబాద్ ఎంపీ కవిత జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని సిడ్నీ, మెల్బోర్న్ ,కాన్బెర్రా , బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గిరి రాపోలు ఆధ్వర్యంలో సిడ్నీలో కవిత దీర్ఘాఆయుష్షు కోసం సిడ్నీ రీజంట్స్ పార్క్ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు, అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. సిడ్నీలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేష్ రాపోలు మాట్లాడుతూ కవిత ఆశీస్సులతో ఆవిర్భవించిన తమ టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా, అనతికాలంలోనే ఆస్ట్రేలియాలోని అన్ని నగరాల్లో కార్యవర్గాల్ని ఏర్పరుచుకొని, వివిధ