movies

ఓటు మీది - గెలుపు నాది..!

కోట్లాది బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నూతన్ నాయుడిగా ఉన్న నన్ను బిగ్ బాస్ నూతన్ నాయుడిగా చేసిన మీకూ, బిగ్ బాస్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలతో బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్నాను. హౌస్ లో ఉన్నప్పుడూ, బయటకు వచ్చిన తరువాత కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. అడక్కుండానే ఇంత గుర్తింపు ఇచ్చిన బిగ్ బాస్ ఇంకో అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్ళీ హౌస్ లోకి తీసుకు రావాలనేది బిగ్ బాస్ ఆలోచన. మీరు వేసే ఓట్ల ఆధారంగా

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు

సోనాలీ అభిమానుల‌కు చేధు వార్త‌

ప్రముఖ సినీ నటి సోనాలి బింద్రే అభిమానుల‌కు ఇది చేధు వార్త‌. తాను హైగ్రేడ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు కొద్ది రోజుల క్రితం వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింద‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. క్యాన్స‌ర్‌ని రూపు మాప‌డానికి తక్షణ చర్య తీసుకోవడమే త‌ప్ప మ‌రో మార్గం లేదు. నా వైద్యులు సలహా ఇచ్చినట్లుగా, నేను ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతున్నాను. మేము ఆశాజనకంగా ఉండి, ప్రతి దశలో పోరాడాలని నేను నిశ్చయించుకున్నాను. గత కొన్ని రోజుల్లో నేను పొందిన ప్రేమ మరియు మద్దతు అపారమైన నిరుత్సాహంగా ఉంది, దీనికి నేను చాలా కృతజ్ఞురాలిని ఆమె ఆ ట్వీట్

చిత్తూరోడి ధ‌మాకా... స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

ఏరా మామ ఈసారి సినిమా ప్రియుల‌కు గురువార‌మే వారం మొద‌లైపోయిన‌ట్లుంది? అవున్రా బావ‌! స‌ప్త‌గిరి చూశాను. ఎలా ఉందేంది? హిందీలో తీసిన జాలీ ఎల్ఎల్‌బీని చెడ‌గొట్ట‌లేదు. ఇంత‌కీ క‌థేంటి? కోర్టులో కేసులు… అక్క‌డ నిజాల‌ను అబద్ధాల‌ని నిరూపించ‌డానికి  వేసే నాట‌కాలు. అబ‌ద్ధాల‌ను నిజాల‌ని న‌మ్మించ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు… ఇలాంటి ఓ కేసు చుట్టూ అల్లుకున్న‌దే ఈ క‌థ‌.  ఓ డ‌బ్బున్న యువ‌కుడు తాగిన మైకంలో కారు న‌డుపుతూ  ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న వారిపైకి ఎక్కిస్తాడు. ఈ ప్ర‌మాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోతారు.  ఈ కేసులో పెద్దింటి యువ‌కుడిని ర‌క్షించ‌డానికి ఓ పేరుమోసిన‌ లాయ‌ర్‌(సాయికుమార్) రంగంలోకి దిగుతాడు.  సాక్ష్యాల‌ను తారుమారు చేసి

కేటీఆర్ డైన‌మిక్ లీడ‌ర్

“మెట్రో ప్రారంభంలో రిబ్బన్‌ కట్‌ చేసే ముందు ప్రధాని కేటీఆర్‌ను ఎందుకు పిలిచారో తెలియదు. ఆయన వచ్చాక రిబ్బన్‌ కట్‌ చేయడం చూస్తుంటే… కేటీఆర్‌ డైనమిక్‌ లీడర్‌ అని చెప్పడానికి అది చాలుష అని ప్రముఖ న‌టుడు సాయి ధ‌ర‌మ్ తేజ్ అన్నారు. హైదరాబాద్ మెట్రోను జాతికి అంకితం చేస్తున్న వేళ జరిగిన ఆసక్తికర ఘటనపై హీరో సాయి ధరమ్ తేజ్ స్పందించాడు. మియాపూర్ మెట్రో స్టేషన్ లో రిబ్బన్ కట్ చేసేముందు కేటీఆర్ ఎక్కడున్నాడని ప్రధాని స్వయంగా కేసీఆర్ ను అడగడం, ఆపై కేటీఆర్ వచ్చిన తరువాత రిబ్బన్ కట్ చేయడం మీడియాలో వైరల్ అయింది. ఈ

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ నటీనటులు- శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు సంగీతం-సునీల్ కశ్యప్ ఛాయాగ్రహణం- భరణి ధరన్ నిర్మాత: శివబాలాజీ రచన-దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి  శివబాలాజీ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘స్నేహమేరా జీవితం’ సినిమా రిలీజైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. 80వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ‘స్నేహమేరా జీవితం’. మోహన్ (శివబాలాజీ) అనే అనాథ అయిన కుర్రాడు.. చలపతి అనే కొంచెం డబ్బు, పొగరు బాగా ఉండి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిపోవాలని చూసే మరో కుర్రాడు చలపతి (రాజీవ్ కనకాల).. వీళ్లిద్దరూ తమ మధ్య అంతరాల్ని పక్కన పెట్టేసి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. మోహన్.. చలపతికి చెందిన

50 ల‌క్ష‌లు విరాళంగా ఇచ్చేసిన హీరో

తెలుగు హీరోల సంగ‌తి ఏం చెబుతాం గానీ .. త‌మిళ హీరోలు సామాజిక బాధ్య‌త‌ను నెర‌వేర్చే తీరు మాత్రం అభినందించ‌ద‌గిందే. హీరో విశాల్ రైతుల‌ను ఆదుకున్న తీరు ఇప్ప‌టి వ‌ర‌కు మ‌నం చూశాం. తాజాగా త‌మిళ హీరో విజ‌య్ సేతుపతి త‌న‌కు ఓ ప్ర‌క‌ట‌న మూలంగా వ‌చ్చిన రూ.50 ల‌క్ష‌ల‌ను విరాళంగా ఇచ్చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నాడు. దిండుగల్ లో ‘అనిల్‌ సేమియా’ కంపెనీకి చెందిన ఐదు కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించిన విజయ్ సేతుపతి .. త‌న‌కు వ‌చ్చిన పారితోషికం విరాళంగా ఇచ్చేశాడు. అత్యంత వెనుకబడిన జిల్లాల్లో ఒకటిగా తమిళనాట పేరొందిన అరియలూర్‌ లోని 774 అంగన్వాడీలు, 10 అంధుల

ఆట‌..మాట‌ల మ‌ధ్య ``ఏమి సేతురా`` పాట

సినిమాకు క్లాప్ కొట్టినప్పటినుంచీ.. విడుద‌ల చేసే వ‌ర‌కూ ప్ర‌తీ సంద‌ర్భమూ ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగించుకోద‌గ్గ‌దే. పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను ఒక రేంజ్‌లో చేస్తారు. సినిమా ప్ర‌చారం వినూత్న పంథాలో సాగుతున్న నేటికాలంలో ప్ర‌మోష‌న్స్ కోసం ఎన్నోకార్య‌క్ర‌మాలు, వ్య‌య‌ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.  ఈ ట్రెండ్‌కు భిన్నంగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ శివ‌బాలాజీ తాను హీరోగా న‌టించిన సినిమా “ స్నేహ‌మేరా జీవితం“ ఆడియో విడుద‌ల‌ను వినూత్నంగా, అతిసామాన్యంగా చేస్తున్నారు. ఒక్కో పాట విడుద‌ల‌కు ఒక్కో ప్ర‌త్యేక‌ సంద‌ర్భాన్ని, ప్ర‌త్యేక‌త‌ను జోడిస్తూ..న‌యా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫినాలే త‌రువాత ఎక్క‌డ చూసినా శివ‌బాలాజీ టాపిక్కే! హీరోగా ఎన్నో హిట్

ఆ సినిమా ఆడ‌ద‌ని ముందే చెప్పా

ఇక నా జీవితంలో ఎప్పుడూ రీమేక్ లు చేయను అంటూ ఆ మ‌ధ్య కాలంలో ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు జ‌యంత్ సి ప‌రాన్జీ ఓ స్టేట్ మెంట్ ఇచ్చారు. ప‌వ‌న్ క‌ళ్యాణ్ హీరోగా న‌టించిన తీన్మార్ సినిమా అట్ట‌ర్ ప్లాప్ అయిన నేప‌థ్యంలో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేశారు. 2011లో విడుద‌ల‌యిన ఈ సినిమాను బండ్ల గ‌ణేష్ నిర్మించాడు. అయితే ఆ మాట‌లు ఎందుకు అన్న‌ది తాజాగా జ‌యంత్ సి ప‌రాన్జీ వివ‌ర‌ణ ఇచ్చారు. తీన్మార్ నాకు చేధు అనుభ‌వం మిగిల్చింది. ఆ సినిమాను ఉన్న‌ది ఉన్న‌ట్లు చేయాల్సి రావ‌డంతో అలా జ‌రిగింది. అంత‌కుముందు ల‌క్ష్మీన‌ర‌సింహ‌, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్

వ‌ర్మ‌కు పోటీగా ‘లక్ష్మీస్ వీరగ్రంథం’

ఎన్టీఆర్ బ‌యోపిక్ సిరీస్ లో మూడో సినిమాను ప్ర‌క‌టించారు. ల‌క్ష్మీస్ ఎన్టీఆర్ పేరిట ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు రాంగోపాల్ వ‌ర్మ ఫ‌స్ట్ లుక్ విడుద‌ల చేసిన నేప‌థ్యంలో అత‌ని మీద టీడీపీ నేత‌లు విరుచుకుప‌డ్డ విషయం, ఆ సినిమాకు నిర్మాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత కావ‌డం దుమారం రేపిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాలో చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా సందేశం ఉంటుంద‌ని టీడీపీ భావిస్తుంది. ఈ నేప‌థ్యంలో ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పేరిట ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్టు దర్శకుడు కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి ప్రకటించడం, ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను విడుదల చేయడం జ‌రిగింది. లక్ష్మీపార్వతి తన మొదటి భర్త