sandeepreddy Kthapally

పంచె చాటు పౌరుషం

`డీఎస్ డిక్టేట‌ర్ కాదు .. నేను బానిస‌ను కాను. నాకు తండ్రి చాటు రాజకీయాలు నాకు రావు` టీఆర్ఎస్ పార్టీలో ఉంటూ పార్టీ వ్య‌తిరేక కార్య‌క‌లాపాల‌కు పాల్ప‌డుతున్నాడ‌ని నిజామాబాద్ టీఆర్ఎస్ జిల్లా ప్ర‌జాప్ర‌తినిధులు రాజ్య‌స‌భ స‌భ్యుడు డి.శ్రీ‌నివాస్ మీద ఫిర్యాదు చేసిన నేప‌థ్యంలో ఆయ‌న కుమారుడు, బీజేపీ పార్టీలో కొన‌సాగుతున్న నిజామాబాద్ బీజేపీ నేత ధ‌ర్మ‌పురి అర‌వింద్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ క‌ల్వ‌కుంట్ల క‌విత‌ను ల‌క్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్య‌లు చేశాడు అర‌వింద్. ఇక ఆ మ‌రుస‌టి రోజే నిజామాబాద్ లో మున్నూరుకాపు కుల సంఘం స‌మావేశం ఏర్పాటు చేసిన

అభివృద్దిని ఓర్వ‌లేవు .. ఆనందాన్ని పంచ‌లేవు

నాలుగు కోట్ల ప్ర‌జ‌ల ఆకాంక్ష .. 60 ఏండ్ల అలుపెర‌గ‌ని ఉద్య‌మం .. వంద‌ల‌కొద్దీ బ‌లిదానాలు.. కేసీఆర్ ప్రాణాలు ప‌ణంగా .. టీఆర్ఎస్ ప‌ద‌వీ త్యాగాల ఫ‌లితంగా ఏర్ప‌డ్డ‌ది తెలంగాణ రాష్ట్రం. కాంగ్రెస్, బీజేపీ త‌దిత‌ర పార్టీలు తెలంగాణ ఏర్పాటు త‌మ వ‌ల్ల‌నే అని ఎంత వాదించినా ఉద్య‌మ స‌మ‌యంలో, పార్ల‌మెంటులో తెలంగాణ బిల్లు పెట్టిన స‌మ‌యంలో వారు వేసిన పిల్లిమొగ్గ‌లు, తెలంగాణ బిల్లు పార్ల‌మెంటు ఆమోదం పొంద‌కుండా వారు చేసిన విఫ‌ల‌య‌త్నాలు తెలంగాణ ప్ర‌జ‌లు అప్పుడే మ‌ర‌చిపోతార‌నుకోవ‌డం వారి అవివేకం. తెలంగాణ రాష్ట్రం కోసం 14 ఏండ్లు నిరంత‌రం శ్ర‌మించిన కేసీఆర్ వ‌చ్చిన తెలంగాణను ఎలా అభివృద్ది

హ‌ర‌గోపాల్ గారి నిదుర‌లేని రాత్రులు !

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి రాయ‌ల‌సీమ రాజకీయాల నుండి వ‌చ్చినాయ‌న‌ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి రోజూ ఉద‌యం త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వారిని ఖ‌చ్చితంగా క‌లుసుకునేవారు. నిజానికి ఈ చ‌ర్చ ఇలా జ‌ర‌గ‌డానికి, చ‌ర్చ‌లో ఉద్రిక్త‌త‌ల‌కు ప్ర‌జాస్వామ్య ప‌రిస్థితులు తెలంగాణ‌లో లేక‌పోవ‌డం కార‌ణం. ఈ నాలుగేళ్ల‌లో ఈ ప‌రిస్థితి లేక‌పోవ‌డం మూలంగా చాలా మంది ఈ వేదిక మీద చెప్పుకుంటున్నారు. ఉద్య‌మ‌నేత ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ క‌రీంన‌గ‌ర్ గ‌డీ సంస్కృతిని న‌డిపిస్తున్నారు. ఎవ‌రొచ్చినా వారు చెప్పే మాట‌లు వినాల‌ని ముఖ్య‌మంత్రికి చెబుతున్నాను. ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ అన్న మాట‌లివి. నిజంగా ఆయ‌న మాట‌లు

ఫెడరల్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపో యింది. అధికారం అందుకోవాలన్న పార్టీలకు జేడీఎస్ కీలకంగా మారిం ది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్‌కు భేషరతు మద్దతు తెలుపగా, అతిపెద్ద పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతున్నది. మునుముందు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఆపగలుగుతాయా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల కిందట బెంగళూరు పర్యటన సందర్భంగా వేసిన అంచనాలు, చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నారు.

మొఖం చాటేసిన కాంగ్రెస్

మ‌న ప‌క్కింట్ల ఏద‌యినా ఇబ్బంది అయితే వెళ్లి ఏం జ‌రుగుతుంద‌ని ఆరాతీస్తాం .. అవ‌స‌రం అయితే మ‌న‌కు చేత‌న‌యిన సాయం చేస్తాం .. మ‌న ఇంట్లో ఏద‌యినా శుభం జ‌రిగితే ఇరుగూ పొరుగూ పిలుచుకుని సంతోషాన్ని పంచుకుంటాం. మ‌న ప‌క్కిళ్లు ఆనందంగా ఉంటే మ‌న‌మూ ఆనందంగా ఉంటాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల వ్య‌వ‌హారం మాత్రం ఊరంతా ఒక చింత ఉంటే ఊసుకండ్లోడికి దోమ‌ల చింత అన్న‌ట్లు ఉంది. గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల చేప‌ట్టినా, సాగునీళ్లు ఇచ్చినా, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ఇప్పుడు రైతుబంధు ఏ ప‌థ‌కం చేప‌ట్టినా దానిని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా కాంగ్రెస్

విజ‌యాన్ని చూడ‌లేక‌ విషం కక్కుతున్నారు

నాలుగేళ్ల ప‌సిగుడ్డు తెలంగాణ అనేక కుట్ర‌ల‌ను చేధించి, అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి, అనేక ఆంక్ష‌ల‌ను దాటుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌ధ్యంలో అనేక రంగాల‌లో విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంది. దేశం దృష్టిని, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించి అభినంద‌న‌లు అందుకుంటుంది. తెలంగాణ ప‌థ‌కాలు ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ఆద‌ర్శం అవుతున్నాయి. తెలంగాణ ప‌థ‌కాలు అవ‌లంభిస్తామ‌ని ప‌లు రాష్ట్రాలు త‌మ త‌మ బృందాల‌ను తెలంగాణ‌కు పంపి అధ్య‌య‌నం చేయిస్తున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. కానీ తెలంగాణ విజ‌యాలు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించినా ఆంధ్రా మీడియాను మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోతున్నాయి అన‌డం కంటే తెలంగాణ రాష్ట్ర విజ‌యాల‌ను ఈ ప‌త్రిక‌లు

ఉద్య‌మానికి .. ఉన్మాదానికి తేడా లేదా ?

ఒక వైపు ఏండ్ల త‌ర‌బ‌డి జ‌రుగుతున్న ఉద్య‌మం .. మ‌రో వైపు అడుగ‌డుగునా ప్ర‌భుత్వ నిర్భంధం .. ఇంకో వైపు స‌మైక్య శాస‌న‌స‌భ‌లో తెలంగాణ‌కు అవ‌మానాలు .. ఒక్క రూపాయి ఇవ్వం ఏం చేసుకుంటారో చేసుకోండి అంటూ సాక్షాత్తూ స‌భా నాయ‌కుడి వెక్కిరింపులు .. బ‌య‌ట ప్ర‌జాక్షేత్రంలో స్వ‌రాష్ట్రం కోసం యువ‌త బ‌లిదానాలు .. ఉద్య‌మ‌కారుల అరెస్టులు .. లాఠీచార్జీలు .. తెలంగాణ ఊసేలేద‌ని శాస‌న‌స‌భ సాక్షిగా బ‌య‌ట ప్రపంచానికి చాటాల‌న్న స‌మైక్య పాల‌కుల ఎత్తుగ‌డ‌లు స‌రిగ్గా ఇలాంటి ప‌రిస్థితుల‌లో జ‌రిగిన శాస‌న‌స‌భ స‌మావేశాల‌లో అప్ప‌టి ఎమ్మెల్యే, ప్ర‌స్తుత రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు

కేసీఆర్ వ్యూహం కేంద్రంలో క‌ద‌లిక‌

గోదావ‌రి న‌ది మీద మ‌హారాష్ట్ర ముఖ్య‌మంత్రి దేవేంద్ర ఫ‌డ్న‌విస్ తో రాష్ట్ర‌ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఒప్పందం చేసుకుంటే విప‌క్షాలు ఎద్దేవా చేశాయి. ఆంధ్రా మీడియా రాద్దాంతం చేసింది. కానీ ఈ రోజు ఆ ఒప్పంద‌మే తెలంగాణ కొర‌కు క‌డుతున్న అనేక ప్రాజెక్టుల‌కు కేంద్రం నుండి అనుమ‌తి వ‌చ్చేలా చేసింది. కేంద్రం నుండి ఒక్క అనుమ‌తి తీసుకురావ‌డానికి గ‌త ప్ర‌భుత్వాల కాలంలో ఏళ్ల త‌ర‌బ‌డి .. ద‌శాబ్దాల పాటు కాల‌యాప‌న జ‌రిగిన ప్రాజెక్టులు కోకొల్ల‌లు. కానీ గ‌త మూడున్న‌రేళ్ల కాలంలో కేంద్రం నుండి తెలంగాణ ప్ర‌భుత్వం రెండు వేల‌కు మించిన అనుమ‌తులు సాధించ‌డం విశేషం. ఇది ఓ రికార్డు కూడా.

కాసుల కాన్పుకు చెల్లు చీటీ

భాస్కర్. పెళ్లిళ్లకు, సభలకు డెకరేషన్ చేయడం వృత్తి. రెక్కాడితే గాని డొక్కాడని బతుకు. భార్య గర్భవ తి. ఆమెకు గుండె జబ్బు ఉండటంతో డాక్టర్ పర్యవేక్షణ తప్పనిసరి. పరిస్థితి చెప్పుకొని సలహా అడిగాడు. ఎందుకైనా మంచిది కాన్పు అయ్యేవరకు హైదరాబాద్ లో ఉంచు అని చెప్పా. గుండెజ బ్బు ఉండటంతో కాన్పు కష్టం అని డాక్టర్లు చెప్పారు. అబార్షన్ చేయించుకున్నా అదే పరిస్థితి. భార్యభర్తలు ఇద్దరూ మాట్లాడుకొని కష్టమో నష్టమో బిడ్డను కనడానికే సిద్ధ మయ్యారు. బంజారాహిల్స్‌లోని ఓ కార్పొరేట్ దవాఖానలో లక్షా పదివేలకు మాట్లాడుకున్నారు. కష్టమైనా కన్నబిడ్డ మీద మమకారంతో ఆ లక్షను అప్పోసప్పో చేసి సమకూర్చుకున్నాడు.

భాష‌నే కేసీఆర్ బ‌లం.. బ‌ల‌గం

ఆయ‌న హీరో కాదు ఈల వేస్తే అభిమానులు గోల చేయ‌డానికి.. ఆయ‌న అప్ప‌టికి పెద్ద నాయ‌కుడు కూడా కాదు పిలుపునిస్తే వేల మంది పోగు కావ‌డానికి. బ‌క్క‌ప‌లుచ‌ని దేహం .. పాపిట తీసిన జుట్టు .. మాట్లాడే మాట‌లో దృడ‌త్వం .. చెప్పే మాట‌ల్లో స్ప‌ష్ట‌త .. ఆయ‌న‌నే కేసీఆర్. జ‌ల‌దృశ్యం వేదిక మీద 50 ఏండ్ల తెలంగాణ ప్ర‌జ‌ల ఆకాంక్ష అయిన ప్ర‌త్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించ‌డానికి తెలంగాణ రాష్ట్ర స‌మితిని ప్రారంభిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌గానే యావ‌త్ తెలంగాణ స‌మాజం కేసీఆర్ వైపు ఆస‌క్తిగా దృష్టి సారించింది. తెలంగాణ‌కు జ‌రుగుతున్న అన్యాయాన్ని .. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మూలంగా