nagaraju chowdary

ఓటు మీది - గెలుపు నాది..!

కోట్లాది బిగ్ బాస్ ప్రేక్షకులందరికీ నమస్కారం. నూతన్ నాయుడిగా ఉన్న నన్ను బిగ్ బాస్ నూతన్ నాయుడిగా చేసిన మీకూ, బిగ్ బాస్ కి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అందరి ప్రేమాభిమానాలతో బిగ్ బాస్ లో రెండు వారాలు ఉన్నాను. హౌస్ లో ఉన్నప్పుడూ, బయటకు వచ్చిన తరువాత కూడా మీరు చూపించిన ఆదరణ, అభిమానం జీవితంలో ఎప్పుడూ మరచిపోలేను. అడక్కుండానే ఇంత గుర్తింపు ఇచ్చిన బిగ్ బాస్ ఇంకో అవకాశం ఇస్తున్నారు. ఇంతకుముందు ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని మళ్ళీ హౌస్ లోకి తీసుకు రావాలనేది బిగ్ బాస్ ఆలోచన. మీరు వేసే ఓట్ల ఆధారంగా

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి “నిన్ను కోరి”తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. హైద్రాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు

చిత్తూరోడి ధ‌మాకా... స‌ప్త‌గిరి ఎల్ఎల్‌బీ

ఏరా మామ ఈసారి సినిమా ప్రియుల‌కు గురువార‌మే వారం మొద‌లైపోయిన‌ట్లుంది? అవున్రా బావ‌! స‌ప్త‌గిరి చూశాను. ఎలా ఉందేంది? హిందీలో తీసిన జాలీ ఎల్ఎల్‌బీని చెడ‌గొట్ట‌లేదు. ఇంత‌కీ క‌థేంటి? కోర్టులో కేసులు… అక్క‌డ నిజాల‌ను అబద్ధాల‌ని నిరూపించ‌డానికి  వేసే నాట‌కాలు. అబ‌ద్ధాల‌ను నిజాల‌ని న‌మ్మించ‌డానికి చేసే ప్ర‌య‌త్నాలు… ఇలాంటి ఓ కేసు చుట్టూ అల్లుకున్న‌దే ఈ క‌థ‌.  ఓ డ‌బ్బున్న యువ‌కుడు తాగిన మైకంలో కారు న‌డుపుతూ  ఫ్లాట్‌ఫారంపై నిద్రిస్తున్న వారిపైకి ఎక్కిస్తాడు. ఈ ప్ర‌మాదంలో అయిదుగురు ప్రాణాలు కోల్పోతారు.  ఈ కేసులో పెద్దింటి యువ‌కుడిని ర‌క్షించ‌డానికి ఓ పేరుమోసిన‌ లాయ‌ర్‌(సాయికుమార్) రంగంలోకి దిగుతాడు.  సాక్ష్యాల‌ను తారుమారు చేసి

40 పల్లెటూర్లకు కేటిఆర్ శుభవార్త

  తెలంగాణలోని 40 గ్రామాలకు పురపాలక శాఖ మంత్రి కేటిఆర్ శుభవార్త చెప్పారు. ఆ గ్రామాలకు కొత్త శోభ అద్దనున్నట్లు ఆయన వివరించారు. ఇంతకూ ఆయన పంచాయతీరాజ్ శాఖ మంత్రి కాదుగదా? పురపాలక శాఖ మంత్రి కదా?  ఆయన శుభవార్త చెప్పుడేందని అనుకుంటున్నారా అయితే ఈ వార్త చదవండి మరి. తెలంగాణలోని పురపాలక సంస్థల్లోని అభివృద్ధి కార్యక్రమాలపైన జిల్లా కలెక్టర్లతో పురపాలక శాఖ మంత్రి కెటి రామారావు వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపైన మంత్రి పలు అదేశాలు జారీ చేశారు. ప్రజలకు ప్రభుత్వ పథకాలను మరింత మెరుగ్గా

చంద్రబాబు సర్కారుకు షాకిచ్చిన కేంద్రం..!

ఆంద్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి డీజీపీగా ఎవరిని నియమించాలన్న విషయమై ఏపీ సర్కారు తయారు చేసి కేంద్ర హోం శాఖకు పంపిన జాబితా తిరస్కరణకు గురైంది. ఈ జాబితాను వెనక్కు పంపిన కేంద్రం, ఏడాది లోగా పదవీ విరమణ చేయనున్న వారి పేర్లను తెలుపుతూ, వారిని రెండేళ్ల పదవీ కాలానికి ఎలా నియమిస్తారని ప్రశ్నించింది. పూర్తిస్థాయి డీజీపీగా ఒకరిని నియమించాలని చెబుతూ చంద్రబాబు ప్రభుత్వం ఏడుగురి పేర్లను కేంద్రానికి పంపింది. వీటిలో ఏడాది లోపు రిటైర్ అవుతున్న వారూ ఉన్నారు. రమణమూర్తి, సాంబశివరావు, మాలకొండయ్యలు త్వరలోనే రిటైర్ కానున్నారు. రిటైర్ మెంట్ ముందున్న వారిని డీజీపీగా నియమించి, ఆపై వారి

లంచం అడిగితే చెప్పుతో కొట్టండి...కేసీఆర్

సింగరేణి కార్మికుల అన్ని సమస్యలు త్వరలోనే పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం ప్రగతి భవన్‌లో సింగరేణి కార్మికులతో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్మికులతో మాట్లాడిన ఆయన.. త్వరలోనే సింగరేణి యాత్ర నిర్వహిస్తానని, కార్మికుల సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కరిస్తానన్నారు. సింగరేణి కార్మికులను లంచం అగిడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం అని అన్నారు. కార్మికులు కూడా లంచం ఇవ్వొద్దన్నారు. ఎవరైనా లంచం అడిగితే.. వారిపై ఫిర్యాదు చేయండని సూచించారు. రేపటి నుంచి సింగరేణి కార్మికులను లంచం అడిగినవారిని… లంచం తీసుకున్నవారిని చెప్పుతో కొట్టాలని వ్యాఖ్యానించారు. సంఘంలో సభ్యత్వానికి కేవలం రూపాయి ఉండేలా చర్యలు తీసుకుంటామని

'రాజా ది గ్రేట్‌'తో ఈ ఏడాది ఐదో హిట్ కొడుతున్నాం - దిల్‌రాజు

  హీరో క్యారెక్టరైజేషన్‌కు త‌న‌దైన బాడీ లాంగ్వేజ్‌,  డైలాగ్ డెలివ‌రీతో వేరియేష‌న్ చూపించే క‌థానాయ‌కుడు మాస్ మ‌హారాజా రవితేజ‌. ఈయ‌న క‌థ‌నాయ‌కుడుగా ప‌టాస్‌, సుప్రీమ్ చిత్రాల ఫేమ్ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `రాజా ది గ్రేట్‌`. హిట్ చిత్రాల నిర్మాత దిల్‌రాజు స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బేన‌ర్‌పై శిరీష్ నిర్మాత‌గా  ఈ చిత్రం తెరకెక్కింది. ఈ సినిమా దీపావళికి విడుదల కానుంది. ఈ సందర్భంగా సినిమా ట్రైలర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ సందర్భంగా… మాస్ మహారాజా రవితేజ మాట్లాడుతూ – ”దిల్‌రాజుతో 13 ఏళ్ల తర్వాత చేసిన

ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించిన మంత్రి త‌ల‌సాని

రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత సినీప‌రిశ్ర‌మ భ‌విత‌వ్యంపై సినీప‌రిశ్ర‌మ ప్ర‌ముఖులు టి-ప్ర‌భుత్వంతో ముచ్చ‌టించిన సంగతి తెలిసిందే. ఆ క్ర‌మంలోనే తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప‌రిశ్ర‌మ పెద్ద‌ల‌కు కొన్ని హామీలు ఇచ్చింది. అందులో ముఖ్యంగా సింగిల్ విండో ప‌ద్ధ‌తిలో షూటింగుల‌కు ఎలాంటి ఇబ్బందులు క‌ల‌గ‌కుండా సునాయాసంగా అనుమ‌తులు ల‌భించేలా చేస్తామ‌ని ప్ర‌భుత్వం ప్రామిస్ చేసింది. తాజాగా ఆ ప్రామిస్‌ని నెర‌వేర్చింది టి-ప్ర‌భుత్వం. నేడు సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్ స్వ‌యంగా సింగిల్ విండో షూటింగ్ ప‌ర్మిష‌న్స్ వింగ్‌ను, ఆన్ లైన్ టిక్కెట్ పోర్ట‌ల్ ను ప్రారంభించారు. హైద‌రాబాద్‌ సెక్ర‌టేరియ‌ట్ లో నేటి ఉద‌యం 11 గంట‌ల‌కు డి-బ్లాక్ లోని గ్రౌండ్

రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ సంబురాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారిక నివాసం ప్రగతిభవన్‌లో నిజామాబాద్‌ ఎంపీకవిత మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. ప్రగతి భవన్‌కు చేరుకున్నమహిళలంతా కలిసి బతుకమ్మ పాటలకు అనుగుణంగా లయబద్ధంగా ఆడారు. ఈ వేడుకల్లో తెలుగు రాష్ట్రాల గవర్నర్‌ సతీమణి విమలా నరసింహన్‌, ముఖ్యమంత్రి సతీమణి శోభ, తెలంగాణ ఉపసభాపతి పద్మాదేవేందర్‌ రెడ్డి, హరీశ్‌రావు సతీమణి శ్రీనిత, అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కేథరిన్‌ హడ్డా తదితరులుపాల్గొన్నారు.

VOTE FOR అర్చ‌న అంటూ హైద‌రాబాద్‌లో క‌టౌట్స్ !

  తెలుగు బిగ్‌బాస్ రియాల్టీ షో క్లైమాక్స్ వ‌చ్చేసింది. బిగ్‌బాస్ టైటిల్ ఎవ‌రిది అనే 70 రోజుల ఉత్కంఠ‌కు తెర ప‌డే స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డింది. ఈ నేప‌థ్యంలో ప్లీజ్ ఓట్ ఫ‌ర్‌ అర్చ‌న అంటూ హైద‌రాబాద్‌లోని ప‌లు ఏరియాల్లో అర్చ‌న క‌టౌట్స్ వెలిశాయి. ప్ర‌సాద్ ఐమాక్స్, అమీర్‌పేట ప్రాంతాల్లో భారీ సైజ్‌లో వెలిసిన క‌టౌట్స్ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తున్నాయి. జై ల‌వ కుశ సినిమా రిలీజ్ సంద‌ర్భంగా ప్ర‌సాద్ ఐమాక్స్ ద‌గ్గ‌ర వెలిసిన అర్చ‌న కటౌట్.. ఇప్పుడు తార‌క్ ఫ్యాన్స్‌ను కూడా తెగ ఆక‌ట్టుకుంటోంది. ఈ క‌టౌట్‌లో జై ల‌వ కుశ పోస్ట‌ర్ కూడా యాడ్ చేశారు. అంద‌మైన కెప్టెన్