Ravi Garuda

సెటైర్ : మిసెస్ జ్ఞానాంబ :: లోపల

మిసెస్ జ్ఞానాంబ కు చాలా రాజకీయ జ్ఞానం ఉంది. పైగా చాలా ముక్కు సూటిగా మాట్లాడేస్తుంది. ఈరోజుల్లో రాజకీయాలపై ఎడాపెడా మాటలు అందుకోవడానికి ఈ రెండింటికంటె వేరే లక్షణాలు ఏం కావాలి? అందుకే… మిసెస్ జ్ఞానాంబ.. జగన్ పాదయాత్ర మీద, ఏపీలో జరుగుతున్న అసెంబ్లీ మీద ఏం చెబుతోందో ఓసారి చూడండి…

కొండా ఫ్యామిలీ : ఇక కొనసాగితే సిగ్గు చేటే!

కొండా సురేఖ- కొండా మురళి ఒకప్పట్లో తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హవా చెలాయించారు. రాజశేఖర రెడ్డి హయాంలో చాలా విశృంఖలంగానూ వ్యవహరించారు. తర్వాత జగన్ పంచన చేరారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత.. ఆ పార్టీకి ఇక్కడ ఠికానా లేదనే సంగతి అర్థమైన తర్వాత.. గులాబీ పార్టీ పంచన చేరారు. నిజానికి వారికి గత్యంతరం లేక తెరాసలోకి వచ్చారే తప్ప.. తెరాస పార్టీకి వారివలన అదనంగా ఒనగూరిన బలం గానీ, ప్రయోజనం గానీ లేవు అని జనం అనుకుంటూ ఉంటారు . అలాంటి నేపథ్యంలో ఈ పార్టీ ప్రభుత్వంలో వారి డిమాండ్లు పెద్దగా పట్టించుకున్న వారు లేరు. కొండా సురేఖకు

ఉత్తమ్ కామెడీ.. : లంబాలంబా దాడీ!

మరి కొన్నేళ్లు గడిచిందనుకోండి.. ‘‘అరే.. ఉత్తమన్న దాడీ గట్ల లంబా లంబాగా పెరిగిందేందిర’’అని ఎవ్వడైన అంటే… ‘‘ఏముందిరా.. ఉత్తమన్న ఫాల్తూ మాటలు డిసైడ్ జేసిండు.. ఆని కర్మిట్లా గాలిపాయె… మంగలోని కత్తెరగకపాయె…. దాడీ జడలు గట్టిపాయె..’’ అంటూ ఎవరైనా సరే జోకులేసుకోవాల్సిందే. అవును మరి.. తెలంగాణ పీసీసీకి ప్రస్తుతానికి చీఫ్ గా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గడ్డం భవిష్యత్తులో ఎన్ని అడుగుల పొడుగు పెరుగుతుందో.. ఆయనలో ఎందరు రుషులను, అఘోరాలను తెలంగాణ సమాజానికి చూపిస్తుందో అర్థం కావడం లేదని ప్రజలు జోకులేసుకుంటున్నారు. ఎందుకంటే.. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఒక ప్రతిజ్ఞచేసి గడ్డం పెంచడం ప్రారంభించారు. ఆ ప్రతిజ్ఞ

విమర్శకుల నోళ్లకు తాళం!

విమర్శకుల నోళ్లకు ముఖ్యమంత్రి కేసీఆర్ తాళం వేశారు. కొత్త ప్రభుత్వం కొత్త రాష్ట్రం పాలన సాగుతోంటే.. ఊపిరి సలపనివ్వకుండా ఏదో ప్రజా ద్రోహం జరిగిపోతున్నట్లుగా నానా మాటలూ అంటూ వచ్చిన ప్రతిపక్షాలకు అసెంబ్లీ సాక్షిగా ఒకే ఒక్క ప్రకటనతో జవాబు చెప్పేశారు. తెలంగాణ యువతరానికి వరాన్ని ప్రకటించారు. యూత్ కు లక్ష ఉద్యోగాలు ఇస్తాం అనే.. తన ప్రకటనకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నదనే నిర్ధరించారు. కేవలం లక్ష ఉద్యోగాలు మాత్రమే కాదు.. లక్ష కంటే ఎక్కువే ఉద్యోగాలు ఇవ్వబోతున్నాం అంటూ శాసనసభలోముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటన.. ఆయనను విమర్శించే వారి నోళ్లకు తాళాలు వేయగలదంటే ఎలాంటి ఆశ్చర్యం లేదు.

అందుకే... కేసీఆర్ కు తిరుగులేదు!

రాజకీయ పార్టీల కార్యకర్తలు అంటే జెండాలు మోసే వాళ్లుగా మాత్రమే ప్రపంచానికి తెలుసు. పార్టీల మీది అభిమానంతో తమ సమయాన్ని ధనాన్ని వృథా చేసుకుని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూ జేజేలు కొడుతూ.. జెండాలు మోస్తూ విజయానికి పనిచేసేవాళ్లు కార్యకర్తలు. వీరు పార్టీని అధికారంలోకి తెస్తుంటారే తప్ప, వారికి పార్టీలు ఏమీ చేసే దాఖలాలు గతంలో లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కార్యకర్తలను కూడా దేవుళ్ల మాదిరిగా పార్టీలు నెత్తిన పెట్టుకుంటున్నాయి. వారి సంక్షేమం తమ ప్రథమ బాధ్యతగా పార్టీలు గుర్తిస్తున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ విషయంలో తనకు తిరుగులేదని మరోసారి నిరూపించుకున్నారు. తెలంగాణ వ్యాప్తంగా ఏకంగా