raju arige

బే ఏరియా గులాబీ మయం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ పుట్టిన‌రోజు వేడుక‌లు అభిమానులు, పార్టీ కార్య‌క‌ర్తలు, నేత‌లు ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఘ‌నంగా జ‌రుపుకుంటున్నారు. అమెరికా కాలిఫోర్నియాలోని స‌న్నివేల్ లో జ‌న్మ‌దిన వేడుక‌ల సంబ‌రాలు అంబ‌రాన్నంటాయి. టీఆర్ఎస్ యూఎస్ఎ ఆధ్వ‌ర్యంలో జ‌రిగిన వేడుక‌ల‌కు పెద్ద ఎత్తున అభిమానులు హాజ‌ర‌య్యారు. పూర్ణ బైరి, అనిల్ ఎర్ర‌బెల్లి ఆధ్య‌క్ష‌త‌న జ‌రిగిన వేడుక‌ల‌లో టీఆర్ఎస్ యూఎస్ఎ టీం ఎన్ఆర్ఐలు న‌వీన్, భాస్క‌ర్, అభిలాష్ రంగినేని, ర‌జ‌నీకాంత్, శ్రీ‌నివాస్, హృషికేష్, శివ‌, ఉద‌య్, హ‌రి, రామ్ త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు. అర‌వైఏండ్ల తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్ర ఆకాంక్ష‌ను 14 ఏండ్ల అవిశ్రాంత ఉద్య‌మంతో సాధించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడున్న‌రేండ్ల పాల‌న‌తో ప్ర‌పంచానికే ఆద‌ర్శంగా నిలిచార‌ని కొనియాడారు.

కార్యసాధకుడు మన కేసీఆర్

అద్భుతాలను కలగనడం ఆయన హాబీ! వాటిని అవలీలగా సాకారం చేసేయడం ఆయన ైస్టెల్! అసాధ్యాలను సుసాధ్యం చేయడం ఆయనకలవాటు! ముళ్లూరాళ్లూ అవాంతరాలున్న బాటలను ముచ్చటైన రహదారులుగా తీర్చిదిద్దే కార్మికుడు! తెలంగాణపై ఆపేక్ష.. తెలంగాణకు రక్ష.. బంగారు తెలంగాణ నిర్మాణానికి సంకల్పం తీసుకున్న దక్ష! కేసీఆర్! మూడక్షరాల పేరున్న తెలంగాణ మహర్షి! ఉచ్ఛాసనిశ్వాసల్లో తెలంగాణనే నింపుకొన్న నిలువెత్తు మూర్తిమత్వం! గిట్టనిశక్తులు విమర్శలను, విషాగ్నులను కురిపిస్తున్నా.. బెదరక, సడలక ముందుకు సాగుతున్న ధీరుడు! లక్ష్యసాధన కోసం మృత్యువునే ముద్దాడేందుకు తెగించి.. సాధించిన సాహసి.. కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు!! ఆయన కృషికి సాక్ష్యమే నేటి స్వేచ్ఛా తెలంగాణం! ఆయన త్యాగానికి రూపమే నేటి స్వరాష్ట్రం!

తైక్వాండోలో హైద‌రాబాదీల ప్ర‌తిభ‌

అంత‌ర్జాతీయ తైక్వాండో పోటీల‌లో తెలంగాణ క్రీడాకారులు స‌త్తా చాటారు. బంగారు ప‌త‌కాలు సాధించి తెలంగాణ ఘ‌న‌త‌ను చాటారు. ఈ క్రీడాకారుల‌కు తెలంగాణ ప్ర‌భుత్వం చేయూత అందించింది. మంత్రి కేటీఆర్ స్వ‌యంగా క్రీడాకారుల‌కు సాయం అంద‌జేశారు. అమెరికాలో జ‌రిగిన అంత‌ర్జాతీయ పోటీల‌లో కోచ్ జ‌యంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో సింధు త‌పస్విని, కొండా స‌హ‌దేవ్, అబ్దుల్ ఖ‌లీల్ లు పోటీల‌కు హాజ‌ర‌య్యారు. పోటీల‌లో సింధు త‌ప‌స్విని బంగారు, సిల్వ‌ర్, కాంస్య ప‌త‌కాలు సాధించ‌గా, కొండా స‌హ‌దేవ్ ఒక‌ బంగారు, రొండు వెండి ప‌త‌కాలు, ఖ‌లీల్ రెండు బంగారు, ఒక కాంస్య ప‌త‌కం సాధించారు. ఎన్ఆర్ఐ టీఆర్ఎస్ అడ్వ‌యిజ‌రీ క‌మిటీ త‌రపున డాక్ట‌ర్

ఆస్ట్రేలియాలో కేసీఆర్ జన్మదిన వేడుకలు

ముఖ్య‌మంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ , సిడ్నీ ,కాన్బెర్రా ,బ్రిస్బేన్ మరియు అడిలైడ్ పట్టణాలలో టీ.ఆర్.ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల ఆధ్వర్యంలో వేడుకలు టీ.ఆర్.ఎస్ అభిమానులు మరియు కార్యకర్తల ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరిపారు. విక్టోరియా ఇంచార్జి సాయిరాం ఉప్పు ఆధ్వర్యంలో మెల్బోర్న్ లో ఉదయం మురుగన్ టెంపుల్ లో కేసిఆర్ ఆయురారోగ్యాలకై ప్రత్యేక పూజలు జరిపించారు, సాయంత్రం బ్రేబ్రూక్ లో జన్మ దిన వేడుకలు, కార్యకర్తలు మరియు అభిమానుల మధ్య కోలాహలంగా నిర్వహించారు. ఈ సందర్భాంగా టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ప్రెసిడెంట్ నాగేందర్ రెడ్డి కాసర్ల మాట్లాడుతూ, కె

ఆంధ్రా హీరో కేసీఆర్

కేసీఆర్ ఈ మూడ‌క్ష‌రాల పేరు వింటే ఓ ఉత్సాహం .. ఓ ఉద్వేగం .. ఓ భ‌రోసా. 60 ఏండ్ల తెలంగాణ క‌ల‌ను సాకారం చేసి తెలంగాణ ప్ర‌జ‌ల ఆత్మ‌గౌర‌వాన్ని ఎలుగెత్తిన నేత‌. ప్ర‌జాస్వామ్యబ‌ద్దంగా ప్ర‌జ‌ల‌ను ఉద్య‌మంలో భాగ‌స్వామ్యం చేసి సంకీర్ణ రాజ‌కీయాల కాలంలో దేశంలోని అన్ని రాజ‌కీయ పార్టీల‌ను ఒప్పించి, మెప్పించి తెలంగాణ రాష్ఠ్రం సాధించ‌డం మామూలు విష‌యం కాదు. త‌ను చేస్తున్న ప‌ని మీద స్ప‌ష్ట‌మ‌యిన అవ‌గాహ‌న‌, ప్ర‌ణాళిక ఉన్న కేసీఆర్ 14 ఏండ్ల సుధీర్ఘ ఉద్య‌మంతో ల‌క్ష్యాన్ని ముద్దాడారు. వ‌చ్చిన తెలంగాణ‌ను కూడా ఎలా అభివృద్ది చేయాలి అన్న స్ప‌ష్ట‌మ‌యిన అవ‌గాహ‌న ఉన్న కేసీఆర్

గ‌జ‌ల్ శ్రీ‌నివాస్ లైంగిక వేధింపులు

గజల్ కళాకారుడు గజల్ శ్రీనివాస్ ను హైదరాబాద్ పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు. లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఆలయవాణి అనే వెబ్ రేడియోలో ఓ యువతి రేడియో జాకీగా పని చేస్తున్నారు. ఈ వెబ్ రేడియోకు గజల్ శ్రీనివాస్ బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు. ఈ క్రమంలో తనపై గజల్ శ్రీనివాస్ లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆధారాలతో సహా ఆమె డిసెంబర్ 29వ తేదీ సాయంత్రం కేసు పెట్టారు. తనను బెదిరిస్తూ పెట్టిన మెసేజ్ లను పోలీసులకు సమర్పించారు. ఈ నేపథ్యంలో, కేసు నమోదు చేసిన

ప‌వ‌న్ వ‌చ్చాడా ? కేసీఆర్ వెళ్లారా ?

నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు చెప్పేందుకు నిన్న సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ప్ర‌గ‌తి భ‌వ‌న్ కు వెళ్లి ముఖ్య‌మంత్రి కేసీఆర్ కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ ప‌రిణామాలే తెలంగాణ‌లో కేసీఆర్ వ్య‌తిరేకుల‌కు అస‌లు జీర్ణం కావ‌డం లేదు .. ఇక మ‌రికొంద‌రు కేసీఆర్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ కు క‌లిసే అవ‌కాశం ఇవ్వ‌డాన్ని త‌ప్పుప‌డుతున్నారు. మ‌రికొంద‌రు ఉద్య‌మ‌కారులు ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను క‌ల‌వ‌డం నేరం ఘోరం అన్న‌ట్లు మాట్లాడుతున్నారు. అస‌లు కేసీఆర్ ను క‌లిసిన త‌రువాత ప‌వ‌న్ క‌ళ్యాణ్ మీడియా స‌మావేశంలోనే కేసీఆర్ గొప్ప‌త‌నం, ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎందుకు వ‌చ్చాడు అన్న విష‌యం తెలుస్తుంది. రాజ్ భ‌వ‌న్ లో

ఎన్నెన్ని ప‌ద్యాలు చ‌దివానో

ప్ర‌పంచ తెలుగు మ‌హాస‌భ‌ల నేప‌థ్యంలో తొలిరోజు పాట‌, ప‌ద్యాల‌తో అల‌రించిన ముఖ్య‌మంత్రి కేసీఆర్ మూడో రోజు స‌మావేశాల‌లోనూ త‌ను చిన్న‌ప్పుడు చ‌దివిన ప‌ద్యాల‌ను గుర్తుచేసుకుని చ‌దివారు.. ఆయ‌న ప‌ద్యాల‌ను విని ఆయ‌న జ్ఞాప‌క‌శ‌క్తిని చూసి స‌భికులంతా ఆశ్చ‌ర్యంతో హ‌ర్ష‌ద్వానాలు వ్య‌క్తం చేశారు .. కేసీఆర్ ప‌ద్యాలు మీకోసం సాహిత్యానికి, సాహితీ సృజన కోసం కృషి చేసేవారికి ఒకప్పుడున్న ఆదరణ మధ్యలో కొంత తగ్గింది. తెలంగాణలో రస స్ఫూర్తికి తక్కువ లేదు. రచించేవారు తక్కువేమీ లేరనేది ఈ తెలుగు మహాసభల సందర్భంగా రుజువవుతున్నది. నలభై ఏండ్ల కిత్రం చదువుకున్నపుడు ఎంత గొప్పగా చదివానో! నాకు సుమారు 3 వేల పద్యాలు

తెలుగు మహాసభలు .. కేసీఆర్ అనుభ‌వం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ 1974లో జ‌రిగిన తొలి తెలుగు మ‌హాస‌భ‌ల సంధ‌ర్భంగా ఎదుర్కొన్న అనుభ‌వాల‌ను ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజున మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్)లో స‌భికుల‌తో పంచుకున్నారు .. ఆ అనుభ‌వాలు మీకోసం .. కాలేజీ చదివేరోజుల్లో గంగారెడ్డిగారు ప్రిన్సిపాల్‌గా ఉన్నరు. అప్పట్లో లైబ్రరీలో చాలా అరుదైన పుస్తకాలుండేవి. ఖరీదైనవి. ఆ రిఫరెన్సు పుస్తకాలు లైబ్రేరియన్ ఇచ్చెటోడు కాదు. అప్పుడు మా ప్రిన్సిపాల్ వచ్చి వీడు ఏది అడిగితే అది ఇయ్యవయ్య. నేనిస్తా డబ్బులు అన్నారు. ఆయనకు అంతటి అభినివేశం ఉన్నది. 1974లో తొలి తెలుగు మహాసభల సందర్భంగా విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తున్నరు. నేను, మిత్రుడు

ఉత్త మాట‌లు చెప్ప .. ఉత్త‌మ నిర్ణ‌యాలుంటాయ్

ఉత్తుత్తి మాట‌లు చెప్ప‌ను నేను .. ఉత్త‌మ కార్యాచ‌ర‌ణ‌ను రూపొందిస్తాం. ప్రపంచ తెలుగు భాషాభిమానులంతా హర్షించేలా, తెలుగు భాష కోసం కృషి చేస్తున్నవారిని అన్ని విధాలుగా ఆదుకొనే రీతిలో ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకల్లో మంచి పథకాలను ప్రకటిస్తా అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. తెలుగు భాషోన్నతికి, సారస్వత అభివృద్ధికోసం చారిత్రాత్మక నిర్ణయాలను వెలువరిస్తామని తెలిపారు. తాము తీసుకొనే నిర్ణయాలు యావత్ప్రపంచంలోని మాతృభాషాభిమానులను సంతోషపరుస్తాయని అన్నారు. ఆదివారం ప్రపంచ తెలుగు మహాసభల మూడోరోజున మరింగంటి సింగరాచార్యుల ప్రాంగణం (తెలంగాణ సారస్వత పరిషత్)లోని శతావధాని కోరుట్ల కృష్ణమాచార్య వేదికపై జరుగుతున్న శతావధాన కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరయ్యారు. ఈ