bharath palleboina

మీ ఆల‌స్యం .. మాకు అన‌ర్ధం

తెలంగాణ స‌మ‌గ్రాభివృద్దికి ప్రాజెక్టుల నిర్మాణ‌మే శ‌ర‌ణ్యం అని మా ప్ర‌భుత్వం నిర్మాణాలు చేప‌ట్టింది. కేంద్రం మాత్రం ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వ‌కుండా జాప్యం చేయ‌డం మూలంగా మా రాష్ట్ర బ‌డ్జెట్ మీద భారం ప‌డుతుంది. వెంట‌నే అన్ని ప్రాజెక్టుల‌కు అనుమ‌తులు ఇవ్వాల‌ని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు కేంద్ర జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రి నితిన్ గ‌డ్క‌రీని కోరారు. ఢిల్లీలో ప్రధానమంత్రి కృషి సించాయ్ యోజనలో భాగంగా ఏఐబీపీ (సత్వర సాగునీటి ప్రయోజన పథకం)పై కేంద్ర జలవనరుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అధ్యక్షతన జ‌రిగిన స‌మావేశానికి హ‌రీష్ రావు హాజ‌ర‌య్యారు. రైతుల క‌ష్టాల‌ను తీర్చేందుకు సాగునీటి

పెళ్లి పీట‌లెక్క‌నున్న‌ అనుష్క‌, కొహ్లీ

ప్రేమ‌లో మునిగిపోతున్న ప్ర‌ముఖ క్రికెట‌ర్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్క శ‌ర్మ‌లు త్వ‌ర‌లో ఒక్క‌టి కాబోతున్నారు. వ‌చ్చే డిసెంబ‌ర్ లో వీరి పెళ్లి జ‌ర‌గ‌నుంద‌ని, ఈ మేర‌కు పెళ్లికోసం క్రికెట్ కు కొన్నాళ్లు విరామం ప్ర‌క‌టించ‌నున్నాడ‌ని తెలుస్తుంది. గ‌త మూడేళ్లుగా వీరిద్ద‌రూ డేటింగ్ చేస్తున్నారు. శ్రీ‌లంక టెస్ట్ సిరీస్ త‌రువాత పెళ్లి ఉండొచ్చ‌ని అంటున్నారు.

ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో మీడియా సెల్

ముఖ్య‌మంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాల‌యం ప్ర‌గ‌తిభ‌వ‌న్ లో మీడియా సెల్ నిర్మాణానికి రూ.42 ల‌క్ష‌లు ప్ర‌భుత్వం మంజూరు చేసింది. ప్ర‌గ‌తిభ‌వ‌న్ నిర్మాణం త‌రువాత ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్ని కీల‌క స‌మీక్ష‌లు, స‌మావేశాలు అందులోనే నిర్వ‌హిస్తున్నారు. ఈ వివ‌రాలు ప్ర‌జ‌ల‌కు చేరేందుకు ఈ మీడియా సెల్ ఉప‌యోగప‌డుతుంది.

కేసీఆర్ గురించి దాదా త‌న పుస్త‌కంలో ..

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గురించి, ఆయ‌న గొప్ప‌త‌నం గురించి, తెలంగాణ గురించి ఆయ‌న క‌మిట్ మెంట్ మాజీ రాష్ట్ర‌ప‌తి ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ రాసిన ద కొలిష‌న్ ఇయర్స్ (సంకీర్ణ సంవ‌త్స‌రాలు) పుస్త‌కంలో వెలిబుచ్చిన అభిప్రాయం ఇప్పుడు దేశ రాజ‌కీయ నాయ‌కుల‌ను ఆక‌ర్షిస్తోంది. ప్ర‌ణ‌బ్ ముఖ‌ర్జీ కాంగ్రెస్ లో కీల‌క‌నేత‌. ఆయ‌న రాష్ట్ర‌ప‌తి కాక‌ముందు 2004లో టీఆర్ఎస్, కాంగ్రెస్ పొత్తుపెట్టుకుని స‌మైక్య రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలోకి వ‌చ్చాయి. రాష్ట్రంలో, కేంద్రంలో టీఆర్ఎస్ ప్ర‌భుత్వంలో చేరింది. యూపీఏ కూట‌మి అధికారంలోకి వ‌చ్చిన ఆ స‌మ‌యంలో ప‌ద‌వుల పంప‌కంలో ఎవ‌రికి ఏ మంత్రి ప‌ద‌వి ఇవ్వాలి అన్న విష‌యంలో కొంత సంధిగ్ధ‌త నెల‌కొంది.

మార్పు వెన‌క మ‌త‌ల‌బు ఇదీ

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో భ‌విష్య‌త్ లేద‌ని, అధినేత ఆదేశాల మేర‌కు కొత్త జెండా ఎత్తుకుంటున్న టీడీపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకోవ‌డం వెన‌క అత‌ని రాజ‌కీయ భ‌విష్య‌త్ ఆలోచ‌న‌లు చాలా ఉన్నాయి. ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని ముందుకు న‌డ‌ప‌డం అసాధ్యం. కాబ‌ట్టి కాంగ్రెస్ పార్టీలో చేరి రాజ‌కీయ భ‌విష్య‌త్ మీద ఆశ‌లు స‌జీవంగా ఉంచుకోవాల‌న్న‌దే రేవంత్ ఆలోచ‌న‌గా తెలుస్తుంది. అస‌లు రేవంత్ రాజ‌కీయ చ‌రిత్ర‌ను ఒక‌సారి ప‌రిశీలిస్తే దీని మీద పూర్తి అవ‌గాహ‌న వ‌స్తుంది. అన్ని పార్టీల అండ‌తో మిడ్జిల్ మండ‌ల జ‌డ్పీటీసీగా గెలిచిన రేవంత్ రెడ్డి మెల్ల‌గా చంద్ర‌బాబుకు చేరువై

సింగ‌రేణి వార‌సత్వ ఉద్యోగాల కోసం ..

ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీ మేరకు ఇన్వాలిడేషన్‌ ద్వారా వారసత్వ ఉద్యోగాల కల్పనకు సింగరేణి యాజమాన్యం కసరత్తు మొదలుపెట్టింది. ఈ నెల 30న సింగరేణి బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్ల సమావేశంలో ఇది ఆమోదం పొందే అవకాశం ఉంది. చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ (సీఎంఓ)తో కూడిన వైద్య నిపుణుల బృందంతో మెడికల్‌ బోర్డును ఏర్పాటు చేయనున్నారు. గతంలో మాదిరిగా ఇతర శాఖల అధికారులు మెడికల్‌ బోర్డులో ఉండకుండా చర్యలు తీసుకుంటున్నారు.

ఎక్క‌డికెళ్లాడ‌బ్బా ..గంట‌న్న‌ర గ‌యాబ్

పార్టీలు మార‌డం వ్య‌భిచారం కింద‌కే వ‌స్తుంద‌న్న తెలంగాణ తెలుగుదేశం పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మూడోసారి పార్టీ మార్పు ఖాయంగా క‌నిపిస్తోంది. తెలంగాణ‌లో తెలుగుదేశాన్ని నాశనం చేయ‌డ‌మే ధ్యేయంగా ముందుకు సాగుతున్న రేవంత్ ఈ రోజు ర‌హ‌స్యంగా త‌న రాక‌ను వ్య‌తిరేకిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ముఖ్య‌నేత‌లను క‌లిసిన‌ట్లు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో ఈ ఉద‌యం 10 గంట‌ల‌కు ఇంటి నుండి బ‌య‌ట‌కు వెళ్లిన రేవంత్ రెడ్డి 11.30 గంట‌ల వ‌ర‌కు ఎక్క‌డికి వెళ్లాడా అని టీడీపీ వ‌ర్గాలు ఆరా తీస్తున్నాయి. ఎన్టీఆర్ భ‌వ‌న్ కు వ‌చ్చే ముందు గంట‌న్న‌ర పాటు ఆయ‌న ఎవ‌రిని క‌లిశారు ? ఏం

23న క్యాబినెట్ భేటీ

ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. అసెంబ్లీ శీతాకాల సమావేశాలే ప్రధాన ఎజెండాగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు భేటీ కానుంది. అసెంబ్లీ, మండలిలో ప్రవేశపెట్టాల్సిన బిల్లులు, ప్రభుత్వం తరఫున చేయాల్సిన తీర్మానాలను ఈ సమావేశంలో ఖరారు చేస్తారు. సభలో చర్చించాల్సిన అంశాలు, ప్రభుత్వపరంగా సభలో ప్రస్తావించాల్సిన విషయాలపై చర్చిస్తారు. గతంలో జారీచేసిన ఎనిమిది ఆర్డినెన్స్‌లైన రహదారి అభివృద్ధి కార్పొరేషన్‌, పీడీ, గేమింగ్‌, వ్యాట్‌, దుకాణాలు – సముదాయాలు, ఎక్సైజ్‌, పట్టాదారు పాస్‌పుస్తకాల చట్ట సవరణకు సంబంధించిన బిల్లులను ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది.

పెట్టుబ‌డుల‌కు ఆస్ట్రేలియా కంపెనీల ఆస‌క్తి

ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు కు ఇటీవలే మంత్రి కేటీర్ మరియు కవిత సూచనల మేరకు నిజామాబాద్ ఎమ్మెల్లే గణేష్ గుప్తా మరియు తెరాస ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల అమెరికా నుండి 60 కంపెనీలను పెట్టుబడులకు ఒప్పించడంతో కేటీఆర్ 50 కోట్లు విడుదల చేయడం జరిగింది. దీనిలో భాగంగా ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ హబ్ ఏర్పాటు చేయడానికి పెట్టుబడులను ఆహ్వానించడానికి ఆస్ట్రేలియా లోని ప్రముఖ సంస్థలను తెరాస ఎన్ ఆర్ ఐ కో ఆర్డినేటర్ మహేష్ బిగాల మరియు తెరాస ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి కాసర్ల లు

ముప్ప‌య్యేండ్ల క‌ల .. మూడేండ్ల‌లో

ముప్ప‌య్యేండ్ల క‌ల్వ‌కుర్తి ఎత్తిపోత‌ల క‌ల‌ను తెలంగాణ ప్ర‌భుత్వం మూడేండ్ల‌లో సాకారం చేసింది. క‌ల్వ‌కుర్తి నీళ్ల‌తో ఈ ప్ర‌భుత్వం మీ కాళ్లు క‌డిగింది. నియోజ‌క‌వ‌ర్గంలోని సాగుకు యోగ్య‌మ‌యిన ప్ర‌తి ఎక‌రాకు నీళ్లు ఇవ్వ‌డ‌మే కాదు. తెలంగాణ‌లోని ప్ర‌తి ప్రాంతానికి నీళ్లిస్తాం అని రాష్ట్ర భారీ నీటిపారుద‌ల శాఖా మంత్రి హ‌రీష్ రావు అన్నారు. కల్వకుర్తి మండలం ఎలికట్ట సమీపంలో ఉన్న డీ-29 కాల్వ వద్ద కృష్ణాజలాలను మంత్రి ప్రత్యేకపూజలు నిర్వహించి విడుదలచేశారు. అనంతరం కల్వకుర్తి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బహిరంగసభలో మాట్లాడారు. ఎంజీకేఎల్‌ఐ పథకాన్ని మూడు దశాబ్దాలకిందట మొదలుపెట్టినా, అప్పుడు రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్, టీడీపీలు సాగునీరు