bharath palleboina

సామాజిక రుగ్మ‌త‌ల‌పై అఖిలేష్ అస్త్రం

దేశంలో నెల‌కొన్న పేద‌రికం, మ‌హిళ‌ల మీద హింస‌, నాణ్య‌మైన‌ విద్య‌, వైద్యం, ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం, సుర‌క్షిత నీరు వంటి 17 సామాజిక రుగ్మ‌త‌లు, అవ‌స‌రాల మీద భావి పౌరుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ఓ యువ‌కుడు న‌డుంక‌ట్టాడు. దేశం త‌ర‌పున ఇప్ప‌టికే రెండు సార్లు ఐక్య‌రాజ్య‌స‌మితిలో నాయ‌క‌త్వం వ‌హించిన సింగిరెడ్డి అఖిలేష్ రెడ్డి అదే స్పూర్థితో గోల్స్ ఆన్ వీల్సీ నినాదంతో 100 రోజుల్లో ల‌క్ష మంది ప్ర‌భుత్వ‌, ప్రైవేటు పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను క‌లుసుకుని అవ‌గాహ‌న క‌ల్పించేందుకు సిద్ద‌మయ్యాడు. ఇప్ప‌టికే యాబై వేల మందికి పైగా విద్యార్థుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించి ప్ర‌తిజ్క్ష చేయించాడు. దేశం ముందున్న స‌వాళ్ల‌ను, సామాజిక రుగ్మ‌త‌ల‌ను

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ

‘స్నేహమేరా జీవితం’ మూవీ రివ్యూ నటీనటులు- శివబాలాజీ, రాజీవ్ కనకాల, సుష్మ యార్లగడ్డ, సత్య తదితరులు సంగీతం-సునీల్ కశ్యప్ ఛాయాగ్రహణం- భరణి ధరన్ నిర్మాత: శివబాలాజీ రచన-దర్శకత్వం: మహేష్ ఉప్పుటూరి  శివబాలాజీ హీరోగా నటిస్తూ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించిన ‘స్నేహమేరా జీవితం’ సినిమా రిలీజైన ఈ సినిమా విశేషాలేంటో చూద్దాం పదండి. 80వ దశకం నేపథ్యంలో సాగే సినిమా ‘స్నేహమేరా జీవితం’. మోహన్ (శివబాలాజీ) అనే అనాథ అయిన కుర్రాడు.. చలపతి అనే కొంచెం డబ్బు, పొగరు బాగా ఉండి రాజకీయాల్లో ఒక వెలుగు వెలిగిపోవాలని చూసే మరో కుర్రాడు చలపతి (రాజీవ్ కనకాల).. వీళ్లిద్దరూ తమ మధ్య అంతరాల్ని పక్కన పెట్టేసి మంచి స్నేహితులుగా కొనసాగుతుంటారు. మోహన్.. చలపతికి చెందిన

మీ జాతాకాలు మా వ‌ద్ద ఉన్నాయి

అన్ని రాజ‌కీయ పార్టీల‌కు చెందిన అంద‌రి చ‌రిత్రా ప్ర‌భుత్వం వ‌ద్ద ఉంది. భూ రికార్డుల ప్ర‌క్రియ నిరంత‌రం సాగేది అని మ‌ల్లు భ‌ట్టి విక్ర‌మార్క అంటున్నారు. తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి సొంతూరులో ఆయన తండ్రి 15 ఏళ్ల క్రితం విక్రయించిన భూమి వివరాలే ఇప్పటి వరకు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించలేదని, ఇది నాటి కాంగ్రెస్ ప్రభుత్వాల పనితీరుకు నిదర్శనం అని ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. ‘భూమి రికార్డుల శుద్ధీకరణ, నవీకరణ’ అంశంపై జరిగిన లఘుచర్చలో ఆయ‌న మాట్లాడారు. భూ కబ్జాలకు పాల్పడిన రాజకీయ పార్టీలకు చెందిన పత్రాలు, అందరి చరిత్రలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, అసైన్ట్

వాస్తు శిల్పి బీఎన్ రెడ్డి క‌న్నుమూత‌

మాజీ పార్లమెంటు సభ్యులు, వాస్తు శిల్పి బి.ఎన్. రెడ్డి(86) సోమవారం ఉదయం మరణించా రు. ఆయన భార్య, కుమారుడు, ముగ్గురు కుమార్తెలలో భార్య అలివేలు, కుమారుడు బి.సి.రెడ్డి కొంత కాలం క్రితం మృతిచెందారు. నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో 1931లో బి.ఎన్. రెడ్డి జన్మించారు. ఆయన మృధుభాషి, స్నేహశీలి. ఉస్మానియాలో ఇంజినీరింగ్, అమెరికా కొలోరాడో విశ్వవిద్యాలయంల నుండి ఎం.ఎస్. పట్టా స్వీకరించారు. చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజి(సిబిఐటి) సొసైటీకి చాలా కాలం చైర్మన్‌గా పని చేశారు. ఆయన మృతికి సంతాపంగా సిబిఐటికి సోమవారం సెలవు ప్రకటించి, పరీక్షలను వాయిదా వేశారు. హైదరాబాద్ నగరంలో పేద, మధ్యతరగతి కుటుంబాలకు జనతా

కారెక్కిన కంచ‌ర్ల‌

న‌ల్ల‌గొండ జిల్లాలో కీల‌క టీడీపీ నాయ‌కుడు కంచ‌ర్ల భూపాల్ రెడ్డి, ఆయ‌న సోద‌రుడు కృష్ణారెడ్డిలు మంత్రి కేటీఆర్ స‌మ‌క్షంలో టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. వేల మంది మ‌ద్ద‌తుదారుల స‌మ‌క్షంలో న‌ల్ల‌గొండ టీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జ్ గా కంచ‌ర్ల భూపాల్ రెడ్డిని నియ‌మిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. ఇప్ప‌టిదాకా పార్టీలో ఉన్న దుబ్బాక న‌ర్సింహారెడ్డికి త్వ‌ర‌లోనే కార్పోరేష‌న్ చైర్మ‌న్ ప‌ద‌వి ఇస్తామ‌ని అన్నారు. ఈ సంధ‌ర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలంతా టీఆర్‌ఎస్‌వైపే ఉన్నారని రాష్ట్రం ఏర్పాటైన దగ్గర నుంచి వచ్చిన అన్ని ఉప ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ప్రజలు బహ్మరథం పట్టడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో రికార్డుస్థాయి విజయాన్ని

కేసీఆర్ లాంటి ముఖ్య‌మంత్రి లేడు

అనేక మంది ముఖ్య‌మంత్రులు పూజ‌ల‌కు వ‌చ్చిన‌ప్పుడు ఎన్నో హామీలు ఇస్తారు. ఆ త‌రువాత బొట్టు తుడుచుకున్నంత వేగంగా దానిని విస్మ‌రిస్తారు. కానీ కేసీఆర్ మాత్రం అలా కాదు. అలాంటి ముఖ్య‌మంత్రి మ‌రొక‌రు లేరు. త‌క్కువ‌గా మాట్లాడి ఎక్కువ ప‌ని చేస్తారు అని విశాఖ శారదా పీఠాధిపతి స్వామీ స్వరూపానందేంద్ర సరస్వతి అన్నారు. కార్తీక సోమవారం సందర్భంగా వరంగల్ వేయి స్తంభాల గుడిలో రుద్రేశ్వరుడి లక్ష బిల్వార్చనలో పాల్గొన్నారు. అంతకుముందు స్వామివారికి క్షీరాభిషేకం చేశారు. దేశం లో ఏ ముఖ్యమంత్రీ చేయని విధంగా రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాల కోసం ఆయుత చండీయాగం చేసి హిందూ సనాతన ధర్మాన్ని కాపాడుతున్నారని స్వామి

చిరంజీవి ఇంట్లో దొంగ‌త‌నం

కేంద్ర మాజీ మంత్రి, ప్రముఖ నటుడు చిరంజీవి నివాసంలో దొంగ‌త‌నం జరిగింది. రూ. 2 లక్షల నగదు చోరీ అయినట్లు గుర్తించారు. చోరీ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశామని చిరంజీవి మేనేజర్ మీడియాకు తెలిపారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా చిరంజీవి ఇంటి పనిమనిషి చెన్నయ్యను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిరంజీవి ఇంట్లో చెన్నయ్య గత పదేళ్లుగా సర్వర్‌గా పనిచేస్తున్నారు. ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. కొద్దికాలంగా చిరంజీవి ఇంట్లో చిన్నయ్య పలు విడతలుగా నగదు చోరీకి పాల్పడినట్లుగా కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో పోయిన మొత్తం కేవలం రెండు లక్షలేనా.. ఇంకా ఎక్కువ ఉందా అని

ఏం చేయ‌బోతున్నాం.. గుట్టువిప్పిన రేవంత్

తెలంగాణ‌లో భ‌విష్య‌త్ లో ఏం జ‌ర‌గ‌బోతుంది ? తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు విఫ‌ల‌య‌త్నాలు చేసిన ఆంధ్రా పెట్టుబ‌డిదారి వ‌ర్గాలు, కేసీఆర్ వ్య‌తిరేక వ‌ర్గాలు ఇక ముందు ఏం చేయ‌బోతున్నాయి ? తెలంగాణ‌లో తెలుగుదేశం పార్టీని చంద్ర‌బాబు నాయుడు ఎందుకొర‌కు భూస్థాపితం చేయ‌బోతున్నాడు ? అస‌లు ఆంధ్రా తెలంగాణ రాజ‌కీయాల‌లో 2019లో ఏం జ‌ర‌గ‌నుంది వంటి అనుమానాల‌కు టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేర‌బోతున్న రేవంత్ రెడ్డి స‌మాధానాలు చెప్పాడు. కాంగ్రెస్ నాయ‌కుల ఆత్మీయ వేదిక మీద చంద్ర‌బాబునాయుడిని మెచ్చుకుంటూ, ఆంధ్రా అభివృద్దిని ఆకాశానికి ఎత్తుతూ తెలంగాణ మీద లేని ప్రేమ‌ను ప్ర‌క‌టించి తామంద‌రి వ్యూహం ఏంటి అన్న

ఆట‌..మాట‌ల మ‌ధ్య ``ఏమి సేతురా`` పాట

సినిమాకు క్లాప్ కొట్టినప్పటినుంచీ.. విడుద‌ల చేసే వ‌ర‌కూ ప్ర‌తీ సంద‌ర్భమూ ప్ర‌మోష‌న్‌కు ఉప‌యోగించుకోద‌గ్గ‌దే. పోస్ట‌ర్‌, టీజ‌ర్‌, ఆడియో రిలీజ్ ఫంక్ష‌న్ల‌ను ఒక రేంజ్‌లో చేస్తారు. సినిమా ప్ర‌చారం వినూత్న పంథాలో సాగుతున్న నేటికాలంలో ప్ర‌మోష‌న్స్ కోసం ఎన్నోకార్య‌క్ర‌మాలు, వ్య‌య‌ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు.  ఈ ట్రెండ్‌కు భిన్నంగా బిగ్‌బాస్ ఫ‌స్ట్ సీజ‌న్ విన్న‌ర్ శివ‌బాలాజీ తాను హీరోగా న‌టించిన సినిమా “ స్నేహ‌మేరా జీవితం“ ఆడియో విడుద‌ల‌ను వినూత్నంగా, అతిసామాన్యంగా చేస్తున్నారు. ఒక్కో పాట విడుద‌ల‌కు ఒక్కో ప్ర‌త్యేక‌ సంద‌ర్భాన్ని, ప్ర‌త్యేక‌త‌ను జోడిస్తూ..న‌యా ట్రెండ్ సెట్ చేస్తున్నారు. బిగ్‌బాస్ ఫినాలే త‌రువాత ఎక్క‌డ చూసినా శివ‌బాలాజీ టాపిక్కే! హీరోగా ఎన్నో హిట్

డామిట్ క‌థ అడ్డం తిరిగిందా

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పార్టీ మార్చే ఎపిసోడ్ ఇంకా కొన‌సాగుతుంది. విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆ పార్టీ అధ్య‌క్షుడు, ఆంధ్రా ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు లండ‌న్ నుండి రేవంత్ వ్య‌వ‌హారంలో ప‌లు కీల‌క ఆదేశాలు జారీ చేసిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతుంది. తాను వ‌చ్చే వ‌ర‌కు రేవంత్ హోదాను క‌ట్ చేస్తున్నాన‌ని, ఆయ‌న ఎలాంటి స‌మావేశాలు నిర్వ‌హించినా పార్టీకి సంబంధం లేదు. ఎవ‌రూ వెళ్లొద్ద‌ని, ఆయ‌న‌ను సాధార‌ణ ఎమ్మెల్యేగానే చూడాల‌ని ఆదేశించిన‌ట్లు స‌మాచారం. అయితే ఇక్క‌డే రేవంత్ వ్య‌వ‌హారం మ‌లుపు తిరిగిన‌ట్లు తెలుస్తుంది. పార్టీ శాస‌న‌స‌భా ప‌క్ష నేత‌గా రేపు అసెంబ్లీలో టీడీఎల్పీ