October 11, 2018

కూట‌మి సీటులో విద్యార్థి ఓట‌మి

ఉద్యమాల పురిటిగడ్డ ఉస్మానియా.. తెలంగాణ శౌర్యాన్ని చూపి న కాకతీయ.. నాటి, నేటితరం నాయకుల్లో ఎక్కువ మంది ఈ యూనివర్సిటీల్లో నాయకత్వలక్షణాలను పుణికిపుచ్చుకున్నవారే. మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ అనేకమంది విద్యార్థులు ప్రత్యేక రాష్ట్రం కోసం బలిదానాలు చేశారు. వారి త్యాగాలను గుర్తించిన టీఆర్‌ఎస్.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన తొలి ఎన్నికల్లో అనేకమంది విద్యార్థి సంఘం నాయకులకు రాజకీయంగా భరోసా కల్పించింది. సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యే, ఎంపీ టికెట్లు ఇవ్వడంతోపాటు, అధికారంలోకి వచ్చాక అనేక నామినేటెడ్ పోస్టుల్లోనూ వారికి అవకాశం కల్పించింది. కానీ, విద్యార్థి సంఘాలను రెచ్చగొడుతూ రాజకీయంగా సొమ్ము చేసుకొనేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్, టీడీపీ, తెలంగాణ జనసమితి,

శ్రీశైలం కబ్జా

కృష్ణాజలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ వ్యవహరిస్తున్న తీరు శ్రుతి మించుతున్నది. కృష్ణా బోర్డు అండ చూసుకొని అడ్డగోలుగా రెచ్చిపోతున్నది. పోతిరెడ్డిపాడు ద్వారా ఇష్టానుసారంగా నీటిని తరలిస్తున్నా ఆ రాష్ట్రం జలదాహం మాత్రం తీరడం లేదు. మొత్తం శ్రీశైలం జలాశయాన్నే చెరబట్టి.. తెలంగాణ నీటి విడుదలను సైతం అడ్డుకొనేందుకు కుయుక్తులు పన్నుతున్నది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా రెండురోజులుగా తెలంగాణకు విడుదల చేస్తున్న నీటిని వెంటనే నిలిపివేసేలా ఉత్తర్వులు జారీచేయాలంటూ ఏపీ జలవనరులశాఖ ఈఎన్సీ కృష్ణాబోర్డుకు లేఖ రాయడం వివాదాస్పదంగా మారింది. బోర్డు అనుమతి లేకుండా వంద టీఎంసీలకుపైగా నీటిని తరలించుకుపోవడమే కాకుండా తెలంగాణకు వాస్తవంగా రావాల్సిన నీటిని నిలిపివేయాలంటూ

ప‌ది ల‌క్ష‌ల మందికి కండ్ల‌ద్దాలు

అంధత్వరహిత తెలంగాణ సాధన దిశగా ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమంలో బుధవారం నాటికి దాదాపు పది లక్షలమందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. కంటివెలుగు ప్రారంభమైన నాటినుంచి మొత్తం 35 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా 2,903 గ్రామాలు, 202 వార్డుల్లో నిర్వహించిన వైద్య శిబిరాల్లో 51,66,689 మందికి కంటి పరీక్షలు చేశారు. 9,98,797 మందికి రీడింగ్ అద్దాలను అందజేశారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా 1,17,717 మందికి పరీక్షలు చేశారు. గ్రేటర్ హైదరాబాద్‌లో కంటి వెలుగు దిగ్విజయంగా సాగుతున్నది. 30 సర్కిళ్ల పరిధిలో బుధవారంనాటికి 10,49,718 మం దికి కంటి పరీక్షలు నిర్వహించారు. బుధవారం 24,017 మందికి నేత్ర పరీక్షలు నిర్వహించినట్టు