మౌన‌మే కేసీఆర్ ఆయుధం

మౌన‌మే కేసీఆర్ ఆయుధం

కేంద్రం మీద అసంతృప్తితో ఆంధ్రా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు పార్ల‌మెంటులో ఎన్డీఎ ప్ర‌భుత్వం మీద అవిశ్వాస‌తీర్మానం ప్ర‌వేశ‌పెట్టాడు. ప్ర‌త్యేక‌హోదాకు బ‌దులు ప్యాకేజీకి ఒప్పుకున్న చంద్ర‌బాబు తీరును ఆంధ్రా ప్ర‌తిప‌క్ష నేత వైఎస్ జ‌గ‌న్ ప్ర‌జ‌ల ముందు దోషిగా నిల‌బెట్టాడు. హోదాకు ప‌ట్టుబ‌ట్ట‌క‌పోవ‌డం మూలంగా ఆంధ్రా అన్ని రంగాల‌లో వెన‌క‌బ‌డుతుంద‌ని ప్ర‌జ‌లు న‌మ్మారు. చంద్ర‌బాబుకు ఆంద్రాలో తీవ్ర వ్య‌తిరేక‌త పెరిగిపోయింది. దీంతో ప్ర‌జ‌ల దృష్టి మ‌ర‌ల్చేందుకు ఎన్డీఎ నుండి బ‌య‌ట‌కు వ‌చ్చి త‌న ఎంపీల‌తో నిర‌స‌న‌ల డ్రామా ఆడించాడు. తాజాగా అవిశ్వాసం పేరుతో మ‌రోసారి పిల్లిమొగ్గ‌లు వేశాడు. త‌న అనుకూల మీడియాతో దేశంలో ఏదో ఉప‌ద్ర‌వం రాబోతుంద‌న్న ప్ర‌చారం క‌ల్పించాడు. ఆఖ‌రుకు అవిశ్వాసం వీగి బాబు పార్ల‌మెంటు సాక్షిగా దేశం ముందు న‌వ్వుల పాల‌య్యాడు. ప్ర‌త్యేక‌హోదా రాద‌ని తెలిసే చంద్ర‌బాబు ప్యాకేజీకి ఒప్పుకున్నాడు. ఇప్పుడు మ‌ళ్లీ ప్ర‌త్యేక‌హోదా పాట అందుకున్నాడు.

ఈ అవిశ్వాసానికి మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని అనేక పార్టీల‌ను చంద్ర‌బాబు కోరాడు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఈ స‌మ‌యంలో వ్యూహాత్మ‌క మౌనం పాటించి అవిశ్వాసానికి దూరంగా ఉండి తెలంగాణ గౌర‌వాన్ని, త‌న గౌర‌వాన్ని పార్ల‌మెంటు సాక్షిగా దేశ ప్ర‌ధాని నోట వ‌చ్చేలా చేసి త‌న చాణ‌క్య‌నీతిని చాటుకున్నారు. అవిశ్వాసం మూలంగా ఎన్డీఎ ప్ర‌భుత్వానికి వ‌చ్చే న‌ష్టం ఏమీ లేదు. ఇప్ప‌టికిప్పుడు ప్ర‌భుత్వం కూలిపోయే ప‌రిస్థితి లేదు. అలాంటిదానికి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం మూలంగా తెలంగాణ‌కు ఒరిగేది ఏం లేద‌ని కేసీఆర్ కు తెలుసు. అందుకే అవిశ్వాస చ‌ర్చ‌లో తెలంగాణ‌కు విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం రావాల్సిన వాటిని డిమాండ్ చేయించారు. తెలంగాణ ఏర్పాటు అశాస్త్రీయం అన్న టీడీపీ ఎంపీల‌కు ఘాటుగా నిర‌స‌న తెలిపారు.

తెలంగాణ – ఆంధ్ర ఏర్ప‌డే నాటికి కేంద్రంతో తెలంగాణ ప్ర‌భుత్వానికి స‌త్సంబంధాలు లేవు. తెలంగాణ ఏర్ప‌డిన వెంట‌నే తెలంగాణ‌లోని ఏడు మండ‌లాల‌ను ఆంధ్ర‌లో క‌లిపేశారు. తెలంగాణ‌కు సంబంధించిన అనేక విష‌యాల‌లో తొలి రోజుల‌లో కేంద్రం నుండి స‌హ‌కారం ల‌భించ‌లేదు. ఈ అడ్డంకులు అన్నింటిని అధిగ‌మించి తెలంగాణ అభివృద్దిని ప‌రుగులు పెట్టించారు కేసీఆర్. అటు కేంద్రంలోని ఎన్డీఎ ప్ర‌భుత్వంలో అధికారం పంచుకుంటూ ఆంధ్రాకు అనేక నిధులు పొందిన చంద్ర‌బాబు నాయుడు ఇచ్చిన నిధుల‌కు లెక్క‌లు చెప్ప‌కుండా తిరిగి కేంద్రాన్నే నిందిస్తూ వ‌చ్చారు. చివ‌ర‌కు కేంద్రంతో సంబంధాలు తెంచుకుని ఆంధ్రాలో బీజేపీని మోస‌కారి పార్టీగా, మోడీని దోషిగా చూపెట్టే ప్ర‌య‌త్నం చేస్తూ వ‌స్తున్నారు. గ‌త నాలుగేళ్లుగా కేసీఆర్ ప‌నితీరు, ప్ర‌భుత్వ ప‌థ‌కాలు, ఆంధ్రాలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వ ప‌నితీరును కేంద్ర ప్ర‌భుత్వం గ‌మ‌నిస్తూ వ‌స్తుంది. ఇటీవ‌లి చంద్ర‌బాబు తీరుతో అత‌ని నైజం బ‌య‌ట‌ప‌డింది. దీంతో ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీకి ఎవ‌రు ఏంటి అన్న‌ది తేలిపోయింది.

తెలంగాణ ఆంధ్ర విభ‌జ‌న త‌రువాత అనేక స‌మ‌స్య‌లు వ‌చ్చాయి. చంద్ర‌బాబు నాయుడు పేచీ పెడుతూ పోతే .. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో ప‌రిణ‌తితో వ్య‌వ‌హ‌రించి తెలంగాణ అభివృద్ది మీద దృష్టి సారించారు. పార్ల‌మెంటు సాక్షిగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోడీ చెప్పిన ఈ మాట‌లు చంద్ర‌బాబు వైఫ‌ల్యాన్ని, కేసీఆర్ గొప్ప‌త‌నాన్ని దేశానికి చాటింది. క్రితం ప‌ర్య‌ట‌న‌లో అమిత్ షా ఆరోప‌ణ‌ల‌ను అంతే తీవ్రంగా తిప్పికొట్టిన కేసీఆర్, 2014 ఎన్నిక‌ల్లో త‌ల్లిని చంపి బిడ్డ‌ను బ‌తికించార‌న్న వ్యాఖ్య‌ల‌ను అంతే ఘాటుగా తిప్పికొట్టారు. స‌రిగ్గా నాలుగేళ్ల‌లో స్నేహితుడిగా ఉన్న చంద్ర‌బాబు ఎన్డీఎకు శ‌తృవుగా మిగిలితే .. ప్ర‌తిప‌క్షంగా ఉన్న కేసీఆర్ ఓ రాజ‌నీతిజ్ఞుడిలా (secular king) నిల‌బ‌డ్డాడు. మౌనం కూడా కొన్ని సార్లు మంచే చేస్తుంద‌ని కేసీఆర్ తీరుతో తేలిపోయింది.

 

(Visited 423 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *