ప‌రిపూర్ణానంద బ‌హిష్క‌ర‌ణ‌

ప‌రిపూర్ణానంద బ‌హిష్క‌ర‌ణ‌

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు.

క‌త్తి మ‌హేష్ శ్రీ‌రాముని గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ధ‌ర్మ‌యాత్ర చేస్తాన‌న్న ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకుని గృహ‌నిర్భంధం విధించారు. దీనిని త‌ప్పుబ‌డుతూ తెలంగాణ‌లో ఉద్రిక్త‌త‌ల‌కు తావిచ్చేందుకు ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నగరం నుంచి తరలించారు. ఆయ‌న‌ను ఎక్క‌డికి త‌ర‌లించారు అన్న విష‌యం పోలీసులు వెల్ల‌డించ‌లేదు.

(Visited 119 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *