ఆ భావి హీరోల‌కు బంప‌ర్ అఫ‌ర్

ఆ భావి హీరోల‌కు బంప‌ర్ అఫ‌ర్

థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన 12 మంది హీరోలకు ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సాధించిన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ పోగ్బా ప్రకటించాడు. తొలి సెమీఫైనల్లో 1-0 తేడాతో బెల్జియంపై ఫ్రాన్స్ గెలుపొందింది. సెమీఫైనల్లో గెలవడంతో ఫ్రాన్స్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గుహ నిర్బంధంలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు ఫైనల్‌ మ్యాచ్‌ని చూసేందుకు రావాలంటూ ఆహ్వానించారు.

మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఫ్రాన్స్‌ క్రీడాకారుడు పాల్ ‘ మ్యాచ్ విజయాన్ని థాయలాండ్‌ బాలల ఫుట్‌బాల్‌ జట్టుకు అంకితమిస్తూ ట్విట్ చేశాడు. 12 మంది బాలల ఫొటోలను కూడా పాల్‌ ట్వీట్ చేశాడు. బుధవారం జరిగే రెండో సెమీఫైనల్లో ఇంగ్లాండ్‌-క్రియేషియా పోటీపడనున్నాయి. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు ఆదివారం జరిగే ఫైనల్లో ఫ్రాన్స్‌తో తలపడనుంది.

(Visited 59 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *