బాబు ఒక్క సమాధానం చెబితే చాలు

బాబు ఒక్క సమాధానం చెబితే చాలు

నేను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానాలు చెబితే నేను రాజకీయాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతాను అని టీడీపీ బ‌హిష్కృత నేత‌, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు స‌వాల్ విసిరారు. ఏ తప్పూ చేయని తనను మోసం చేశారని మండిపడ్డారు. తానేం అన్యాయం చేశానో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెబితే రాజ‌కీయాలు వ‌దిలేస్తాన‌ని అన్నారు.

ఒక్కో రాజ్యసభ సీటును రూ. 100 కోట్లకు అమ్ముకున్న ఘనత చంద్రబాబుదని మోత్కుప‌ల్లి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటం కాదని… అధర్మ పోరాటమని .. ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోవాలని తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడిని కోరుకుంటాన‌ని అన్నాడు. తిరుమ‌ల ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన తిరుపతిలో అంబేద్కర్, జగ్జీవన్ రామ్, పూలే, ఎన్టీఆర్ విగ్రహాలకు పూల‌మాల‌లు వేసి నివాళులు అర్పించారు.

(Visited 127 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *