కాంగ్రెస్ : గుడి ఎన‌కా నా సామి

కాంగ్రెస్ : గుడి ఎన‌కా నా సామి

దూడ‌ను చీక‌మ‌న‌డం .. బ‌ర్రెను త‌న్న‌మ‌న‌డం కాంగ్రెస్ పార్టీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఒక‌వైపు సామాజిక న్యాయం, బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం అంటూ వేదిక‌ల ఉప‌న్యాసాలు దంచే కాంగ్రెస్ పార్టీ నేత‌లు .. తెర వెన‌క మాత్రం గుడి ఎన‌క నా సామి వేశాలు మాన‌డం లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మార్కెట్ క‌మిటీల‌లో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అన్ని వ‌ర్గాల‌కు ప‌ద‌వులు ద‌క్కేలా చూశారు.

ఇక‌ పంచాయతీరాజ్, స్థానిక‌ సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడంద్వారా తెలంగాణలో మొత్తం 61% రిజర్వేషన్లు అమలుచేయాల‌ని కేసీఆర్ భావించారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని వ్య‌తిరేకిస్తూ కాంగ్రెస్ పార్టీ హైకోర్టులో పిటీష‌న్ వేసింది. మెద‌క్ జిల్లా ఆంధోల్ మండ‌లం పోసానిపేట గ్రామ స‌ర్పంచ్ స్వ‌ప్నారెడ్డి గ‌తంలో సుప్రీం కోర్టు తీర్పు ప్ర‌కారం రిజ‌ర్వేష‌న్లు 50 శాతం మించ‌కూడ‌ద‌ని పిటీష‌న్ దాఖ‌లు చేశారు. ఆమె పిటీష‌న్ విచారించిన హైకోర్టు తాజా ఉత్త‌ర్వుల‌ను వెలువ‌రించింది. దీంతో స్థానిక ఎన్నిక‌లు ఆగిపోయాయి.

అయితే గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన అనుమతి ఉత్తర్వులను పునరుద్ధరించాల్సిందిగా కోరాలని కేసీఆర్ నిర్ణయించారు. దీనికి అవసరమైన కసరత్తు చేసి, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడానికి బుధవారం క్యాబినెట్ సబ్‌కమిటీ సమావేశం కావాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అడ్వకేట్ జనరల్‌తోపాటు సంబంధిత అధికారులను కూడా ఈ సమావేశానికి పిలిచి, అన్ని విషయాలను కూలంకషంగా చర్చించాలని, పూర్వాపరాలను సమగ్రంగా పరిశీలించాలని సూచించారు. రాష్ట్రంలోని పంచాయతీరాజ్ సంస్థల్లో 61% రిజర్వేషన్లు అమలుచేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పే విధంగా వాదనలు ఖరారు చేయాలని కేసీఆర్ ఆదేశించారు. అయితే త‌న‌కు ఎలాంటి అభ్యంత‌రాలు లేవ‌ని చెబుతున్న స్వ‌ప్నారెడ్డి ప్ర‌భుత్వం సుప్రీంకు వెళితే తాను వెళ్తాన‌ని స్ప‌ష్టం చేయ‌డం గ‌మ‌నార్హం. అయితే మాజీ ఉప ముఖ్య‌మంత్రి దామోద‌ర రాజ‌న‌ర్సింహ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఈమెను వెన‌కుండా కాంగ్రెస్ పెద్ద‌లే న‌డిపిస్తున్నార‌ని స‌మాచారం. మ‌ల్ల‌న్న‌సాగ‌ర్ మీద కూడా దామోద‌ర రాజ‌న‌ర్సింహ గ‌తంలో అనేక పిటీష‌న్లు వేసి అడ్డుకునేందుకు విఫ‌ల‌యత్నాలు చేసిన విష‌యం తెలిసిందే. ఒక‌వైపు అంద‌రికీ న్యాయం అంటున్న కాంగ్రెస్ నేత‌ల మాట‌ల్లో నిజం ఎంతుందో బీసీల‌కు సంబంధించిన ఈ రిజ‌ర్వేష‌న్ల పిటీష‌న్ తో తేలిపోయింది.

(Visited 280 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *