July 11, 2018

సహనమే భూషణం

మనదేశం అభివృద్ధి పథం వైపు వేగంగా దూసుకుపోతున్న ఈ కీలక తరుణమందు మతం కేంద్రంగా పరిభ్రమిస్తున్న వరుస సంఘటనలు ప్రపంచ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నది. ఈ సంఘటనలు పునరావృతమవుతూ ఉంటే నల్లేరుపై నడకలా సాగుతున్న జీవన స్రవంతికి గండిపడే అవకాశం వుంది. మొదటినుంచి ఈ కర్మభూమిలో సనాతన ధర్మం కేంద్రంగా హిందూ మతం వెల్లివిరుస్తూ వుంది అంటే అందులో అతిశయోక్తి లేదు. నిజానికి హిందూ మత స్థాపకులు ప్రత్యేకించి ఎవరూ లేరు. ఈ దేశ సంస్కృతి ఆచార వ్యవహార సంప్రదాయాలు, ధర్మము ఒక తరం నుంచి మరొక తరానికి వారసత్వంగా అందించుట వలన నేటికి హిందూ ధర్మం

జాగృతి యూకే ఇషా ఫౌండేషన్ యోగ శిక్షణ

సామజిక సేవ దృక్పధం తో దూసుకువెళ్తున్న తెలంగాణ జాగృతి యునైటెడ్ కింగ్డమ్ మరో అడుగు ముందుకు వేస్తూ ప్రముఖ ఇషా ఫౌండేషన్ సద్గురు పిలుపు మేరకు తెలంగాణ లో యోగ కార్యక్రమన్ని ప్రతి మారు మూలకు తీసుకువెళ్లి యోగ ప్రాముఖ్యత పాటు మనిషి జీవితం లో యోగ సాధన ద్వారా కలిగే మార్పుల గురించి అవగాహనా కల్పించడమే ద్యేయంగా ప్రత్యక్షంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత యోగ శిక్షణ శిబిరాలను నిర్వహించారు. యునైటెడ్ కింగ్డమ్ జాగృతి దానిని అంది పుచ్చుకొని యూకే లో ఉంటున్న ప్రవాస భారతీయులతో కాకుండా ఇక్కడ ప్రజానీకానికి యోగ స్ఫూర్తి కలిగించే విదంగా వెస్ట్

ఆ భావి హీరోల‌కు బంప‌ర్ అఫ‌ర్

థాయ్‌లాండ్‌లో గుహ నిర్బంధంలో చిక్కుకుని సురక్షితంగా బయటపడిన 12 మంది హీరోలకు ఫిఫా ప్రపంచకప్‌ సెమీఫైనల్లో సాధించిన విజయాన్ని అంకితమిస్తున్నట్లు ఫ్రాన్స్‌ ఆటగాడు పాల్‌ పోగ్బా ప్రకటించాడు. తొలి సెమీఫైనల్లో 1-0 తేడాతో బెల్జియంపై ఫ్రాన్స్ గెలుపొందింది. సెమీఫైనల్లో గెలవడంతో ఫ్రాన్స్‌ ఫైనల్లోకి అడుగు పెట్టింది. గుహ నిర్బంధంలో చిక్కుకున్న 12 మంది ఫుట్‌బాల్‌ జట్టు ఆటగాళ్లు ఫైనల్‌ మ్యాచ్‌ని చూసేందుకు రావాలంటూ ఆహ్వానించారు. మ్యాచ్‌ గెలిచిన తర్వాత ఫ్రాన్స్‌ క్రీడాకారుడు పాల్ ‘ మ్యాచ్ విజయాన్ని థాయలాండ్‌ బాలల ఫుట్‌బాల్‌ జట్టుకు అంకితమిస్తూ ట్విట్ చేశాడు. 12 మంది బాలల ఫొటోలను కూడా పాల్‌ ట్వీట్ చేశాడు.

బాబు ఒక్క సమాధానం చెబితే చాలు

నేను అడిగిన ప్ర‌శ్న‌ల‌కు చంద్ర‌బాబు స‌మాధానాలు చెబితే నేను రాజకీయాల‌కు శాశ్వ‌తంగా గుడ్ బై చెబుతాను అని టీడీపీ బ‌హిష్కృత నేత‌, మాజీ మంత్రి మోత్కుప‌ల్లి న‌ర్సింహులు స‌వాల్ విసిరారు. ఏ తప్పూ చేయని తనను మోసం చేశారని మండిపడ్డారు. తానేం అన్యాయం చేశానో చంద్రబాబు చెప్పాలని డిమాండ్ చేశారు. తన ప్రశ్నలకు చంద్రబాబు సమాధానాలు చెబితే రాజ‌కీయాలు వ‌దిలేస్తాన‌ని అన్నారు. ఒక్కో రాజ్యసభ సీటును రూ. 100 కోట్లకు అమ్ముకున్న ఘనత చంద్రబాబుదని మోత్కుప‌ల్లి ఆరోపించారు. చంద్రబాబు చేస్తున్నది ధర్మ పోరాటం కాదని… అధర్మ పోరాటమని .. ఆయ‌న ఎన్నిక‌ల్లో ఓడిపోవాలని తిరుమ‌ల వెంక‌టేశ్వ‌రుడిని కోరుకుంటాన‌ని అన్నాడు.

కాంగ్రెస్ : గుడి ఎన‌కా నా సామి

దూడ‌ను చీక‌మ‌న‌డం .. బ‌ర్రెను త‌న్న‌మ‌న‌డం కాంగ్రెస్ పార్టీకి వెన్న‌తో పెట్టిన విద్య‌. ఒక‌వైపు సామాజిక న్యాయం, బ‌డుగుబ‌ల‌హీన వ‌ర్గాల‌కు రాజ్యాధికారం అంటూ వేదిక‌ల ఉప‌న్యాసాలు దంచే కాంగ్రెస్ పార్టీ నేత‌లు .. తెర వెన‌క మాత్రం గుడి ఎన‌క నా సామి వేశాలు మాన‌డం లేదు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చిన త‌రువాత మార్కెట్ క‌మిటీల‌లో రిజ‌ర్వేష‌న్లు అమ‌లు చేసి సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకుని అన్ని వ‌ర్గాల‌కు ప‌ద‌వులు ద‌క్కేలా చూశారు. ఇక‌ పంచాయతీరాజ్, స్థానిక‌ సంస్థల్లో బీసీలకు 34% రిజర్వేషన్లు ఇవ్వడంద్వారా తెలంగాణలో మొత్తం 61% రిజర్వేషన్లు అమలుచేయాల‌ని కేసీఆర్ భావించారు. అయితే ఈ నిర్ణ‌యాన్ని

ప‌రిపూర్ణానంద బ‌హిష్క‌ర‌ణ‌

శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానందను నగర బహిష్కరణ చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు ప్రకటించారు. ఈమేరకు జూబ్లీహిల్స్‌లో గృహనిర్బంధంలో ఉన్న ఆయనను అదుపులోకి తీసుకుని ఇంటి నుంచి తరలించారు. అయితే ఆయనను ఎక్కడికి తరలించారనే విషయాన్ని మాత్రం పోలీసులు స్పష్టం చేయలేదు. ఆయన ఆరు నెలల పాటు నగరంలోకి ప్రవేశించకూదని పోలీసులు నోటీసులో పేర్కొన్నారు. క‌త్తి మ‌హేష్ శ్రీ‌రాముని గురించి అనుచిత వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో ధ‌ర్మ‌యాత్ర చేస్తాన‌న్న ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నాన్ని పోలీసులు అడ్డుకుని గృహ‌నిర్భంధం విధించారు. దీనిని త‌ప్పుబ‌డుతూ తెలంగాణ‌లో ఉద్రిక్త‌త‌ల‌కు తావిచ్చేందుకు ప‌రిపూర్ణానంద ప్ర‌య‌త్నించారు. ఈ నేప‌థ్యంలో ముందుగా ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు ఈరోజు తెల్లవారుజామున నగరం