ఈ క‌త్తుల వెన‌క‌ కుట్ర‌లేంటో ?

ఈ క‌త్తుల వెన‌క‌ కుట్ర‌లేంటో ?

స్వామీ ప‌రిపూర్ణానంద‌. గ‌త కొంత కాలంగా తెలంగాణ‌లో విస్తృతంగా ప‌ర్య‌టిస్తున్న ఈ స్వామి తెలంగాణ ప్ర‌భుత్వం మీద కొన్నాళ్లుగా ప‌లు రకాల ఆరోప‌ణ‌లు చేస్తూ వ‌స్తున్నాడు. శ్రీ‌రాముని గురించి క‌త్తి మ‌హేష్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లతో హిందువుల మ‌నోభావాలు దెబ్బ‌తీసిన నేప‌థ్యంలో హైద‌రాబాద్ నుండి యాద‌గిరిగుట్ట‌కు పాద‌యాత్ర చేప‌డ‌తానంటూ ప్ర‌క‌టించ‌డం వివాదాస్ప‌దంగా మారింది. క‌త్తి మ‌హేష్ అనే వ్య‌క్తిని సాకుగా చూపి యాత్ర‌కు శ్రీ‌కారం చుట్ట‌డం వెన‌క అనేక అనుమానాలు క‌లుగుతున్నాయి.

ఇక సినీ విమ‌ర్శ‌కుడిగా వివాదాస్ప‌ద ప్ర‌వ‌ర్త‌న‌, వ్యాఖ్యాల‌తో ఈ మ‌ధ్య మీడియాలో ఫేమ్ అయిన క‌త్తి మ‌హేష్ శ్రీ‌రాముడి మీద చేసిన వ్యాఖ్య‌లు హిందువుల‌లో ఆగ్ర‌హం తెప్పించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ ను టార్గెట్ చేసి మీడియా ఎదుట ఫేమ్ అయిన క‌త్తి మ‌హేష్ ఉన్న‌ట్లుండి వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేయ‌డం, చేసిన వ్యాఖ్య‌లు ఉప‌సంహ‌రించుకోకుండా, క్ష‌మాప‌ణ‌లు చెప్ప‌కుండా ఇంకా రెచ్చ‌గొట్టే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. ఈ వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో తెలంగాణ పోలీసులు ఆయ‌న‌ను తెలంగాణ నుండి బ‌హిష్క‌రించ‌డం కూడా జరిగింది.

ఈ ఇద్ద‌రు ఆంధ్రాకు చెందిన వ్య‌క్తులు. తెలంగాణ రాష్ట్రంతో వారికి ఎలాంటి సంబంధం లేదు. కానీ తెలంగాణ గ‌డ్డ‌మీద ఉండి వారు ప్ర‌జ‌ల మ‌నోభావాల‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నంలో ఒక‌రు, ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టే ప‌నిలో ఒక‌రు ప‌డి తెలంగాణ‌లో అల‌జ‌డులు సృష్టించే ప్ర‌య‌త్నం చేస్తున్నారా ? అని భావించాల్సి వ‌స్తుంది. తెలంగాణ‌కు చెందిన వ్య‌క్తిని ముఖ్య‌మంత్రి ప‌ద‌వి నుండి దించేందుకు హైద‌రాబాద్ లో మ‌త‌క‌ల్లోలం సృష్టించిన చరిత్ర ఆంధ్రా నేత‌కు ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప‌డిన త‌రువాత తెలంగాణ ప్ర‌భుత్వాన్ని అస్థిర ప‌రిచేందుకు ఈ నాలుగేళ్ల‌లో అనేక ప్ర‌య‌త్నాలు జ‌రిగాయి. ఓటుకునోటుతో ఈ విషయం నిరూపితం కూడా అయింది. ఈ నేప‌థ్యంలో మ‌రో ర‌కంగా వీరిద్ద‌రూ తెలంగాణ‌లో ప్ర‌శాంత వాతావ‌ర‌ణం దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని భావించాల్సి వ‌స్తుంది. ఏది ఏం జ‌రిగినా చైత‌న్య‌వంత‌మ‌యిన తెలంగాణ స‌మాజం ఇలాంటి వారి ప‌ట్ల అప్ర‌మ‌త్తంగా ఉండాలి.

 

(Visited 337 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *