అవ‌నిపై అద్భుతం యాదాద్రి

అవ‌నిపై అద్భుతం యాదాద్రి

స‌మైక్య పాల‌న‌లో అభివృద్దికి నోచుకోక‌ నిరాద‌ర‌ణ‌కు గుర‌యిన తెలంగాణ దేవాల‌యాలు స్వ‌రాష్ట్రంలో కొత్తసొబ‌గులు అద్దుకుంటున్నాయి. యాదాద్రి పుణ్య‌క్షేత్రం పున‌ర్నిర్మాణం ప‌నులుచూస్తే ఔరా అనిపించ‌కమాన‌దు. ముఖ్య‌మంత్రి కేసీఆర్ ప్ర‌త్యేక చొర‌వ‌తో నిర్మిత‌మ‌వుతున్న ఈ క్షేత్రం ఆధ్యాత్మికవేత్తలు, నిర్మాణ రంగ నిపుణులు, స్థపతులు సైతం అబ్బుర పడేలా ప‌నులు సాగుతున్నాయి.

ముఖమండపం, సప్త గోపురాలు, ప్రాకారాలు దేనికదే ప్రత్యేకతను సంతరించుకొంటున్నాయి. అష్టభుజి మండపాలు, యాళి స్తంభాలు, పొదికలు, బాలపాదాలు ప్రాకార మండపానికి వినూత్న శోభను తెచ్చిపెడుతున్నాయి. ఉత్తర, తూర్పు పంచతల రాజగోపురాల నిర్మాణంలో అనేకానేక దేవతల విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. దసరా నాటికి ప్రధాన ఆలయ మండపం పూర్తి చేసి.. గర్భాలయంలో భక్తులకు స్వామివారి దర్శనాలు కల్పించాలనే లక్ష్యంతో పనులను వేగవంతం చేశారు.

(Visited 205 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *