ప‌ది మంది స‌జీవ‌ద‌హ‌నం

ప‌ది మంది స‌జీవ‌ద‌హ‌నం

వరంగల్‌ పరిధిలోని కోటిలింగాల వద్ద ఉన్న ఓ బాణాసంచా గోడౌన్ లో ఈ ఉదయం భారీ అగ్నిప్రమాదం సంభవించగా, అందులో పనిచేస్తున్న ప‌దిమంది కార్మికులు సజీవ దహనం అయ్యారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది రెండు ఫైరింజన్లతో వచ్చి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. గోడౌన్ లో భారీ ఎత్తున బాణాసంచా ఉండటంతో అవన్నీ పేలుతుండటం వల్లే మంటలను అదుపు చేయడం కష్టంగా ఉందని, మరికాసేపట్లో మంటలు తగ్గుతాయని ఓ అధికారి తెలిపారు.

కాగా, మంటలంటుకున్న సమయంలో గౌడౌన్ లో 15 మంది ప‌నిచేస్తుండ‌గా కొంద‌రు పరుగులు పెడుతూ బయటకు వచ్చారు. వీరికి కూడా కాలిన గాయాలు అయ్యాయి. వీరిని సమీపంలోని ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తుండగా, ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా భారీ శబ్దాలతో మంటలు చెలరేగడంతో ఇక్కడి ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.

(Visited 77 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *