సోనాలీ అభిమానుల‌కు చేధు వార్త‌

సోనాలీ అభిమానుల‌కు చేధు వార్త‌

ప్రముఖ సినీ నటి సోనాలి బింద్రే అభిమానుల‌కు ఇది చేధు వార్త‌. తాను హైగ్రేడ్ క్యాన్స‌ర్ ఉన్న‌ట్లు కొద్ది రోజుల క్రితం వైద్య ప‌రీక్ష‌ల్లో తేలింద‌ని ఆమె త‌న ట్విట్ట‌ర్ ఖాతా ద్వారా వెల్ల‌డించింది. క్యాన్స‌ర్‌ని రూపు మాప‌డానికి తక్షణ చర్య తీసుకోవడమే త‌ప్ప మ‌రో మార్గం లేదు. నా వైద్యులు సలహా ఇచ్చినట్లుగా, నేను ప్రస్తుతం న్యూయార్క్లో చికిత్స పొందుతున్నాను. మేము ఆశాజనకంగా ఉండి, ప్రతి దశలో పోరాడాలని నేను నిశ్చయించుకున్నాను. గత కొన్ని రోజుల్లో నేను పొందిన ప్రేమ మరియు మద్దతు అపారమైన నిరుత్సాహంగా ఉంది, దీనికి నేను చాలా కృతజ్ఞురాలిని ఆమె ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.

కొన్ని సందర్భాల్లో తక్కువగా ఊహించినప్పుడు అనుకోనివి జరుగుతుంటాయి. హై గ్రేడ్ కేన్సర్ నాకున్నట్టు ఇటీవలే తేలింది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు వ్యాపించింది. అదే పనిగా నొప్పి వేధిస్తుండడంతో పరీక్షలు నిర్వహించగా ఊహించనది బయపడింది. నేను జీవితంపై ఆశను కోల్పోలేదు, వ్యాధిపై పోరాటం చేస్తానని ధైర్యంగా వెల్ల‌డించింది సోనాలి బింద్రే.

1994లో గోవిందా స‌ర‌స‌న ఆగ్ చిత్రంలో న‌టించిన సోనాలి బింద్రే, తెలుగులో మ‌హేష్ స‌ర‌స‌న మురారి, శ్రీ‌కాంత్ స‌ర‌స‌న ఖ‌డ్గం, నాగార్జున స‌ర‌స‌న మ‌న్మ‌ధుడు, చిరంజీవి స‌ర‌స‌న ఇంద్ర‌, శంక‌ర్ దాదా ఎంబీబీఎస్ సినిమాల‌లో న‌టించింది. 2002లో ఓ ద‌ర్శ‌కుడిని పెళ్లి చేసుకున్న సోనాలీ 2005లో ఓ కుమారుడికి జ‌న్మ‌నిచ్చింది. అత‌ని పేరు ర‌ణ్ వీర్. అందాల‌న‌టి వ్యాధి బారిన ప‌డ‌డం అభిమానుల‌ను విషాధంలోకి నెట్టింది.

(Visited 129 times, 3 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *