వ‌రికి మ‌ద్ద‌తుధ‌ర పెంపు

వ‌రికి మ‌ద్ద‌తుధ‌ర పెంపు

వరికి కనీస మద్దతు ధరను భారీగా పెంచింది కేంద్ర ప్రభుత్వం. 2018-19 ఏడాదికిగాను క్వింటాలుకు రూ.200 మేర మద్దతు ధరను పెంచినట్లు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు. దీంతో క్వింటాలుకు మద్దతు ధర రూ.1750కి చేరింది. వరితోపాటు మరో 13 ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను పెంచడానికి కూడా ప్రభుత్వం అంగీకరించింది. కనీస మద్దతు ధరను ఉత్పత్తి ఖర్చుకు కనీసం ఒకటిన్నర రెట్లు చేస్తామని ఈ మధ్యే ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. వచ్చే కేబినెట్ సమావేశంలో దీనికి ఆమోదం తెలుపుతామని ఆయన చెప్పారు.

(Visited 70 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *