ఇలాంటి ముఖ్య‌మంత్రిని చూడ‌లేదు

ఇలాంటి ముఖ్య‌మంత్రిని చూడ‌లేదు

నేను కూడా రైతుబిడ్డ‌నే. దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ప‌నిచేశాను. కానీ ఎక్క‌డ కూడా రైతు జీవిత‌భీమా లాంటి ప‌థ‌కాల‌ను ఊడ‌లేదు. ఈ రోజు ఎల్ఐసీకి మంచిదినం. రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉంది. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతుబంధు. ఇలాంటి ముఖ్య‌మంత్రిని ఎక్క‌డా చూడ‌లేదు అని ఎల్ఐసీ చైర్మ‌న్ వీకె శ‌ర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడారు.

రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. కేసీఆర్ విజన్ ఉన్న లీడర్. తెలంగాణ‌లో అభివృద్ధి కార్యక్రమాల కోసం ఎల్‌ఐసీ రూ. 40 వేల కోట్లు పెట్టుబడులు పెట్టింది. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ఎప్పుడూ ఆసక్తి కనబరుస్తాం. రైతు జీవిత బీమా పరిహారం ఇచ్చేందుకు పది రోజులకు మించి సమయం తీసుకోబోమని హామీ ఇస్తున్నామని వీకే శర్మ ఈ సంధ‌ర్భంగా స్పష్టం చేశారు.

(Visited 143 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *