June 2018

కెసిఆర్ పాల‌న‌లోనే మైనారిటీల సంక్షేమం

ముఖ్య‌మంత్రి కేసీఆర్ నాయ‌క‌త్వంలోనే మైనారిటీల సంక్షేమానికి పెద్ద‌పీట వేయ‌డం జ‌రుగుతుంద‌ని, గంగాజ‌మునత‌హ‌జీబ్ లాంటి తెలంగాణ సంస్కృతిని కాపాడ‌డంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ ముందున్నార‌ని యూకే ఎన్నారైలు అభిప్రాయ‌ప‌డ్డారు. రంజాన్ ఉపవాస దీక్షలను పురస్కరించుకుని ఎన్నారై టి .ఆర్ .యస్ యుకె మరియు తెలంగాణ అసోసియేషన్ అఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్ ) ఆధ్వర్యంలో లండన్ లో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇచ్చారు. ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ యుకె ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి ఆద్వర్యం లో ఏర్పాటు చేసిన విందు కార్యక్రమం లో హైదరాబాద్ అసోసియేషన్ అఫ్ యుకె సభ్యుల తో పాటు స్థానిక ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

ఇలాంటి ముఖ్య‌మంత్రిని చూడ‌లేదు

నేను కూడా రైతుబిడ్డ‌నే. దేశంలోని వివిధ ప్రాంతాల‌లో ప‌నిచేశాను. కానీ ఎక్క‌డ కూడా రైతు జీవిత‌భీమా లాంటి ప‌థ‌కాల‌ను ఊడ‌లేదు. ఈ రోజు ఎల్ఐసీకి మంచిదినం. రైతుల కోసం ఒప్పందం కుదుర్చుకోవడం గర్వకారణంగా ఉంది. రైతుకు జీవిత బీమా చాలా గొప్ప కార్యక్రమం. ముఖ్యమంత్రి కేసీఆర్ నిజమైన రైతుబంధు. ఇలాంటి ముఖ్య‌మంత్రిని ఎక్క‌డా చూడ‌లేదు అని ఎల్ఐసీ చైర్మ‌న్ వీకె శ‌ర్మ అన్నారు. హెచ్‌ఐసీసీ వేదికగా రైతుబీమాపై ప్రభుత్వం, ఎల్‌ఐసీ మధ్య ఎంవోయూ కుదిరింది. ఈ సందర్భంగా ఎల్‌ఐసీ చైర్మన్ వీకే శర్మ మాట్లాడారు. రైతుల కోసం ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతో కష్టపడుతున్నారు. కేసీఆర్ విజన్ ఉన్న లీడర్.

రైతుబంధుతో కొన్ని పార్టీలు దివాళా

ఇది పక్కా రైతు పక్షపాత ప్రభుత్వం. రైతు సంక్షేమం కోరి రైతుబంధు, రైతుబీమా పథకం అమలు చేస్తున్నాం. రైతుబంధు ప‌థ‌కంతో కొన్ని రాజ‌కీయ పార్టీలు దివాళా తీశాయి. పేరుకే పెద్ద రైతు.. వెనక్కి తిరిగి చూస్తే అన్ని అప్పులే. రైతుకు కులం లేదు. ఎవరికి భూమి ఉంటే వారే రైతు. అందరికీ అన్నం పెట్టే రైతు చల్లగా ఉండాలి. రైతు క్షేమంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుంది అని రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ అన్నారు. రైతుబంధు పథకంతో రాష్ట్ర రైతాంగమంతా సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ఆగస్టు 15 నుంచి రైతుబీమా పథకం అమలు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. హెచ్‌ఐసీసీ

హ‌ర‌గోపాల్ గారి నిదుర‌లేని రాత్రులు !

రాజ‌శేఖ‌ర్ రెడ్డి లాంటి రాయ‌ల‌సీమ రాజకీయాల నుండి వ‌చ్చినాయ‌న‌ అధికారంలో ఉన్న‌ప్పుడు ప్ర‌తి రోజూ ఉద‌యం త‌న‌ను క‌లిసేందుకు వ‌చ్చిన వారిని ఖ‌చ్చితంగా క‌లుసుకునేవారు. నిజానికి ఈ చ‌ర్చ ఇలా జ‌ర‌గ‌డానికి, చ‌ర్చ‌లో ఉద్రిక్త‌త‌ల‌కు ప్ర‌జాస్వామ్య ప‌రిస్థితులు తెలంగాణ‌లో లేక‌పోవ‌డం కార‌ణం. ఈ నాలుగేళ్ల‌లో ఈ ప‌రిస్థితి లేక‌పోవ‌డం మూలంగా చాలా మంది ఈ వేదిక మీద చెప్పుకుంటున్నారు. ఉద్య‌మ‌నేత ముఖ్య‌మంత్రి అయ్యారు. కానీ క‌రీంన‌గ‌ర్ గ‌డీ సంస్కృతిని న‌డిపిస్తున్నారు. ఎవ‌రొచ్చినా వారు చెప్పే మాట‌లు వినాల‌ని ముఖ్య‌మంత్రికి చెబుతున్నాను. ఓ ప్రైవేటు టీవీ ఛాన‌ల్ చ‌ర్చా కార్య‌క్ర‌మంలో ప్రొఫెస‌ర్ హ‌ర‌గోపాల్ అన్న మాట‌లివి. నిజంగా ఆయ‌న మాట‌లు

స‌క‌ల జ‌నుల సంక్షేమ‌మే తెలంగాణ‌

“సంపద సృష్టించాలి. సృష్టించిన సంపదను ప్రజలకు పంచాలి’’ అనే సూత్రం ప్రాతిపదికగా తెలంగాణ ప్రభుత్వం పురోగమిస్తున్నది. సకలజనుల సంక్షేమానికి పాటుపడుతున్నది అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. పరేడ్ గ్రౌండ్ లో జరిగిన తెలంగాణ రాష్ర్టావతరణ వేడుకల సందర్భంగా సీఎం ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజానీకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలర్పించిన అమరులకు ఈ సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను. తెలంగాణ అవతరించి నేటికి నాలుగు సంవత్సరాలు. మనం కలలుగంటున్న బంగారు తెలంగాణ నిర్మాణం దిశగా ఈ నాలుగేళ్లలో బలమైన అడుగులు వేయగలిగాం.

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరంలో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా ఉపాధ్యక్షుడు రాజేష్ గిరి రాపోలు మరియు న్యూ సౌత్ వేల్స్ కన్వీనర్ ప్రవీణ్ రెడ్డి పిన్నమ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ వేడుక‌లు ఘ‌నంగా నిర్వహించారు . రాజేష్ రాపోలు, ప్రవీణ్ పిన్నమ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ నేపధ్యాన్నీ , స్వరాష్ట్రం సిద్దించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న వివిధ పథకాలను మరియు భవిష్యత్ ప్రణాళికల పట్ల పభుత్వానికున్న స్పష్టతను విపులంగా వివరించారు.బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్ ఆర్ ఐ ల ప్రాముఖ్యతను గుర్తు చేశారు. మెల్బోర్న్ లో టి ఆర్ ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి