ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప

ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసి య‌డ్యూర‌ప్ప త‌న కోరిక‌ను మ‌రోసారి నెర‌వేర్చుకున్నారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ఈ ఉద‌యం ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా ప్ర‌మాణ స్వీకారం సాగింది. య‌డ్యూర‌ప్ప‌కు బీజేపీ శ్రేణులు భారీ స్వాగ‌తం ప‌లికాయి. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు యడ్యూరప్ప రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

క‌ర్టాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి 104 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. శాస‌న‌స‌భ‌లో ఉండాల్సిన 112 స్థానాల‌కు ఎనిమిది స్థానాలు త‌క్కువ‌గా ఉన్నాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం మేర‌కు 15 రోజుల‌లో బ‌లం నిరూపించుకుంటాన‌ని య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ స్వీకారం చేశారు.

(Visited 37 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *