ప్ర‌జాస్వామ్యం ఖూనీ .. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతుంది

ప్ర‌జాస్వామ్యం ఖూనీ .. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతుంది

మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం కోసం ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించి ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు.

అయితే రాహుల్ కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ట్విట్ట‌ర్ లోనే స‌మాధానం ఇచ్చారు. కర్ణాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది…? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయింది. జేడీఎస్ కేవలం 37 సీట్లలోనే గెలుచుకుంది. పలు సీట్లలో డిపాజిట్లు కూడా కోల్పోయింది. ప్రజలు అర్థం చేసుకోగలరు అని అమిత్ షా పేర్కొన్నారు.

(Visited 94 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *