May 2018

ప్ర‌జాస్వామ్యం ఖూనీ .. ప్ర‌జ‌ల‌కు అర్ధ‌మ‌వుతుంది

మెజారిటీకి అవసరమైన సంఖ్యాబలం లేనప్పటికీ క‌ర్ణాట‌క‌లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అధికారం కోసం ప‌ట్టుద‌ల‌ను ప్ర‌ద‌ర్శించి ప్ర‌జాస్వామ్యాన్ని బీజేపీ ఖూనీ చేసింద‌ని కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. బీజేపీ విజయోత్సవాలను జరుపుకుంటూ ఉంటే, భారతావని ప్రజాస్వామ్యం ఖూనీ కావడాన్ని చూసి మౌనం పాటిస్తోందని అన్నారు. భారత రాజ్యాంగాన్నీ బీజేపీ అపహాస్యం చేసిందని రాహుల్ ట్వీట్ లో పేర్కొన్నారు. అయితే రాహుల్ కు బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా ట్విట్ట‌ర్ లోనే స‌మాధానం ఇచ్చారు. కర్ణాటకలో ప్రజాతీర్పు ఎవరికి ఉంది…? బీజేపీ 104 సీట్లు గెలుచుకుంది. కాంగ్రెస్ 78 సీట్లకు పడిపోయింది. జేడీఎస్ కేవలం

య‌డ్యూర‌ప్ప‌కు సుప్రీం కొర్రీ

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా గ‌వ‌ర్న‌ర్ విచ‌క్ష‌ణాధికారంతో ప్ర‌మాణ స్వీకారం చేసిన య‌డ్యూర‌ప్ప‌కు సుప్రీం కోర్టు నిర్ణ‌యం ఇబ్బందిక‌రంగా మారింది. గ‌వ‌ర్న‌ర్ బ‌ల‌నిరూప‌ణ‌కు 15 రోజులు గ‌డువు ఇచ్చినా సుప్రీం కోర్టు మాత్రం బీజేపీకి ఉన్న 104 మంది ఎమ్మెల్యేలు కాకుండా, ఎవరెవరు మద్దతు పలుకుతున్నారన్న జాబితాను సంత‌కాల‌తో త‌క్ష‌ణం త‌మ ముందు ఉంచాల‌ని ఆదేశించింది. దీంతో ఈ రోజు త‌మ‌కు మ‌ద్ద‌తు ప‌లుకుతున్న మిగ‌తా ఎమ్మెల్యేల పేర్ల జాబితాను బీజేపీ సుప్రీం కోర్టు ముందు ఉంచాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. అదే జ‌రిగితే క‌ర్నాట‌క‌లో ప్ర‌కంప‌న‌లు రేగ‌నున్నాయి. సుప్రీంకు స‌మ‌ర్పించిన జాబితాలోని వ్య‌క్తులే స‌భ‌లో బీజేపీకి మ‌ద్ద‌తు ప‌ల‌కాల్సి ఉంటుంది. లేకుంటే

ముఖ్య‌మంత్రిగా య‌డ్యూర‌ప్ప

క‌ర్ణాట‌క ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం స్వీకారం చేసి య‌డ్యూర‌ప్ప త‌న కోరిక‌ను మ‌రోసారి నెర‌వేర్చుకున్నారు. బెంగళూరులోని రాజ్ భవన్ లో గవర్నర్ వాజూభాయ్ ఆయనతో ఈ ఉద‌యం ప్రమాణ స్వీకారం చేయించారు. పెద్ద హంగూ ఆర్భాటాలు లేకుండా ప్ర‌మాణ స్వీకారం సాగింది. య‌డ్యూర‌ప్ప‌కు బీజేపీ శ్రేణులు భారీ స్వాగ‌తం ప‌లికాయి. ప్రమాణ స్వీకారానికి వచ్చే ముందు యడ్యూరప్ప రాధాకృష్ణ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. క‌ర్టాట‌క ఎన్నిక‌ల్లో బీజేపీకి 104 సీట్లు మాత్ర‌మే వ‌చ్చాయి. శాస‌న‌స‌భ‌లో ఉండాల్సిన 112 స్థానాల‌కు ఎనిమిది స్థానాలు త‌క్కువ‌గా ఉన్నాయి. అయితే గ‌వ‌ర్న‌ర్ నిర్ణ‌యం మేర‌కు 15 రోజుల‌లో బ‌లం నిరూపించుకుంటాన‌ని య‌డ్యూర‌ప్ప ప్ర‌మాణ

ఫెడరల్ ఫ్రంటే ప్రత్యామ్నాయం

కర్ణాటక ఎన్నికల ఫలితాలు వచ్చాయి. బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించగా, కాంగ్రెస్ అధికారానికి దూరంగా ఉండిపో యింది. అధికారం అందుకోవాలన్న పార్టీలకు జేడీఎస్ కీలకంగా మారిం ది. ఇప్పటికే కాంగ్రెస్ జేడీఎస్‌కు భేషరతు మద్దతు తెలుపగా, అతిపెద్ద పార్టీగా తమకే అవకాశం ఇవ్వాలని బీజేపీ కోరుతున్నది. మునుముందు అక్కడ ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు? కాంగ్రెస్, జేడీఎస్ పార్టీలు తమ ఎమ్మెల్యేలు బీజేపీ వలలో పడకుండా ఆపగలుగుతాయా? అన్న విషయాన్ని పక్కనపెడితే, ముఖ్యమంత్రి కేసీఆర్ కొద్దిరోజుల కిందట బెంగళూరు పర్యటన సందర్భంగా వేసిన అంచనాలు, చేసిన వ్యాఖ్యలు నిజమయ్యాయి. కర్ణాటక ఎన్నికల్లో జేడీఎస్ కీలకంగా మారుతుందని కేసీఆర్ అన్నారు.

మొఖం చాటేసిన కాంగ్రెస్

మ‌న ప‌క్కింట్ల ఏద‌యినా ఇబ్బంది అయితే వెళ్లి ఏం జ‌రుగుతుంద‌ని ఆరాతీస్తాం .. అవ‌స‌రం అయితే మ‌న‌కు చేత‌న‌యిన సాయం చేస్తాం .. మ‌న ఇంట్లో ఏద‌యినా శుభం జ‌రిగితే ఇరుగూ పొరుగూ పిలుచుకుని సంతోషాన్ని పంచుకుంటాం. మ‌న ప‌క్కిళ్లు ఆనందంగా ఉంటే మ‌న‌మూ ఆనందంగా ఉంటాం. కానీ తెలంగాణ కాంగ్రెస్ నాయ‌కుల వ్య‌వ‌హారం మాత్రం ఊరంతా ఒక చింత ఉంటే ఊసుకండ్లోడికి దోమ‌ల చింత అన్న‌ట్లు ఉంది. గ‌త నాలుగేళ్లుగా తెలంగాణ ప్ర‌భుత్వం ప్రాజెక్టుల చేప‌ట్టినా, సాగునీళ్లు ఇచ్చినా, మిష‌న్ కాక‌తీయ‌, మిష‌న్ భ‌గీర‌థ ఇప్పుడు రైతుబంధు ఏ ప‌థ‌కం చేప‌ట్టినా దానిని విమ‌ర్శించ‌డ‌మే ప‌నిగా కాంగ్రెస్

విజ‌యాన్ని చూడ‌లేక‌ విషం కక్కుతున్నారు

నాలుగేళ్ల ప‌సిగుడ్డు తెలంగాణ అనేక కుట్ర‌ల‌ను చేధించి, అనేక స‌వాళ్ల‌ను అధిగ‌మించి, అనేక ఆంక్ష‌ల‌ను దాటుకుని ముఖ్య‌మంత్రి కేసీఆర్ సార‌ధ్యంలో అనేక రంగాల‌లో విజ‌య‌బావుటా ఎగుర‌వేస్తుంది. దేశం దృష్టిని, ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షించి అభినంద‌న‌లు అందుకుంటుంది. తెలంగాణ ప‌థ‌కాలు ఇప్పుడు దేశంలోని వివిధ రాష్ట్రాల‌కు ఆద‌ర్శం అవుతున్నాయి. తెలంగాణ ప‌థ‌కాలు అవ‌లంభిస్తామ‌ని ప‌లు రాష్ట్రాలు త‌మ త‌మ బృందాల‌ను తెలంగాణ‌కు పంపి అధ్య‌య‌నం చేయిస్తున్నాయి. అందులో కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాలు ఉండ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. కానీ తెలంగాణ విజ‌యాలు ప్ర‌పంచాన్ని ఆక‌ర్షించినా ఆంధ్రా మీడియాను మాత్రం ఆక‌ర్షించ‌లేక‌పోతున్నాయి అన‌డం కంటే తెలంగాణ రాష్ట్ర విజ‌యాల‌ను ఈ ప‌త్రిక‌లు