కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

కాగ్ నివేదికపై కాంగ్రెస్ ఈక‌లు

తెలంగాణలో ఆదాయ అభివృద్ధిని కాగ్ ప్రశంసించింది. కాగ్ అనేది దేశవ్యాప్త సంస్థ. తెలంగాణ సంక్షేమానికి ప్రభుత్వం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నదని కాగ్ ప్రశంసించింది. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు కాగ్ నివేదిక ఏమన్నా బైబిలా, భగవద్గీతనా లేక ఖురానా అని ఎద్దేవా చేశారు. ఇప్పుడేమో కాగ్ నివేదిక బ్రహ్మాస్తం అంటున్నారు అని మంత్రి హరీశ్ రావు ప్ర‌శ్నించారు. దీనిపై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేస్తున్నది. కాంగ్రెస్ నాయకులు కాగ్ నివేదికపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నరు. కాంగ్రెస్ ఇదే తీరుతో పోతే వచ్చే సారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదు. ఈ విషయంలో చర్చకు వస్తే కాంగ్రెస్‌కే నష్టం అని హెచ్చ‌రించారు.

కాంగ్రెస్ నేతల హామీల్లో నిజాయతీ లేదని ప్రజలే గుర్తిస్తున్నారు. అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ముందు ఇచ్చిన హామీలు ముందు నెరవేర్చండి అని హ‌రీష్ రావు సూచించారు. కేసులతో రాష్ట్ర ప్రగతికి కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నరు. బస్సు యాత్ర పేరుతో తిరుగుతున్న కాంగ్రెస్ నేతలను రైతులు నిలదీయాలి అని పిలుపునిచ్చారు. కాగ్‌కు సామాజిక అవగాహన లేదని సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు అన్నారు. కాగ్‌కు ప్రభుత్వాన్ని తప్పుపట్టే అర్హత లేదని సీఎంగా ఉన్నప్పుడు రాజశేఖర్‌రెడ్డి అన్నారు. కాగ్ నివేదిక తప్పుల తడక అని ప్రధానిగా ఉన్నప్పుడు మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో అన్నారని హరీశ్ రావు కాంగ్రెస్ ద్వంద‌నీతిని గుర్తు చేశారు.

కాంగ్రెస్ నేతల వైఖరి రెండు నాలుకల ధోరణి. బీజేపీ పాలిత ప్రాంతాల్లో కాగ్ నివేదిక మరొక రకంగా, కాంగ్రెస్, ఇతర పార్టీల పాలిత ప్రాంతాల్లో కాగ్ నివేదిక మరోలా ఉంది. బీజేపీ పాలిత ప్రాంతాల్లో అప్పులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తే కాగ్ అభ్యంతరం చెప్పలేదు. బీజేపీయేతర పాలిత ప్రాంతాల్లో అప్పులను తీసుకురావడాన్ని తప్పుబడుతున్నది. గుజరాత్‌లో మోడీ 9 ఏండ్ల పాలనపై కాగ్ నివేదిక ఇచ్చింది. మోడీ ప్రభుత్వంలో అవినీతిని ఎత్తి చూపింది. కాంగ్రెస్ కోడిగుడ్డు మీద ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నది. సీఎం కేసీఆర్ పాలనలో ఒక్క అవినీతి ఆరోపణ లేదు. అందుకే కాగ్ నివేదికను పట్టుకుని రాద్ధాంతం చేస్తున్నరు.. అని హ‌రీష్ రావు విమ‌ర్శించారు.

(Visited 50 times, 1 visits today)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *